twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam బ్రేకప్‌తో దేవదాసుగా నిరుపమ్.. తిడితే ప్రేమ తగ్గదు అంటూ ఎమోషనల్

    |

    పెళ్లి ఇష్టం లేదంటూ నిశ్చితార్థం పీటల మీద నుంచి హిమ లేచిపోవడంపై డాక్టర్ నిరుపమ్ రకరకాలుగా ఆలోచించాడు. హిమ ఎందుకు ఇలా చేసిందంటూ ఆవేదన చెందాడు. నీ కోసం చిన్నప్పటి నుంచి కలలు కన్నాను కదా. ఇద్దరం కలిసి బతకాలని అనుకొన్నాం. ఇప్పుడు దేనికి కాదన్నావో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు అని నిరుపమ్ మనసులో అనుకొన్నాడు. అంతలోనే కారులోకి వచ్చి హిమ తీసుకెళ్లింది. ఇంకా కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1356 లో ఏం జరిగిందంటే..

    తిడితే కోపం పోతుంది.. కానీ అంటూ

    తిడితే కోపం పోతుంది.. కానీ అంటూ

    బాధలో ఉన్న నిరుపమ్‌తో మాట్లాడుతూ.. నీవు ఎంత మంచి వాడివి. ఇంత చేసినా నన్ను ఒక్క మాట అనలేదు. నీ స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే.. అరిచే వారు.. కొప్పడే వాళ్లు. కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నీ మౌనం నన్ను కాల్చేస్తున్నది. నీ కోపం పోయేదాక నన్ను తిట్టు అని హిమ అంటే.. తిడితే కోపం పోతుంది.. ప్రేమ పోదు కదా అని నిరుపమ్ అన్నాడు. నేను తీసుకొన్న నిర్ణయానికి నీవు ఎంత బాధపడ్డావో తెలుసు. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి నేను ఎంత క్షోభను అనుభవించానో తెలుసా అని హిమ అంది. ఓ పేషెంట్‌ను ట్రీట్ చేయడానికి వచ్చిన హిమకు అక్కడే జ్వాలా ఆటో కనిపించింది. దాంతో జ్వాలా నానమ్మను కలిసిందా? జ్వాలాను చూస్తే నిరుపమ్ ఎలా ఫీలవుతాడో అని అక్కడి నుంచి హిమా అక్కడి నుంచి వెళ్లింది.

    జ్వాలా నీకు బాధలు లేవా?

    జ్వాలా నీకు బాధలు లేవా?

    తన వెంటపడుతున్న జ్వాలా అలియాస్ శౌర్యను బలవంతంగా కారు ఎక్కించుకొని వచ్చింది. దాంతో నీవు నన్ను కిడ్నాప్ చేస్తున్నావా సీనియర్ సిటిజన్? నన్ను కిడ్నాప్ చేస్తే.. ఆటో తప్ప నీకు ఏమి దక్కదు. దానికి కూడా ఈఎంఐలు చెల్లించాలి అని శౌర్య అంది. ఏంటే నీవ్వు ప్రతీసారి ఆలోచింపజేసేలా చేస్తావు. నీకు బాధలు లేవా? ప్రతీ విషయాన్ని చాలా ఈజీగా తీసుకొంటావు. నేను చాలా టెన్షన్‌లో ఉన్నాను అని సౌందర్య అంటే.. మీవి ఖరీదైన బాధలు.. మీ బాధలు ఏంటో చెప్పు అని జ్వాలా అంటే.. నా బాధలు నీకు చెప్పలేనని అంటూ హిమ నిశ్చితార్థం విషయాన్ని తలచుకొని బాధపడింది. సౌందర్య కంటతడి పెట్టుకోవడం చూసి.. అన్ని బాధలు ఉండి కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అని అడిగింది.

    ఆశతోనే బతకాలి అంటూ జ్వాలా

    ఆశతోనే బతకాలి అంటూ జ్వాలా

    ప్రతీ ఇంట్లో నీళ్ల ట్యాంక్ ఉన్నట్టే.. ప్రతీ మనిషిలో కన్నీళ్ల ట్యాంక్ ఎక్కడుందో తెలిస్తే.. దానిని ఆపరేషన్ చేసి తీస్తేస్తా. ఎప్పుడు కన్నీళ్లు రాకుండా చూస్తాను. కష్టాలు, బాధలు అందరికి ఉంటాయి. అందరూ ఎందుకు కష్టపడుతారో తెలుసా? ఆశ.. ప్రతీ మనిషి మంచి జరుగుతుందని ఆశ పడుతారు. ఆశతోనే బతకాలి అని జ్వాలా అంటే.. నిన్ను చూస్తుంటే.. నాకు కొత్తగా అనిపిస్తున్నది అని సౌందర్య అంటే.. కాస్త కొత్తగా డ్రస్ వేసుకొన్నాను అని జ్వాలా జోక్ చేసింది. దాంతో ఎన్నో తెలివి తేటలు ఉన్న నీవు ఆటో నడపడం ఏమిటి? నీవు ఏం కావాలని ఏమనుకొన్నావు అంటే.. కలెక్టర్ అవ్వాలనుకొన్నానని సౌందర్యకు జ్వాలా చెప్పింది.

