»   » ఇలా జరగటం ఇదే తొలిసారి: టీవి ప్రీమియర్ షోల విషయంలో బాలయ్య చిత్రం కొత్త రికార్డ్

ఇలా జరగటం ఇదే తొలిసారి: టీవి ప్రీమియర్ షోల విషయంలో బాలయ్య చిత్రం కొత్త రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా వచ్చి, సంక్రాంతి బరిలో దిగి వెండితెర పై సంచలనం సృష్టించిన చిత్రం '' గౌతమిపుత్ర శాతకర్ణి '' . . శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన బాలయ్య వందో చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామి సృష్టించింది.

ఒక తెలుగు వాడి చరిత్రను నలుగురికి తెలిసేలా చేసిన క్రిష్ కి, పాత్రలో నటించి మెప్పించిన బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపించారు దేశ,విదేసాభిమానులు . సంక్రాంతి కి రిలీజ్ అయిన శాతకర్ణి ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూల్ చేసి బాలయ్య చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . ఇక క్రిష్ పరంగా కూడా చూస్తే కమర్షియల్ హిట్ అందుకొని సత్తా చాటాడు.

Two Premieres of 'Gautamiputra Satakarni' on Same Day

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా బుల్లితెరలో టెలికాస్ట్ చేయనున్నారని సమాచారం . మార్చి 29, 2017న ఈ చారిత్రిక చిత్రం సాయింత్రం ఆరు గంటలకు మాటీవిలో ప్రసారం కానుంది. ఆ తర్వాత మా మూవీస్ లో రార్తి తొమ్మిదిగంటలకు మరో షో పడనుంది. ఇలా ఒకే రోజు ఒక సంస్దకు చెందిన రెండు టీవి ఛానెల్స్ లో ప్రసారం కావటం రికార్డే.

మూడు నెలల కాలంలోనే బుల్లితెర పై వస్తుండటం బాలయ్య అభిమానులకు మాత్రమే కాకుండా బుల్లితెర ప్రేక్షకులు కూడా సంతోషించే విషయమే . తెలుగు వాడి సత్తా ఏంటో చాటిచెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి...టీఆర్పీల పరంగానూ రికార్డ్ లు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు.

ఈ చిత్రంలో సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు అద్బతమై నిలిచాయి. శ్రేయ, హేమమాలనిలకు ఈ సినిమాతో మరోమారు మంచి పేరు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు బుల్లితెరపైన ప్రదర్శించనుండటంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేస్తున్నారు. వెండితరపై చూడడం మిస్ అయిన వాళ్లు బుల్లితెరపై చూసి ఎంజాయ్ చేయోచ్చు.

English summary
'Gautamiputra Satakarni'will have two back to back Television premieres on March 29th, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu