టీవీ ఆర్టిస్టుపై రేప్ కేసు
ముంబై: టీవి నటుడు యష్ పండిట్ అత్యాచారం కేసులో ఇరుక్కున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యష్ పండిట్(34) 'క్యుంకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్‌లో నటిస్తున్నారు. ఈ సీరియల్ చిత్రీకరణలో భాగంగా ఓ యువతితో యష్‌కి పరిచయం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యష్ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
గత కొద్దిరోజులుగా యష్ ఆమెకు కనిపించకుండా తిరుగుతూ.. ఆమె ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో ఆ యువతి అతనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న యష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముంబయి సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేశాడని పోలీసులు చెప్పారు.


Click it and Unblock the Notifications











