»   »  సర్జరీ వికటించి...టీవీ నటుడు మృతి

సర్జరీ వికటించి...టీవీ నటుడు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
TV actor Rakesh dies following weight loss surgery
ఇండోర్‌: బుల్లితెర నటుడు రాకేష్‌ దివాన్‌(48) ఆదివారం మృతిచెందారు. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఆయన ఇటివలే 'బేరియాట్రిక్‌' శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చింది.

''రాకేష్‌ను డిశ్చార్జీ చేసినప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. కొద్దిరోజుల్లోనే తీవ్రమైన రక్తపోటు, మెదడు పనితీరు దెబ్బతిన్న స్థితిలో ఆయన్ను మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు'' అని పేర్కొంది. 2008-09లో ప్రసారమైన రామాయణంలో పోషించిన కుంభకర్ణుడి పాత్ర పరిశ్రమలో రాకేష్‌కు పేరు తీసుకొచ్చింది.

English summary
Television actor Rakesh Diwana, who played the role of Kumbhkarna in popular serial 'Ramayana' telecast in 2008-09, died here today. He was 48. He had developed complications following a weight loss surgery he underwent at a hospital here four days back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu