»   » టీవీ నటిపై అత్యాచారయత్నం.. దట్టమైన పొదల్లోకి తీసుకెళ్లిన డ్రైవర్..

టీవీ నటిపై అత్యాచారయత్నం.. దట్టమైన పొదల్లోకి తీసుకెళ్లిన డ్రైవర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఉపాసన పై అత్యాచారయత్నం....!

ఉపాసన సింగ్ అంటే తెలియని టెలివిజన్ ప్రేక్షకులు ఉండరు. ప్రముఖ కమెడియన్, హోస్ట్ కామెడీ నైట్స్ కపిల్ షోలో పింకీ బువాగా అందరికీ సుపరిచితులు. అయితే ఇటీవల ఓ షూటింగ్ కోసం చండీగఢ్‌కు వెళ్లగా ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ టాక్సీ డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి జరుపడానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. అయితే ఆ ఘటనలో ఏమి జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

షూటింగ్ పూర్తి చేసుకొని వస్తుండగా..

షూటింగ్ పూర్తి చేసుకొని వస్తుండగా..

బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని హోటల్‌కు ఉపాసన సింగ్ కారులో తిరిగి వస్తున్నది. ఆమె ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ దట్టమైన పొదల్లోకి తీసుకెళ్తున్నారు. ముందే ప్రమాదాన్ని పసిగట్టిన ఉపాసన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదు చేసింది. సమీపంలోని జిరాక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు

డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు

ఉపాసన సింగ్ చేసిన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని వెంటనే ఆమెకు ఎస్కార్టుగా పోలీసుల వచ్చి ఉపాసనను క్షేమంగా హోటల్‌కు తరలించారు.

 షూటింగ్ స్పాట్ నుంచి

షూటింగ్ స్పాట్ నుంచి

ఆ తర్వాత ఉపాసన మీడియాతో మాట్లాడుతూ ఆ దుర్ఘటనను వివరించారు. ఆ రోజు నా షూటింగ్ చివరి రోజు. షూటింగ్ ముగించుకొని హోటల్‌కు వస్తున్నాను. సాధారణంగా షూటింగ్ స్పాట్ నుంచి హోటల్‌కు 45 నిమిషాల ప్రయాణం. ఆ రోజు రెండు గంటలకుపైగా ప్రయాణించినప్పటికీ.. ఇంకా గమ్యస్థానానికి చేరుకోలేదు అని ఆమె వెల్లడించారు.

డ్రైవర్ తీరుపై అనుమానం

డ్రైవర్ తీరుపై అనుమానం

డ్రైవర్ తీరుపై అనుమానం వచ్చింది. వెంటనే నేను డ్రైవర్‌ను నిలదీయగా దారి మరిచిపోయాను అని చెప్పాడు. ఒకవేళ దారి మరిచిపోతే నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించాను. కారు నిలిపివేయమని చెప్పాను. అందుకు తిరస్కరించి ఇంకా స్పీడ్ పెంచాడు. దాంతో ఏదో జరుగబోతుందని భయపడ్డాను.

 ఫిర్యాదు చేస్తానని బెదిరించా

ఫిర్యాదు చేస్తానని బెదిరించా

కారు ఆపకపోతే నా కుటుంబ సభ్యలకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీ బతుకు ఏమైపోతుందో ఊహించుకో అని బెదిరించాను. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. వెంటనే వారు కారును ఛేజ్ చేసి డ్రైవర్‌ను అరెస్ట్ చేయడంతో పెద్ద గండం తప్పింది.

డ్రైవర్‌పై కఠిన చర్యలు

డ్రైవర్‌పై కఠిన చర్యలు

నాకు ఎదురైన పరిస్థితికి డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకొన్నాను. కానీ నాకే కాదు మరెవరికైనా జరిగే అవకాశం ఉంటుందనే ఆందోళన కలిగింది. తొలుత విచారణకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత తప్పును ఒప్పుకొన్నాడు. కానీ డ్రైవర్ క్షమాపణలు తెలుపుతూ లెటర్ రాసి ఇవ్వడంతో నేను అతడిని క్షమించి వదిలేశాను. నా ఫిర్యాదును వాపస్ తీసుకొన్నాను.

English summary
Television actress Upasana Singh was most popular for her comic stint on Kapil Sharma’s Comedy Nights With Kapil as Pinky Bua. Recently, she met with an unpleasant experience as she was shooting for a film in Chandigarh, when a taxi driver allegedly tried to molest her. The incident took place while she was returning to her hotel after wrapping up her shoot on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu