For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 10th Episode: రచ్చ చేసిన పార్వతి.. రౌడీలతో రంగంలోకి.. పాప కిడ్నాప్!

  |

  తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న స్టార్ మా ఛానల్ వదినమ్మ సీరియల్ ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆసక్తి పెంచుకుంటూ పోతుంది. ఈరోజు సీరియల్ లో 617వ ఎపిసోడ్ కి చేరింది. అయితే నిన్న ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరగడంతో దానికి కొనసాగింపుగా ఈరోజు ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రఘురాం సీతకు వైదేహి గుండె జబ్బు గురించి నిజం బయటపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ అంశం గురించి వైదేహి తల్లిదండ్రులకు సహా ఎవరికీ తెలియకూడదు అని ఏదైనా మనిద్దరి మధ్య ఉండాలని మాట తీసుకుంటాడు. మరోపక్క దమయంతి తన కూతురిని ఎక్కడ చేయి దాటి పోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ రాజశేఖర్ మాత్రం శిల్పతో నానిని దూరం చేసుకోకు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   నిన్న ఏమైందంటే

  నిన్న ఏమైందంటే

  ఇక మరో పక్క సేట్ దగ్గర దాచిన మూడు లక్షలు తీసుకోవడానికి వెళితే ఇప్పుడు లేవని సాయంత్రం రావాలని సేట్ చెబుతాడు. ఇంతలో అక్కడే డబ్బులు దాచుకోవడానికి వెళ్ళిన పార్వతి ఈ మూడు లక్షలు తీసుకుంటున్న విషయం తెలుసుకుంటుంది. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగియగా ఈరోజు ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రఘురాం మూడు లక్షల రూపాయల డబ్బు దాచాడు, ఆ డబ్బు తీసుకోబోన్నాడు అన్న విషయం తెలుసుకున్న పార్వతి తాను దాచడానికి వచ్చిన 50 వేల రూపాయలు డబ్బులు కూడా అతని వద్ద దాచకుండా వెను తిరుగుతుంది. వేను తిరగడమే కాక రఘురాం మళ్లీ ఆ మూడు లక్షలతో రిషికి ఏమైనా చేస్తాడేమో అనే విషయం మనసులో బాగా పట్టేసుకుంది.

  నిజం తెలుసుకున్న పార్వతి

  నిజం తెలుసుకున్న పార్వతి

  వెంటనే దుర్గకు ఫోన్ చేసి పిలిపించి విషయం అంతా చెప్పి రఘురాం ని నేను నా కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి లేదంటే నా కూతురు అల్లుడు రోడ్డున పడతారు అంటూ ఆమె రెచ్చగొడుతుంది.. అంతేగాక తాను బలహీనంగా ఉన్నానని తన వైపు తన భర్త కూడా నిలబడి పోరాడడు అని చెబుతూ తనకు ఏం చెప్పినా చేసి దీనికి వెనకాడని మనిషి కావాలని అంటుంది. దుర్గ కూడా ఇదేదో తనకి కలిసి వచ్చే విషయం లాగానే ఉంది అని భావించి తనకు సైదులు అనే ఒక వ్యక్తి తెలుసని అతనికి డబ్బు ఇస్తే ఎంతకైనా తెగిస్తాడు అని చెబుతుంది. పార్వతి కూడా తనకి డబ్బుతో ఇబ్బంది లేదని తనకు తన అల్లుడు కూతురు సంతోషంగా ఉండడం ముఖ్యం అని చెబుతోంది.

  సైదులు అనే రౌడీతో

  సైదులు అనే రౌడీతో

  అలా సైదులు అనే రౌడీకి డబ్బిచ్చి మరీ నియమిస్తారు. మరోపక్క ఎవరో సేట్ డబ్బులు ఇవ్వాలని ఫోన్ చేస్తున్నాడు అని చెబుతూ రఘురాం వద్దకు భరత్ ఫోన్ తీసుకెళ్లి ఇస్తాడు. అయితే వైదేహి ఆపరేషన్ కోసం డబ్బులు సమకూర్చే టెన్షన్ లో ఉన్న రఘురాం భారతి అనేక మాటలు అంటాడు ఆ మాత్రం చూసుకో లేకపోతే ఇంక నువ్వు ఎందుకు? ఈ వ్యాపారం నేను ఒక్కడినే చేసుకుంటాను కదా అన్నట్లు మాట్లాడటంతో పాటు ఇప్పుడు డబ్బులు లేవు అని చెబుతాడు. అయితే నాలుగు లక్షల రూపాయలు వచ్చాయి కదా అవి ఏమయ్యాయి అని అడిగితే అవన్నీ నీకు అవసరమా అన్నట్లు మాట్లాడుతాడు. దీంతో నొచ్చుకున్న భారత్ డబ్బు దాచడానికి బ్యాగ్ తీసి చూడగా అందులో డబ్బులు కనబడతాయి.

  ఎందుకిలా చేస్తున్నాడు

  ఎందుకిలా చేస్తున్నాడు

  అప్పు ఉంటే క్షణమైన నిద్రపోకుండా అప్పు తీర్చే అన్నయ్య ఎందుకు ఇలా మారిపోయాడని బాధపడుతూ ఉంటే siri అక్కడికి చేరుకుని విషయం తెలుసుకుని అలా బాధపడవద్దు అంటుంది. ఇక బావగారు ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని చెబుతుంది. మరో పక్క రఘురాం సీత కూడా బాధపడుతూ ఉంటారు/ ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి అనే విషయం లో వాళ్ళిద్దరికీ నిద్ర కూడా పట్టదు/ భరత్ సిరి కూడా అన్నయ్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం మీద బాధపడుతూ ఉంటారు. ఇక రఘురాం సీత తో మాట్లాడుతూ మా కుటుంబానికి పిల్లలు అచ్చి రారు అని ఒక పెద్దాయన అన్నాడని అయినా పిల్లల కోసం ఎందుకు ఇంత తాపత్రయ పడుతున్నారు అని కూడా ప్రశ్నించడాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక శైలుకు ఒకసారి అబార్షన్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుని మరి రఘురాం బాధపడుతూ ఉంటాడు.

  #HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu
  ఇవాళ కూడా నో క్లారిటీ

  ఇవాళ కూడా నో క్లారిటీ

  ఇక. గత రెండు ఎపిసోడ్స్ నుంచి కమింగ్ అప్ లో చూపిస్తున్నట్లుగా పార్వతి ఇంటికి వచ్చి వైదేహి తీసుకు వెళ్లి పోతున్న విషయాన్ని ఈరోజు కూడా చూపించలేదు రేపటి ఎపిసోడ్ లో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో చూపించిన కమింగ్ అప్ ప్రకారం వైదేహి ని తీసుకుని పార్వతి తన ఇంటికి వెళ్లి పోతుంది. ఇంటికి వెళ్లిపోయాక భర్త పాప ని తీసుకు వచ్చావా ఏంటి ? అల్లుడు అమ్మాయి అంటే పాపను ఎరవేసి తీసుకు వచ్చాను అని వాళ్లు కూడా ఇప్పుడు వస్తారు అని అంటుంది/ అంతేగాక రౌడీలను పెట్టిన సంగతిని కూడా భర్తకు చూపిస్తుంది. దీంతో తదుపరి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి చూడాలి మరి ఏమవుతుందో..

  English summary
  Vadinamma Episode 617 : Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Parvati seeks Durga's help to confront Raghuram. Elsewhere, Bharat gets hurt when Raghuram lashes out at him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X