»   » ఆమె ఘరానా మోసంతో టీవీ ఆర్టిస్టులు లబోదిబో!

ఆమె ఘరానా మోసంతో టీవీ ఆర్టిస్టులు లబోదిబో!

Posted By:
Subscribe to Filmibeat Telugu
TV Artist Vijaya Rani 10 Crores Cheating on Chit Funds
హైదరాబాద్: తెలుగు టీవీ నటి విజయరాణి దాదాపు 7 నుండి 10 కోట్ల డబ్బుతో పరారైన సంగతి తెలిసిందే. ఆ డబ్బంతా ఆమె తన తోటి నటీనటుల నుండి చిట్టీల రూపంలో వసూలు చేసింది. ఈ పరిణామాలతో ఆమె వద్ద డబ్బు పోగేసుకున్న బాధితులంతా లబోదిబోమంటున్నారు.

కాగా...పోలీసుల విచారణలో విజయరాణికి సంబంధించి పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆమె ముందస్తు వ్యూహంతోనే ఈ ఘరానా మోసానికి పాల్పడిందని అంటున్నారు. ఈ నెల 10వ తేదీనే ఆమె నివాసం ఉంటున్న ఎల్లారెడ్డిగూడ అద్దె ఇంటిని ఖాళీ చేసిందని, లారీలో సామన్లతో వెళ్లి పోయిందని ఆ ఇంటి యజమాని అంటున్నారు.

ఆమె బంధువుల ఇళ్లకు కూడా తాళాలు ఉండటంతో.....ముందస్తుగా వేసిన ప్లాన్ ప్రకారమే బంధువులను కూడా ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట ప్రాంతాల్లో ఆమె నిర్వహిస్తున్న మూడు మెస్‌లను ముందుగానే ఖాళీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

చిట్టీల పేరుతో విజయరాణి గత కొంతకాలంగా టీవీ, సినీ ఆర్టిస్టుల దగ్గర భారీ మొత్తం డబ్బు వసూలు చేస్తూ వస్తోంది. కొన్నేళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తుండటంతో చాలా మందిఆర్టిస్టులు ఆమె వద్ద డబ్బు పోగేసుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా విజయరాణి ఆచూకీ లేక పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

English summary
TV Artist Vijaya Rani 10 Crores Cheating on Chit Funds.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu