ప్రభాస్ సినిమాలో అనవసరంగా నటించా.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే.. అలాంటి క్రేజీ హీరో ప్రాజెక్ట్ లో భాగం కావాలనీ, డార్లింగ్ తో స్కీన్ షేర్ చేసుకోవాలని ఏ నటుడికైనా ఉంటుంది. అలాంటి అవకాశం కోసం ఎంతో ఆర్టిస్టులు తెగ వేయిట్ చేస్తున్నారు. అలాంటిది.. ప్రభాస్ సినిమాలో అనవసరంగా నటించనంటూ ఓ యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు?
ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన మొగలిరేకులు ఫేమ్ సాగర్. 2006 నుండి తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఆయన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసారు. అమృతం, చక్రవాకం, మొగలిరేకులు వంటి సీరియల్స్ ద్వారా సుమారుగా 2,600 ఎపిసోడ్స్‌లో నటించి, బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. ఈ సీరియల్స్ లో గుర్తింపు పొందిన సాగర్ వెండితెరపై కూడా మెరిశారు. 2001లో 'మనసంతా నువ్వే' చిత్రంతో పరిచయం అయిన సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్, సిద్ధార్థ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, షాదీ ముబారక్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ చిత్రాలు ఆయనకు పెద్ద గుర్తింపును అందించలేదు. ఆయన సుదీర్ఘకాలం తర్వాత 'ది 100' సినిమా (The 100)తో ముందుకు వచ్చారు. ఈ మూవీ జూలై 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే.. అనుకున్న స్థాయితో విజయం సాధించలేకపోయింది.

తాజాగా బుల్లితెర స్టార్ ఆర్కే సాగర్ ఇటీవల యాంకర్ సుమ గారి చాట్ షో (chaaaatshow) పాల్గొన్నారు. ఈ షోలో యాంకర్ సుమ.. రాపిడ్ ఫైర్ సెషన్‌లో నిర్వహించింది. ఈ క్రమంలో యాక్టర్ సాగర్ కు టార్గెట్ చేస్తూ సుమ ప్రశ్నలు వేసింది. 'అయ్యో అనవసరంగా ఆ సినిమాలో నటించానే అనేలా ఏమైనా సినిమాలు ఉన్నాయా? అని యాంకర్ సుమ ప్రశ్నించగా.. ప్రభాస్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ అని సమాధానం ఇచ్చాడు. 'మీ వైపు వంట బాగా చేయకున్నా బాగుంది అని ఎప్పుడైనా చెప్పారా? ' అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చాడు సాగర్. 'ఎప్పుడైనా ట్రాఫిక్ లో గొడవపడ్డారా?'అని సుమ ప్రశ్నించగా.. లేదన్నారు. 'మీ లైఫ్ లో మీ వైఫ్ కు తప్ప ఇంకా ఎవరికైనా ప్రపోజ్ చేశారా? 'అని ప్రశ్నించగా చేశానని షాకింగ్ రిప్లై ఇచ్చాడు. 'ఫస్ట్ రెమ్యూనేషన్ తో ఏం చేశారని ప్రశ్నించగా.. తన తల్లికి గిఫ్ట్ ఇచ్చానని బదిలిచ్చాడు. ఏదిఏమైనా ప్రభాస్ సినిమాలో అనవసరంగా నటించానని యంగ్ హీరో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇంతకీ ఆ కథ ఏంటో ?
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. దశరద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. అయితే.. ఈ సినిమాలో నటించిన బుల్లితెర నటుడు సాగర్ షాకింగ్ కామెంట్స్ ఇచ్చాడు. మిస్టర్ పర్ఫెక్ట్‌లో ప్రభాస్ స్నేహితుడిగా మాత్రమే కనిపించాడు. అయితే, ఆయా సీన్స్ మొదట సెకండ్ హీరో పాత్రగా నిర్ణయించబడ్డప్పటికీ, సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ కట్ చేయబడి చిన్న పాత్రగా మార్చారని ఆరోపించారు. 15 రోజులు షెడ్యూల్ ఇచ్చినా, కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ చేశారని గతంలో హీరో సాగర్ ఆరోపించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రేక్షకులలో చర్చనీయాంశంగా మారాయి.
ప్రభాస్ అప్ కమ్మింగ్ మూవీస్
ఇదిలాఉంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైన్ అప్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది. త్వరలో 'రాజా సాబ్' హారర్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ప్రోగ్రెస్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, కల్కి 2, హనూ రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్స్ కూడా జెట్ స్పీడ్‌లో సాగుతున్నాయి. ప్రభాస్ సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు రెడీ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయన సినిమాలకు పెద్ద ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











