»   »  ఆత్మహత్యకు పాల్పడ్డ ...టీవీ నటి దీప్తి కుమార్తె అదృశ్యం

ఆత్మహత్యకు పాల్పడ్డ ...టీవీ నటి దీప్తి కుమార్తె అదృశ్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇంతకుముందు హైదరాబాద్‌లో పరిస్దితుల్లో మరణించిన టీవీ నటి దీప్తి కుమార్తె జ్యోతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిందని పార్వతీపురం పట్టణ ఎస్సై వి.అశోక్ కుమార్ ఆదివారం రాత్రి తెలిపారు. పట్టణంలోని కొత్తవలస నందమూరి కాలనీకి చెందిన పెయింటర్, జ్యోతి తండ్రి జొన్నాడ ఈశ్వరరావు(శంకర్) చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఎస్సై అందించిన వివరాలిలా ఉన్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నెల 8న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కిరాణా దుకాణానికి వెళ్లివస్తానని జ్యోతి తన నానమ్మకు చెప్పి వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఈశ్వరరావు రాత్రి పెయింటింగ్ పని నుంచి వచ్చి కుమార్తె గూర్చి ఆరా తీయగా ఈ విషయం తెలిసింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. జ్యోతి స్థానిక ఆర్‌సీఎం పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.

దీప్తి ఆత్మ హత్య విషయానికి వస్తే...

టీవీ నటి దీప్తి(30) ఈ సంవత్సరం ..ఫిబ్రవరి నెలలో ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ బాలానగర్‌లోని ఫతేనగర్‌లో నివాసముంటున్న దీప్తి తన అపార్ట్‌మెంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలను వెల్లడిస్తూ.. దీప్తి అలియాస్ రామలక్ష్మీ స్వస్థలం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. ఆహ్హానం, ఆడదే ఆధారం వంటి తదితర సీరియల్స్‌లో ఆమె నటించింది.

Tv artist Deepthi Daughter missing

సంఘటనాస్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అర్థరాత్రి అనంతరం తను నివాసముంటున్న అపార్ట్‌మెంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడుతూ ఐ ప్యాడ్‌లో సెల్ఫీ ఫోటోలను కూడా తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు.

సనత్ నగర్ ఇన్స్‌పెక్టర్ హరిశ్చంద్రా రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దీప్తి (31)కి విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయుడైన పెయింటర్ శంకర్‌తో వివాహమైంది. ఓ కుమార్తె ఉంది. సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాదు వచ్చిన దీప్తి.. ఆహ్వానం, ఆడదే ఆధారం తదితర సీరియళ్లలో నటించింది. పెళ్లామా ప్రియురాలా, కొత్తొక వింత తదితర చిత్రాల్లో నటించారు. ఓ సీరియల్‌కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

భర్తతో విభేదాల కారణంగా దీప్తి నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. ఫతేనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని డ్రీమ్స్ స్టూడియో ఏర్పాటు చేసి నటన, వ్యాఖ్యానం, నృత్యంలో శిక్షణ ఇస్తోంది. బుల్లితెర దర్శకుడైన రమేష్‌తో సహజీవనం చేస్తోంది. శుక్రవారం దీప్తి, రమేష్‌లు బయటకు వెళ్లి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చారు. ఆ తర్వాత తాను బయటకు వెళ్లి 11 గంటలకు వచ్చానని, దీప్తి తలుపుతీయక పోవడంతో బాల్కనీలోని వెనుక వైపున ఉన్న పడక గది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో వేలాడుతూ కనిపించిందని రమేష్ చెప్పాడు. ఆత్మహత్య, హత్య కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Three months back small-time TV artiste Deepthi Alias Rama Lakshmi committed suicide by hanging herself with the ceiling at her apartment in Hyderabad. now her daugher missing.
Please Wait while comments are loading...