ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి.. గడ్డు పరిస్థితుల్లో టాప్ యాంకర్

మహారాష్ట్రలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ వల్ల సినీ, టెలివిజన్ రంగానికి చెందిన కళాకారులు, వేతన కార్మికులకు గడ్డు పరిస్థితి ఎదురవుతున్నది. ఈ సందర్బంగా హిందీ టెలివిజన్ రంగంలోని టాప్ టీవీ యాంకర్ మనీష్ పాల్ ఒకప్పటి పరిస్థితిని గుర్తు చేసుకొని ఆవేదనకు గురయ్యారు. నా కష్టకాలంలో నాకు తోడుగా నా ఒకప్పటి ప్రియురాలు, ప్రస్తుత సతీమణి సంయుక్త అండగా నిలిచిందని తెలిపారు.

సంయుక్త నాకు చిన్నతనం నుంచే పరిచయం. ఇద్దరం ఒకే స్కూల్‌లో చదువుకొన్నాం. అప్పటి నుంచే నాకు ఆమె అంటే ఇష్టం. డిగ్రీ పూర్తయిన రత్వాత మేమిద్దరి డేటింగ్ చేశాం. ఆ సమయంలో కెరీర్ కోసం సంయుక్త సలహా మేరకు నేను ముంబైకి వచ్చాను. అప్పుడు రోజులు భారంగా గడిచాయి. చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యాను. నేను ఆర్జేగా ఫుల్‌టైమ్ జాబ్ చేసేవాడిని. ఆ సమయలోనే పెళ్లి చేసుకొన్నాం. ఆమె టీజర్ జాబ్ చేసేది. నేను యాంకర్‌గా కొన్ని షోలకు పనిచేసే వాడిని అని తెలిపారు.

 TV anchor Maniesh Paul recalls his bad days of initial career

2008లో ఉద్యోగం లేకుండా పోయింది. ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాంటి సమయంలో మన మీద మనకు నమ్మకం కోల్పోవద్దని నా భార్య చెప్పేది అని మనీష్ పాల్ తెలిపారు. ఆ తర్వాత యాంకర్‌గా మంచి అవకాశాలు రావడంతో ఆర్థికంగా నిలదొక్కకున్నానని చెప్పారు.

మనీష్ పాల్ కెరీర్ విషయానికి వస్తే. . బా బా బ్లాక్ షిప్, మీకీ వైరస్, తేరే బిన్ లాడెన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. జలక్ దిఖ్లా జా, సారేగామపా, లిటిల్ ఛాంప్స్ 2020, ఇండియా గాట్ టాలెంట్, డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్ లాంటి షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X