For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముదిరిన వివాదం :91 మంది టీవీ ఆర్టిస్ట్ లు అరెస్టు

  By Srikanya
  |
  Tv artists arrested for protesting dubbed serials
  హైదరాబాద్‌ : డబ్బింగ్ వివాదం రోజూ రోజుకూ ముదురుతోంది. తెలుగు టీవీ ఛానెళ్ళలో డబ్బింగ్‌ సీరియళ్ళ ప్రసారానికి వ్యతిరేకంగా ఒకపక్క టీవీ ఆర్టిస్ట్‌లు నిరాహారదీక్షలు, ధర్నాలను కొనసాగిస్తుండగా శుక్రవారం 'మా' టీవీ కార్యాలయంపై జరిగిన దాడి తరహాలోనే శనివారం 'జీ' టీవీ కార్యాలయంపైనా దాడులు జరిగాయి. అనువాద ధారావాహికలను నిలిపివేయాలంటూ ఆందోళన చేస్తున్న 91 మంది తెలుగు టీవీ కళాకారులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

  అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో మాటీవీ 'భలే ఛాన్సులే' కార్యక్రమ చిత్రీకరణ జరుగుతుండగా అక్కడికి వెళ్లిన కళాకారులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. మాటీవీ కార్యక్రమంపై దాడి చేసే అవకాశం ఉందనే ఫిర్యాదు మేరకు కళాకారులను అరెస్టు చేసినట్లు ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు. తమతో చర్చలు జరుపుతామని చెప్పి అక్కడికి పిలిపించిన మాటీవీ అధికారులు కావాలనే అరెస్టు చేయించారని కళాకారులు ఆరోపించారు.

  వివరాల్లోకి వెళితే...టీవీ ఆర్టిస్ట్‌లుగా భావింపడబుతున్న కొందరు వ్యక్తులు శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఖైరతాబాద్‌లోని 'జీ' టీవీ కార్యాలయంపై రాళ్ళు రువ్వడంతో కార్యాలయం కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై 'జీ' యాజమాన్యం సైఫాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. దాడికి పాల్పడినవారు కార్యాలయం లోపలికి వచ్చేందుకు ప్రయత్నించగా అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు రాళ్ళు రువ్వి పారిపోయారు.

  ఇదిలా ఉండగా, ఇదే రోజున నగరంలోని సారథి స్టూడియోస్‌లోకి చొరబడిన సుమారు 20 మంది టీవీ ఆర్టిస్ట్‌లను ఎస్సార్‌ నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆర్టిస్ట్‌లు స్టూడియో ఆవరణలోకి అడుగుపెట్టి అక్కడ జరుగుతున్న ఒక గేమ్‌ షో షూటింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే, తాము షూటింగ్‌లో ఉన్న టెక్నీషియన్ల మద్దతు కోసం వారిని కలుసుకునేందుకు అక్కడికి వెళ్ళామని, పోలీసులు కావాలనే అరెస్ట్‌ చేశారని ఆర్టిస్ట్‌లు ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా స్టేషన్‌ బయటే కొన్ని నిమిషాల పాటు ధర్నా చేశారు.

  అరెస్టయిన వారిలో కౌషిక్‌, సూర్య, ప్రభాకర్‌, శ్రీరామ్‌, సెల్వరాజ్‌, శ్రీనివాస్‌రెడ్డి, గిరి, మధుమణి, లక్ష్మీ, బెంగళూరు పద్మ, ఐడీపీఎల్‌ నిర్మల, బిందు, రమ్య, కరాటే కల్యాణి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనువాద సీరియళ్ల కారణంగా తెలుగు కళాకారులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయని, 90 శాతం మంది ఉపాధి కోల్పోతారని చెప్పారు. దీనిపై తాము ఆర్నెల్లుగా పోరాడుతున్నా కొన్ని ఛానెళ్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము కోరిన వెంటనే అంగీకరించి ఉగాదికి ముందుగానే అనువాద ధారావాహికలను నిలిపివేసిన రామోజీరావును ఇతర టీవీ ఛానెళ్ల వారు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

  మాటీవీ, రామానాయుడు స్టూడియోలపై దాడి నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆరుగురు బుల్లితెర నటులను శనివారం ఆరెస్ట్‌ చేశారు. వేర్వేరుగా అందిన ఫిర్యాదుల మేరకు వీరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా నటులు శ్రీరాం, కౌశిక్‌, మధుమణి, బెంగుళూరు పద్మ, అమితాబ్‌(గోపి), శివ అపురూప్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ను బుల్లితెర నటుల సమాఖ్య తీవ్రంగా ఖండించింది.

  English summary
  
 Tv artists arrested for protesting dubbed serials. Small screen artistes fixed the deadline of Ugadi for banning the serials. As MAA TV had not complied, there was an attack on its office on Friday. However, protesters took care to ensure that none would know who had attacked. Meanwhile, police arrested TV artistes who went to Sarathy Studios to stage a protest dharna there. Police also filed cases against TV artistes who raided the TV offices. Kaushik, Shiva, Madhu and some others were taken into custody. Cases were registered against them under sections 147, 148, 324, 341, 426, 452 and 149
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X