Bigg Boss Telugu 5 Elimination ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్, నాగిన్, Mr.ఫర్‌ఫెక్ట్ కాకుండా మరో కంటెస్టెంట్‌

బిగ్‌బాస్ తెలుగు 5 షోలో 10వ వారం ఎలిమినేషన్‌లో ఊహించని సంఘటనలు చోటు చేసుకోనున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. ఇంటి సభ్యుల్లోని టాప్ కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్‌లో ఉండటం అందుకు కారణంగా మారింది. ఈ కారణంగా గత వారాల్లో కంటే ప్రస్తుత వారంలో ఓటింగ్ శాతం కూడా పెరిగినట్టు తెలిసింది. అయితే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరగని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తున్నది. అయితే బిగ్‌బాస్ తాజా ఎలిమినేషన్ ఎలా ఉండబోతుందనే వివరాల్లోకి వెళితే..

తొమ్మిది మందితోనే గేమ్

తొమ్మిది మందితోనే గేమ్

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్లు మిగిలారు. అయితే పది మంది ఉన్నా ఇంటిలో తొమ్మిది మంది మాత్రమే క్రియాశీలకంగా మారారు. ఎందుకంటే.. జస్వంత్ పడాల వెర్టిగో వ్యాధితో బాధపడుతుంటడంతో ఆయనకు మెరుగైన చికిత్సను అందించేందుకు బయటకు తీసుకెళ్లారు. అయితే బయటకు వెళ్లినందున ప్రస్తుతం సీక్రెట్ రూమ్‌లో క్వారంటైన్ లైఫ్‌ను అనుభవిస్తున్నాడు. ఏ క్షణమైనా జస్వంత్ ఇంటిలోకి వెళ్లే అవకాశం ఉంది.

టాప్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో

టాప్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో

గత తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది సభ్యులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్‌లో వీజే సన్నీ, మానస్, కాజల్, యాంకర్ రవి, సిరి హన్మంతు ఉండటంతో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఈ ఐదుగురు కంటెస్టెంట్లు కూడా టాప్ 5లో చేరడానికి అవకాశం ఉన్నవారే కావడం గమనార్హం.

కీలకంగా మారిన ఎలిమినేషన్ ప్రక్రియ

కీలకంగా మారిన ఎలిమినేషన్ ప్రక్రియ

ఇక బిగ్‌బాస్‌లో పదోవారం ఎలిమినేషన్ ప్రక్రియ కీలకంగా మారింది. ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లలో అత్యధికంగా వీజే సన్నీకి భారీగా ఓటింగ్ జరిగింది. సన్నీ అత్యధికంగా 35 శాతానికి పైగా ఓట్లను రాబట్టుకొన్నట్టు సమాచారం. ఆ తర్వాత స్థానంలో సిరి హన్మంతు సుమారు 30 శాతం, యాంకర్ రవి 25 శాతానికి పైగా ఓట్లను సాధించారు. ఈ వారం కాజల్, మానస్ తక్కువ ఓట్లను సాధించి ఇక చివరి రెండు స్థానాల్లో నిలిచారు.

 డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు అంటూ

డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు అంటూ

అయితే 10వ వారంలో మానస్ లేదా కాజల్‌లో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. మానస్, కాజల్ ఇద్దరూ కూడా పోటాపోటీగా ఓట్లు సాధించారని, వారిద్దరి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. మిస్డ్ కాల్ డేటా వారి ఎలిమినేషన్‌ను నిర్ణయిస్తుందనే మాట బలంగా వినిపిస్తున్నది.

Recommended Video

Pushpaka Vimanam Public Talk
జస్వంత్ పడాలను బయటకు పంపుతున్నారా?

జస్వంత్ పడాలను బయటకు పంపుతున్నారా?

కానీ బిగ్‌బాస్ ఇంటిలో జరిగే 10వ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు శనివారం ఏర్పాట్లు జరుగుతుండగా ఆసక్తికరమైన ట్విస్ట్ బయటకు వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న జస్వంత్‌ పడాలను ఇంటి నుంచి గౌరవంగా బయటకు పంపేందుకు బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నారు. వారాంతంలో హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ఆయన జర్నీ చూపించి.. ఇంటి సభ్యులతో మాట్లాడించే బయటకు పంపాలనే దిశగా నిర్వాహకులు అడుగులు వేస్తున్నారు అనే విషయం బయటకు వచ్చింది. అయితే బిగ్‌బాస్ ఇంటిలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X