Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
‘వదినమ్మ’ ఫేమ్ ప్రియాంక పెళ్లి.. కోరుకున్న ప్రియుడితో మూడు ముళ్లు
సినీ ఇండస్ట్రీలో 2020 పెళ్లి సందడిగా గడిచిపోయింది. ఇప్పటికే ఎంతో మంది తారలు పెళ్లి పీటలు ఎక్కారు. ఇంకా కొందరు వివాహాం చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. మన టాలీవుడ్‌లో 2020 మొత్తం పెళ్లి బాజాలతో మార్మోగిపోయింది. లాక్డౌన్, కరోనా నేపథ్యంలోనే పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. రానా, నితిన్, నిఖిల్, కాజల్ వంటి పెద్ద తారలే కాకుండా ఎంతో మంది సెలెబ్రిటీలు విహాహం చేసుకున్నారు.

పెళ్లిళ్లతో బిజీగా..
టాలీవుడ్ మొత్తం పెళ్లిళ్లతో సందడిగా మారింది. రానా మిహీక పెళ్లితో దగ్గుబాటి కుటుంబం, నిహారిక పెళ్లితో మెగా ఫ్యామిలీ, నందమూరి బాలకృష్ణ సోదరుడి కుమారుడి పెళ్లితో ఆ ఫ్యామిలీ బిజీగా ఉంది. నిఖిల్, నితిన్ వంటి హీరోల పెళ్లిళ్లతో టాలీవుడ్ మొత్తం సందడిగా మారింది.

ఉన్నంతలోనే..
బ్రోచేవారెవరురా సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, జబర్దస్త్, రంగస్థలం ఫేమ్ మహేష్, సిరివెనెన్న సీతారామశాస్త్రి కుమారుడు రాజాచెంబోలు ఇలా ఎంతో మంది మూడు ముళ్లు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే కోవిడ్ నిబంధనలు మేరకు ఉన్నంతలోనే ఘనంగా వివాహా వేడుకలను జరిపారు.

సింగర్ సునీత సైతం..
హీరోలే కాకుండా హీరోయిన్లు, సింగర్లు కూడా వివాహాం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని వివాహాం చేసుకుని సెటిలైంది. మరో వైపు సింగర్ నేహా కక్కర్ కూడా పెళ్లి చేసుకుంది. సింగర్ సునీత కూడా రెండో పెళ్లికి సిద్దమైంది. ఈ మధ్యే నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరి మొదటి వారంలో పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది.

వదినమ్మ సీరియల్ ఫేమ్ ప్రియాంక..
వదినమ్మ సీరియల్‌లో సిరి పాత్రను పోషిస్తూ.. తెలంగాణ యాసలో అదరగొట్టే ప్రియాంక నాయుడు పెళ్లికి సిద్దమైంది. సీరియల్ నటుడు మధు బాబుతో ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్న ప్రేమ బంధం ఇక మూడు ముళ్ల బంధంగా మారబోతోంది. హల్దీ,మెహెందీ ఈవెంట్లలో ప్రియాంక ఫోటో షూట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పెళ్లి వేడుకల్లో బిజీగా..
ఇక సీరియల్‌లో నటించే తోటీ ఆర్టిస్ట్‌లతోపెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మధు బాబు ప్రియాంక ప్రేమ కహానికి సంబంధించిన వీడియోలు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లు, వీడియోలు బాగానే వైరల్అవుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాదిలో ఇలా ఈ బుల్లితెర జంట కూడా ఒక్కటి కాబోతోంది.