For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam దీపకు ఊహించని షాక్.. కార్తీక్‌‌ను వంటలక్కకు మళ్లీ దూరం చేసిన ఆమె ఎవరంటే?

  |

  యాక్సిడెంట్ తర్వాత తమకు దొరికిన శౌర్యను హైదరాబాద్‌లోని ఆమె కుటుంబానికి అప్పగించేందుకు చంద్రమ్మ దంపతులు ప్రయత్నించారు. అయితే తన ఇంటికి వెళ్లడం ఇష్టం లేదన్నప్పటికీ ఆమెను బలవంతంగా ఇంటికి చేర్చే ప్రయత్నం చేశారు. నాకు ఇష్టం లేదు. నన్ను ఎందుకు ఆ ఇంటికి చేరుస్తున్నారు అని శౌర్య మొండికేసింది. నా మనసు ఒప్పుకోవడం లేదు. నాకు పిచ్చి ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. హిమ ఉన్న ఇంట్లో వెళ్లడం ఇష్టం లేదని బయటకు వచ్చాను. మళ్లీ ఆ ఇంటికి ఏం ముఖం పెట్టుకొని వెళ్లాలి. మీతో ఉండటం ఇష్టం లేకపోతే నన్ను వదిలేయండి అని శౌర్య వారిని వేడుకొన్నది. కార్తీకదీపం సీరియల్ తాజా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ 1435 లో ఏం జరిగిందంటే..

  అమెరికాకు వెళ్లారనే వార్తతో

  అమెరికాకు వెళ్లారనే వార్తతో


  ఇలాంటి వాదనల మధ్య శౌర్య తన ఇంటికి చేరుకొన్నది. అయితే ఇంటిలోకి చంద్రమ్మ దంపతులు ప్రవేశించగానే.. సెక్యూరిటీ ఆపేశాడు. అయితే శౌర్య ఈ ఇంటి అమ్మాయి. వారికి అప్పగించాలి అంటే.. ఈ ఇంటి వాళ్లు బంగ్లాను అమ్మేసి అమెరికాకు వెళ్లిపోయారు అని సెక్యూరిటీ చెప్పగానే.. శౌర్య షాక్ గురైంది. అయితే హైదరాబాద్‌కు రానంటే మనం తీసుకొచ్చాం. వాళ్లు ఇప్పుడు లేరు అని చంద్రుడు అంటే ఆమె భర్త అలా అనకు అని చెప్పి.. శౌర్యతో మన ఇంటికి వెళ్దాం అని చెప్పారు.

  నా పిల్లల్ని కలిసే అవకాశం కోల్పోయానని

  నా పిల్లల్ని కలిసే అవకాశం కోల్పోయానని


  ఇక హైదరాబాద్‌కు చేరుకొన్న దీప ఆటోలో ప్రయాణిస్తూ.. తన అత్త, మామ గురించి ఆలోచనల్లో పడింది. మేము బతికి ఉన్నామంటే ఎంత ఆనందానికి గురి అవుతారో. ఇంటికి వెళ్లగానే నా పిల్లలను గుండెలకు హత్తుకోవాలి. ఎప్పుడెప్పుడు నా కుటుంబాన్ని చూడాలనే ఆతృత వల్ల ఇంటికి చేరడం ఆలస్యమవుతుందా అనే ప్రశ్నలు దీపను చుట్టుముట్టాయి. అలా ఆలోచనతో దీప ఇంటికి చేరింది. అయితే ఇంటి వద్ద కొత్త సెక్యూరిటీ ఉండటంతో ఏంది అని అడిగితే.. ఇంట్లో వాళ్లంతా అమెరికాకు వెళ్లిపోయారు అని చెప్పడంతో దీప బాధపడింది. దాంతో నా పిల్లలను కలిసే అవకాశాన్ని కోల్పోయాను. భగవంతుడా.. వారిని అమెరికాలో ఎలా కలుసుకోవాలనే ఆవేదనను వ్యక్తం చేసింది.