    మా నాన్న నాకు దేవుడు

    మా నాన్న నాకు దేవుడు

    కలెక్టర్ కావాలనుకొన్న జ్వాలా కోరికను తెలుసుకొని సౌందర్య రగిలిపోయింది. మీ నాన్న ఏం చేస్తాడు. కనిపిస్తే చెంప పగలకొడుతాను. ఇంత తెలివి తేటలు ఉన్న నిన్ను ఆటో నడిపించేలా చేస్తున్నాడు. ఆ వెధవ ఎవడు? నిన్ను చదవించకుండా ఆటో నడపమంటాడా? వాడు ఒక మనిషా? చదువు ఆపేసి కష్టపడుతుంటే.. అని సౌందర్య ఆవేశంగా తిడుతుంటే.. మా నాన్నను ఏమనకు. మా నాన్న హీరో. మా నాన్న దేవుడు సీనియర్ సిటిజన్. మా నాన్నను దేవుడి కంటే ఎక్కువ ప్రేమించుకొన్నాను కాబట్టే మా నాన్నను దేవుడు పిలుపించుకొన్నాడు అని జ్వాలా అంటే.. మీ నాన్న చనిపోయాడా అని సౌందర్య ఆవేదన చెందింది.

    నిరుపమ్ దేవదాసులా అంటూ

    నిరుపమ్ దేవదాసులా అంటూ

    హిమ వెంట డాక్టర్ నిరుపమ్ పడటం గురించి చర్చించేందుకు సత్యం వద్దకు స్వప్న వచ్చింది. స్వప్నను చూసి రా.. ఇంట్లోకి అంటే.. అంత ఆశపడకు. నేను నీ ఇంటికి రాలేదు అని స్వప్న చెప్పింది. నీవు వస్తున్నావని ప్రేమ్ చెప్పాడు అని అంటే.. నిన్ను కలువడానికి రాలేదు. నీకు నీ కొడుకు నిరుపమ్ గురించి చెప్పడానికి వచ్చాను. వాడు ప్రేమ అంటూ హిమ వెంట పడుతున్నాడు. వాడు దేవదాసులా మారాడు. నీవు ఎలాగు తండ్రిగా ఫెయిల్ అయ్యావు. కనీసం కొడుకునైనా జాగ్రత్తగా చూసుకో అని సత్యంకు స్వప్న క్లాస్ పీకింది. ఆ నష్ట జాతకురాలితో ప్రేమ, పెళ్లి వద్దని నిరుపమ్‌కు చెప్పు అంటూ అక్కడి నుంచి స్వప్న వెళ్లిపోయింది.

    నానమ్మ నేను శౌర్యను అంటూ

    నానమ్మ నేను శౌర్యను అంటూ

    కారులో విజిటింగ్ కార్డు దొంగలించిన జ్వాలా తన నాన్నమ్మ సౌందర్యకు కాల్ చేసింది. మిస్ కాల్ ఇవ్వడంతో సౌందర్య తిరిగి కాల్ చేసి.. ఎవరు మీరు.. కాల్ చేశారు అంటే.. నేను నానమ్మ.. మీ శౌర్యను అంటూ ఫోన్‌లో చెప్పింది. శౌర్య మాట వినగానే సౌందర్య మనసు ఉప్పొంగిపోయింది. తన మనవరాలు దొరికిందని ఆనందపడిపోయింది.

    లేటేస్ట్ ప్రోమోలో ట్విస్ట్ ఇలా

    లేటేస్ట్ ప్రోమోలో ట్విస్ట్ ఇలా

    ఇక తాజా ప్రోమోలో శౌర్య ఫోన్ చేసిందనే విషయాన్ని కూతురు స్వప్నకు, మనవరాలు హిమకు చెప్పింది. అయితే నీ మనవరాలి ఆచూకీ కోసం వెతకండి. కానీ శౌర్యను తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తానని డ్రామాలు ఆడోద్దు అంటూ స్వప్న వార్నింగ్ ఇచ్చింది. అయితే శౌర్య ఫోన్ చేయడంతో హిమ కంగారు పడిపోయింది. నానమ్మను కలిస్తే.. నా గురించి తెలిసిపోతుందని టెన్షన్ పడింది. నానమ్మ ఫోన్‌కు వచ్చిన నంబర్‌కు హిమ కాల్ చేసింది. ఇలాంటి ట్విస్టుతో కార్తీకదీపం సీరియల్ ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తున్నది.

    English summary
    Karthika Deepam May 19th Episode number 1354. Shourya Calls her grand mother Soundarya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X