For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam దుర్గ కాళ్లపై పడిన మోనిత.. నిప్పులు చెరిగిన దీప!

  |

  బతుకమ్మ వేడుకల్లో దీపపై మర్డర్ ప్లాన్ తర్వాత జరిగిన హైడ్రామా తర్వాత మోనితను దుర్గ ఇబ్బందుల్లో పెట్టాడు. కార్తీక్ ముందు.. బంగారం అంటూ ప్రేమగా మాట్లాడుతూ.. రాత్రి నా గదిలో నీ బ్యాగ్ మరిచిపోయి వచ్చావు అని దుర్గ చెప్పడంతో మోనిత మరింత కంగారుపడింది. బంగారం ఏమిట్రా? ఎవరు రా నీకు బంగారం అంటూ మోనిత కౌంటర్ ఇచ్చింది. దాంతో దీపను ఎందుకు చంపించాలని ప్లాన్ చేశావు అని దుర్గ నిలదీస్తే.. నేను ఎందుకు ఆమెను చంపిస్తాను. నాకు ఆ అవసరం లేదు అని మోనిత జవాబిచ్చింది. దాంతో నీకు ఆధారాలు చూపించాలా అంటూ దుర్గ కౌంటర్ ఇవ్వడంతో.. నీకు దండం పెడుతా.. నన్ను టార్చర్ చేయకు అంటూ చేతులెత్తింది. దాంతో ఓహో కార్తీక్ ఇంట్లో ఉన్నాడా? అయితే తర్వాత వస్తాను అంటూ దుర్గ వెళ్లిపోయాడు. దుర్గతో సంభాషణను కార్తీక్ పక్కనే వినడం చూసి మోనిత షాక్ తిన్నది. కార్తీకదీపం సీరియల్ 1485 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

   నిజాలు అబద్దం కావు మోనిత

  నిజాలు అబద్దం కావు మోనిత


  దుర్గ వెళ్లిపోగానే.. దీపను ఎందుకు చంపించాలని అనుకొన్నావు అని కార్తీక్ ఘాటుగా ప్రశ్నించాడు. దాంతో ఆ సంఘటనతో నాకు ఏం సంబంధం లేదు అని మోనిత చెప్పింది. దీపను అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం ఏంది? నీకు ఎవరు అడ్డుపడినా.. వారి ప్రాణాలు తీయిస్తావా అని కార్తీక్ అంటే.. చెప్పిందే చెప్పి.. భోరున ఏడిస్తే.. నిజాలు అబద్దం కావు మోనిత.. ఇలాంటి వాళ్లను చూస్తే నా కంపరం పుడుతుందని దీపను తిట్టేసి కార్తీక్ వెళ్లిపోయాడు.

  కాళ్లపై పడిన మోనిత

  కాళ్లపై పడిన మోనిత


  ఇంట్లో సోఫాలో తాపీగా రిలాక్స్ అవుతున్న దుర్గను చూసి కోపంతో ఊగిపోయింది. మోనిత కోపాన్ని చూసి.. నన్ను కూడా చంపేయాలని చూస్తున్నావా? నన్ను కూడా చంపిస్తావా అని దుర్గ సెటైర్ వేశాడు. ప్లీజ్ దుర్గ నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో.. నన్ను కార్తీక్ అనుమానంగా చూడటం నాకు ఇష్టం లేదు. నీకు దండం పెడుతాను అంటూ దుర్గ కాళ్లపై మోనిత పడింది. నీకు కావాలంటే ఎంత డబ్బు ఇస్తాను. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులన్నీ నికు ఇస్తాను అంటూ కాళ్లపై పడి బతిమిలాడింది.

  అందితే జుట్టు.. అందకపోతే..

  అందితే జుట్టు.. అందకపోతే..


  అంతలోనే దీప అక్కడికి రావడంతో దుర్గ బిగ్గరగా నవ్వడం చూసి మోనిత అవమానంగా ఫీలైంది. మోనిత చూస్తూ... ది గ్రేట్ డాక్టర్ మోనిత నా కాళ్లపై పడింది అని దుర్గ నవ్వుతుంటే.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అంటే ఇదేనేమో అని దీప ఎద్దేవా చేసింది. దాంతో ప్లీజ్ నన్ను వదిలిపెట్టు వెళ్లిపో దుర్గ అంటే.. నిన్ను వదిలేస్తాం. కానీ అసలు విషయాలు కార్తీక్ చెబితే.. నిన్ను వదిలేస్తాం అని దీప చెప్పింది.