  హాస్పిటల్‌లో బతికే ఉన్నాడు అంటూ

  హాస్పిటల్‌లో బతికే ఉన్నాడు అంటూ

  దీప ఇలా ఆవేదనకు గురవుతుంటే. చిక్ మంగళూరులోని డాక్టర్ ఫోన్ చేసి.. హాస్పిటల్‌లో చేరిన వ్యక్తి బతికే ఉన్నాడు అంటూ శుభవార్త చెప్పాడు. దాంతో తాను అక్కడికి వస్తున్నాను అంటూ దీప బయలుదేరింది. అయితే గుడిలోకి వెళ్లి దేవుడికి మొక్కుతూ.. నేను బతికే ఉన్నా.. నా పిల్లలకు ఎందుకు దూరం చేస్తున్నావు దేవుడా.. హాస్పిటల్‌లో చేరిన వ్యక్తి బతికే ఉన్నాడని తెలిసింది. ఆయనే నా డాక్టర్ అయ్యేలా చూడు అంటూ దేవుడిని వేడుకొన్నది. అలా పూజలు చేస్తుంటే దీప అనే పిలుపు వినిపించడంతో ఆనందంలో మునిగిపోయింది. వెను తిరిగి చూడగానే తన వెనుక డాక్టర్ బాబు ఉండటంతో పరుగున వెళ్లి కౌగిలించుకొన్నది.

  కార్తీక్‌ను పట్టుకొని అలాంటి భ్రమలో

  కార్తీక్‌ను పట్టుకొని అలాంటి భ్రమలో


  కార్తీక్‌ను పట్టుకొని.. డాక్టర్ బాబు అంటూ అతడిని తడిమి చూసి కలనా నిజమా అని చూసింది. మీరు వస్తారని నాకు తెలుసు. నేను ప్రాణాలతో ఉన్నానంటే.. మీరు బతికి ఉన్నట్టే.. లేకపోతే నేను బతికి ఉండటంలో అర్ధం ఏముంది? మీరు వచ్చారు.. అంతే చాలూ అని దీప అంటే.. దీప నేను వచ్చానుగా.. నీవు లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను అని కార్తీక్ అన్నాడు. కలిసి ఉండాల్సిన క్షణాల్లో దూరంగా ఉన్నాం. ఈ జన్మకు ఈ ఎడబాటు చాలూ. ఇక ఒక్క క్షణం కూడా ఎడబాటు ఉండకూడదు అని దీప ఎమోషనల్ అయింది.

  కార్తీక్‌ను కలిసినట్టు భ్రమ పడిన దీప

  కార్తీక్‌ను కలిసినట్టు భ్రమ పడిన దీప

  అయితే ఇదంతా గుడిలో కార్తీక్ గురించి ఆలోచిస్తూ.. మనం ఇద్దరం కలిసే ఉండాలి అంటూ కళ్లు తెరిచి చూసే సరికి.. ఎదుట కార్తీక్ లేకపోవడంతో ఇప్పటి వరకు జరిగిందంతా ఓ కల అని తెలుసుకొన్నది. ఇదంతా భ్రమనా.. నా జీవితంతో ఎందుకు ఆడుకొంటున్నావు. నేను ఆనందంలో ఉన్న క్షణం కూడా ఎక్కువ సేపు ఉండటం లేదు. ఆయన బతికే ఉన్నారు. ఇప్పుడే వెళ్లి కలుస్తాను అంటూ దీప బయలు దేరింది.

  కార్తీక్‌ను ఆమె భార్య తీసుకెళ్లిందంటూ ట్విస్టు

  కార్తీక్‌ను ఆమె భార్య తీసుకెళ్లిందంటూ ట్విస్టు

  కార్తీకదీపం తాజా ప్రోమోలో మరో ట్విస్టు ఇచ్చారు. హాస్పిటల్‌లో చేరారనే వ్యక్తిని కలిసిదుకు వెళ్లి.. రిసెప్షన్‌లో అడిగింది. యాక్సిడెంట్‌లో గాయపడిన వ్యక్తిని ఇక్కడికి తెచ్చారట. ఆయనను వెంటనే చూడాలి అని దీప అడిగింది. అయితే ఆ వ్యక్తిని వెంటనే వాళ్ల భార్య వచ్చి తీసుకెళ్లింది అని చెప్పగానే దీప షాక్ గురైంది. అక్కడ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో నర్స్ వచ్చి.. ఆయన పర్స్ ఇక్కడే ఉండిపోయింది అంటూ ఓ పర్స్ ఇచ్చింది. అయితే దానిని ఓపెన్ చేసి చూడగానే కార్తీక్ ఫోటో కనిపించింది. ఇలా తాజా ప్రోమోలో ఈ టిస్ట్ సీరియల్‌ను మరో మలుపు తిప్పింది. అయితే మోనిత ఎంట్రీ కూడా ఉండబోతుందా అనేది ఇప్పుడు ఈ సీరియల్ అభిమానులకు ప్రశ్నగా మారింది.

  English summary
  Karthika Deepam 19th August Episode number 1435.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X