twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ సందేశ్ రెచ్చగొట్టాడు, సీజన్ 2 లాంటి పరిస్థితి తేవొద్దు : బిగ్ బాస్ గురించి జాఫర్

    |

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి రెండో వారం ఎలిమినేట్ అయిన టీవీ9 జర్నలిస్ట్ జాఫర్... తాజాగా టీవీ9 ఇంటర్వ్యూలో ఈ షో గురించిన అంశాలు పంచుకున్నారు. మనం ఒక కంఫర్ట్ జోన్ నుంచి పక్కకు వచ్చి, అందరికీ దూరమై, ఒక రూములో బందీగా ఉండి, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండగలమా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. నేను అక్కడికి వెళ్లాలనే అభిప్రాయం బలపడటానికి కారణం కూడా అదే. నేను అక్కడ ఉండగలనా? అనే విషయాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఈ షోకు వెల్లడానికి ప్రధాన కారణం అదే అని జాఫర్ తెలిపారు.

    నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు

    నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు

    గేమ్ ఆడాలని, టైటిల్ గెలవాలనే ఆలోచనతో అయితే నేను ఈ షోకు వెళ్లలేదు. వ్యూహాత్మకంగా కూడా ఉండలేదు. ఇప్పటి వరకు జాఫర్ కు సంబంధించి ప్రొఫెషనల్ ఫేస్ మాత్రమే అందరికీ తెలుసు. నేను ప్రొఫెషన్లో అగ్రెసివ్ గా ఉంటాను. కానీ పర్సనల్ లైఫ్ నా భార్య పిల్లలకు మాత్రమే తెలుసు. ఈ షో ద్వారా నా గురించి అందరికీ తెలిసిందని తెలిపారు.

    సీజన్ 3 విభిన్నంగా ఉంది

    సీజన్ 3 విభిన్నంగా ఉంది

    మిగతా సీజన్‌కు ఈ సీజన్‌కు తేడా ఉంది. గత రెండు సీజన్లలో కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైన వెంటనే కేప్టెన్సీ టాస్క్ ఉంటుంది. అక్కడి నుంచి పాలిటిక్స్, డిస్ట్రబెన్స్, గొడవలు మొదలవుతాయి. అయితే ఈ సారి 12 రోజుల వరకు కెప్టన్సీ టాస్క్ ఇవ్వకుండా మీకు మీరే మీ పనులు చక్కబెట్టుకోండి, మిమ్మల్ని మీరే సమన్వయ పరుచుకోండి అని చెప్పారు. దీంతో పాటు ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిచండి, గొడవలకు పోవద్దు, ఎదుటివారి మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయండి అని బిగ్ బాస్ చెప్పినట్లు జాఫర్ తెలిపారు.

    మనపై చాలా ఒత్తిడి ఉంటుంది

    మనపై చాలా ఒత్తిడి ఉంటుంది

    అక్కడ బిగ్ బాస్ ఒక ప్రెజస్ కుక్కర్ లాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు. ఫ్యామిలీకి దూరంగా ఉండటం, మొబైల్ ఫోన్ లేక పోవడం, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండటం వల్ల ఒకరకమైన ఒత్తిడి ఉంటుంది.

    వరుణ్ సందేశ్ రెచ్చగొట్టినట్లు అనిపించింది

    వరుణ్ సందేశ్ రెచ్చగొట్టినట్లు అనిపించింది

    కొందరు గ్రూపులుగా మారి ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. నేను రాక ముందు రెండు మూడు రోజుల ముందు వరకు ఏ గ్రూఫులో లేకుండా నేను నేనుగా ఉండే ప్రయత్నం చేశాను. చివర్లో కొంత డిస్ట్రబెన్స్ మొదలైంది. అకస్మాత్తుగా వరుణ్ సందేశ్ వచ్చి... జాఫర్ గారు లాస్ట్ వీక్ మిమ్మల్ని నామినేట్ చేసింది నేనే, నెక్ట్స్ వీక్ కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తాను, నేను ఉన్నంత కాలం మిమ్మల్ని నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పడం రెచ్చగొట్టినట్లు అనిపించిందన్నారు.

    బాబా భాస్కర్ కల్మషం లేని వ్యక్తి

    బాబా భాస్కర్ కల్మషం లేని వ్యక్తి

    బిగ్ బాస్ ఇంట్లో నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ వన్ అండ్ ఓన్లీ బాబా భాస్కర్. ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. టెల్ యువర్ ఫ్రెండ్ నేమ్ ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని... బాబా భాస్కర్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెబుతున్నాను. చాలా సందర్భాల్లో వరుణ్ సందేశ్.. బాబా భాస్కర్ మైండ్ గేమ్‌కు జాఫర్ గారు ఇన్ ఫ్లూయెన్స్ అవుతున్నారు అన్నారు. ఆయన ఎలాంటి వ్యూహం లేకుండా, కల్మషం లేకుండా ఉంటున్నాడు. అలాంటి మంచి వ్యక్తి ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద ఉంది అంటే నాలో పాజిటివ్ నెస్ ఉన్నట్లే లెక్క. నాలో స్వార్థం ఉండొచ్చు కానీ బాబా భాస్కర్లో స్వార్థం లేదని జాఫర్ తెలిపారు.

    సీజన్ 2 లాంటి పరిస్థితి తేవొద్దు

    సీజన్ 2 లాంటి పరిస్థితి తేవొద్దు

    బయట కొందరు కంటెస్టెంట్లుకు మద్దుగా ఆర్మీలు, సోల్జర్స్ ఏర్పడి ఉన్నాయి. వారికి చెప్పేది ఒకటే... లోపల ఉండే వారిని వారి ఆట వారిని ఆడనివ్వండి. మనం ఇక్కడ కూడా మానిప్యులేట్ చేసే ప్రయత్నం చేయొద్దు. సీజన్ 2 ఎందుకు కాంట్రవర్సీ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటెన్షనల్‌గా కాంపెయిన్ లేకుండా ఉంటే బావుంటుందని నా విన్నపం... అని జాఫర్ సూచించారు.

    English summary
    TV9 Jafar revealed his Big Boss reality show experiences. Jafar said he has not made any preparation for the show and added he has presented himself what actually he is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X