  జన్మ ఎత్తినా కార్తీక్ నీ భర్త కాలేడు

  జన్మ ఎత్తినా కార్తీక్ నీ భర్త కాలేడు


  అయితే దీప, దుర్గ కౌంటర్లకు బదులిస్తూ.. నా ప్రాణం పోయినా నేను కార్తీక్‌ను వదులుకోను అని మోనిత చెప్పింది. కార్తీక్‌ నుంచి నిన్ను దూరం చేయడం చాలా తేలిక.. నేను కాస్త పొగపెట్టానంటే.. నిన్ను తన్ని తరిమేస్తాడు అని దుర్గ అంటే.. నిన్ను ఇంకా ఎలా భరిస్తున్నాడో నాకు అర్ధం కావడం లేదు. గతం మరిచిపోయేలా కాదు.. నీవు మరో జన్మ ఎత్తినా కార్తీక్ నీ భర్త కాలేడు. భర్త కానీ భర్త వద్ద, అనుమానాలు కానీ అనుమానల మధ్య బతకడం కంటే.. మా జీవితం నుంచి హ్యాపీగా వెళ్లిపో అని అని దీప అంది.

  చేతులు ఎత్తేసానని అనుకొంటున్నావా?

  చేతులు ఎత్తేసానని అనుకొంటున్నావా?


  దుర్గ, దీప మాటలతో రెచ్చిపోయిన మోనిత.. నీ కాళ్ల మీద పడ్డానని.. చేతకాని దానిని అనుకోవద్దు. చేతులు ఎత్తేసానని అనుకొంటున్నావా? వేలుతో పోయేదానిని. వేటుతో ఎందుకని ఆలోచిస్తున్నా అని మోనిత అంటే.. వేటుతోనా? నీవు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు. అందుకే చాలా రిలాక్స్డ్‌గా ఉన్నాను. అదే నాకు తెలిస్తే నీవు పంపించిన వాళ్లు పీస్.. పీస్ అయ్యేవాళ్లు అని దుర్గ వార్నింగ్ ఇచ్చాడు. నా ప్రాణాలు తీయడానికి నీ మనుషులను పంపించావు. కానీ నా భర్తే నా ప్రాణాలు కాపాడాడు. అదే మూడుమూళ్ల బంధం పవర్ అని దీప అంది.

  ఇంకా పొగరు అణగలేదు

  ఇంకా పొగరు అణగలేదు


  దీప, దుర్గ మాటలతో కోపంతో ఊగిపోయిన మోనితను చూస్తూ... ఇంకా దీని పొగరు అణగలేదు. కాబట్టి నీవు ఇక్కడే ఉండి.. కార్తీక్ అనుమానాలు వచ్చేలా చేయి.. అని దీప చెప్పేసి వెళ్లిపోయింది. ఇంట్లోకి వెళ్లిన మోనిత.. ఎందుకురా.. ఇద్దరు కలిసి నన్ను ఎందుకు ఆడుతున్నారు.. కార్తీక్ గతాన్ని మరిచేలా చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొన్నాను. అయితే ఇప్పుడు.. నేను అసలు విషయం కార్తీక్ చెప్పాలట.. నా ప్రాణం పోయినా చెప్పను.. చెప్పను. కార్తీక్ ఎక్కడికిపోయాడో.. ఇంట్లో కనిపించడం లేదు. కార్తీక్ వచ్చినా.. రాకపోయినా టెన్షనే అని మోనిత అనుకొన్నది

  టాప్ రేటింగ్‌తో కార్తీకదీపం

  టాప్ రేటింగ్‌తో కార్తీకదీపం


  ఇదిలా ఉండగా. కార్తీకదీపం సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్నది. అర్బన్ ప్రాంతంలో 39 వారంలో 10.95 రేటింగ్ నమోదు చేసుకొంటే.. ప్రస్తుతం వారం 10.12 రేటింగ్ నమోదైంది. ఇక రూరల్ ప్రాంతంలో 39వ వారం 12.47 రేటింగ్ నమోదు కాగా, 40వ వారం 11.89 రేటింగ్‌తో దూసుకెళ్తున్నది.

  English summary
  Karthika Deepam October 17th Episode number 1485
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X