Bigg Boss Telugu OTT కంటెస్టెంట్స్ లిస్టు వచ్చేసింది... ఈసారి ఎవరెవరంటే?

ఐదు సీజన్లకు పైగా టీవీ ప్రేక్షకులను విజయవంతంగా అలరించిన తర్వాత, బిగ్ బాస్ తెలుగు OTTలోకి కూడా ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. బిగ్ బాస్ తెలుగు OTT డిసెంబర్ 2021 నెలలో బిగ్ బాస్ 5 ఫినాలేలోనే ప్రకటించబడింది. అయితే తాజా నివేదిక ప్రకారం బిగ్ బాస్ OTT తెలుగు ఫిబ్రవరి 26న ప్రారంభం కానుంది. షో ఫార్మాట్ మరియు కంటెస్టెంట్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అయితే ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఎవరెవరు షోకి వెళ్లనున్నారు? అనే వివరాలు పరిశీలిస్తే

స్టేజ్ మీదనే

స్టేజ్ మీదనే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్'‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలివగా అదే స్టేజ్ మీద నాగార్జున మరో రెండు నెలల్లో సరికొత్త బిగ్ బాస్ సీజన్ ఓటీటీ మొదలు కానుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన లోగోను విడుదల చేయగా తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఆసక్తికరంగా ప్రోమో

ఆసక్తికరంగా ప్రోమో

ఈ ప్రోమోలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ తన చివరి కోరికగా బిగ్‌బాస్ చూడాలంటూ ఖైదీగా ఉన్న వెన్నెల కిషోర్ చెప్పడం గంటే కదా అని పర్మిషన్ ఇస్తే గంటల తరబడి చూస్తున్నట్టు చూపించారు. ఈ ప్రోమోలో నాగార్జున వకీల్ పాత్రలో, మురళీ శర్మ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ నాన్‌స్టాప్ బిగ్‌బాస్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి ప్రసారం కానున్నట్టు ప్రకటించారు.

కొత్త ఫార్మాట్‌

కొత్త ఫార్మాట్‌

ఇదిలా ఉండగా ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో, షోను ప్రసారం చేస్తున్న EVP & ఛానల్ హెడ్ అలోక్ జైన్, "మేము కొత్త ఫార్మాట్‌ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాము, ఇప్పుడు క్రియేటివ్ అంశాలపై పని చేస్తున్నాము" అని అన్నారు. ఇక మరోపక్క కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ తమిళ OTT వెర్షన్ 'బిగ్ బాస్ అల్టిమేట్' పేరుతో ఇటీవల ప్రారంభించబడింది.

పాత వారు ఎవరంటే

పాత వారు ఎవరంటే

ఇక తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కొత్త షో 84 రోజులు ఉండనుంది. ఈసారి కూడా మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ ఉండనుండగా అందులో 9 మంది పాత్త సీజన్ల వారు, 9 మంది కొత్త వారు ఉండబోతున్నారు అని తెలుస్తోంది. పాత సీజన్ల నుంచి అరియానా గ్లోరీ, సరయు రాయ్, మహేష్ విట్టా, ఆశు రెడ్డి, అఖిల్, నటరాజ్ మాస్టర్, తేజస్విని, ముమైత్ ఖాన్, హమీద ఉండనున్నారు అని అంటున్నారు.

కొత్త వారు ఎవరంటే

కొత్త వారు ఎవరంటే

ఇక సిరి ప్రియుడు శ్రీహన్, మౌనిక రెడ్డి, యాంకర్ వర్షిణి,యాంకర్ వింద్యా మేడపాటి, స్రవంతి చొక్కారపు, చిచా చార్లెస్, ఆర్జే చైతు, అనిల్ రాథోడ్ కొత్తగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. యూట్యూబ్ యాంకర్ శివ కూడా ఫైనల్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు ఈటీవీలో వచ్చిన డాన్స్ ప్రోగ్రామ్ ఢీ 10 విన్నర్ రాజు కూడా బిగ్ బాస్ ఓటీటీలో పాల్గోననున్నారు అని అంటున్నారు. అయితే కంటెస్టెంట్స్ విషయంలో అధికారికంగా తెలుసుకోవాలి అంటే షో మొదలయ్యే దాకా వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X