For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma August 13th Episode: లక్ష్మణ్ హత్యాయత్నం.. మరింత విషమించిన వైదేహి ఆరోగ్యం?

  |

  బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 620వ ఎపిసోడ్ కి చేరింది. ఆగస్టు 13వ తేదీన ప్రసారం కాబోతున్న ఈ సీరియల్ ఎపిసోడ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సీరియల్ లో ప్రస్తుతం వైదేహి మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తన మనవరాలిమో కిడ్నాప్ చేసిన పార్వతి తాను అనుకున్నది సాధించాలి అని భావిస్తూ ఉంటుంది. ఇంటికి పాపను ఎత్తుకు రావడమే కాకుండా రౌడీలతో పహారా కాయిస్తూ ఎక్కడికక్కడ హల్చల్ చేస్తూ ఉంటుంది. పాపకు గుండెలో రంధ్రం ఉందన్న సంగతి తెలిసిన సీత మాత్రం పాప కళ్ళముందు లేకపోతే విలవిలలాడిపోతూ ఉంటుంది. ఎలా అయినా ఆమెను తిరిగి ఇంటికి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో పార్వతి ఇంటికి సిరి తో కలిసి బయలుదేరుతుంది.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   ససేమిరా

  ససేమిరా

  అయితే తాను మాత్రం పాపని తీసుకురాలేదని పార్వతి ఇంటికి వచ్చిన సీత, సిరికి తేల్చి చెబుతోంది. నేను మీ ఇంటికి వచ్చిన మాట వాస్తవమే కానీ పాపను నేను ఇంటికి తీసుకు రాలేదు అని అంటుంది. అయితే అటు సీత గాని ఇటు సిరి గాని ఆమె చెప్పిన మాటలు నమ్మరు. ఖచ్చితంగా నువ్వే ఇంటి నుండి తీసుకొచ్చావు ? పాప ఎక్కడ ఉంది ? అని ఇద్దరు గట్టిగా ప్రశ్నిస్తారు. అయితే ససేమిరా నేను తీసుకు రాలేదని ఏం చేసుకోవాలో చేసుకోండి అన్నట్లు పార్వతి మాట్లాడడమే కాక లోపలికి వెళ్ళి చూస్తాను అని బయలుదేరబోతున్న సీతా, సిరి ఇద్దరికీ అడ్డంపడి నిలిపివేస్తుంది.. అంతేకాక ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మ అది మీ మనవరాలు కదా అంటే నా మనవరాలు అనే విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా కనీసం అది నాతో కొన్నాళ్ల పాటు ఆయన గడిపిందా అంటూ పార్వతి ప్రశ్నిస్తుంది.. అంతేకాక తాను పాప ఎక్కడ ఉందో చెప్పే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టి చెబుతుంది.

  పార్వతి డిమాండ్

  పార్వతి డిమాండ్

  నీకేం కావాలో అది చెప్పమ్మా చేస్తాను దయచేసి పాపని ఇవ్వమంటే పదిరోజులపాటు నువ్వు నా మనవరాలు అల్లుడు ముగ్గురూ ఇంట్లోనే ఉండాలని అలా ఉంటాము అంటే చెప్పండి అంటుంది. అయితే సీత మాత్రం ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం ప్రస్తుతం పాప ఎక్కడ ఉందో చెప్పాలి అని అంటుంది.. అంతేకాక పిన్ని నువ్వు తప్పుకోక పోతే మేము లోపలికి వెళ్లి చూస్తామని సీత అనడంతో వెంటనే తాను పెట్టిన రౌడీలను పార్వతి పిలుస్తుంది. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన సైదులు సీతను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. మీద మీదకు వస్తూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక సీత ఈ ఇద్దరూ బయటకు వచ్చి పాప కోసం ఎదురుచూస్తూ ఉంటారు.. మరో పక్క ఇంట్లో రఘురామ్ తల్లి బాధపడుతూ ఉంటుంది. అసలు వాళ్ళకి ఏమైంది ? ఏంటి ? అని తెలుసుకునే ప్రయత్నం చేయమని శైలుని అడుగుతుంది. వాళ్లు టెన్షన్ లో ఉన్నారని వాళ్ళని ఇప్పుడు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని శైలు అంటుంది.

   రంగంలోకి లక్ష్మణ్

  రంగంలోకి లక్ష్మణ్

  ఈ లోపు శైలు ఫోన్ కి భర్త లక్ష్మణ్ ఫోన్ చేస్తాడు. అయితే శైలు కంగారుపడుతూ మాట్లాడుతూ ఉండటంతో అసలు ఏం జరిగింది కరెక్ట్ గా చెప్పమని అడుగుతాడు. వెంటనే శైలు విషయం అంతా వివరించి చెబుతోంది.. తాను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అనడంతో తల్లి ఫోన్ తీసుకుని వెళ్తే నువ్వు వెళ్ళు కానీ భరత్ కి ఈ విషయం చెప్పకు చెబితే గొడవ పెద్దది అవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో లక్ష్మణ్ వెంటనే అక్కడి నుంచి సీత దగ్గరకు బయలుదేరుతాడు. ఈ లోపు ఎంత సేపటికీ సీత సిరి అక్కడినుంచి కదలకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండడంతో సైదులు మెడపట్టి బయటకి గెంతే ప్రయత్నం చేస్తూ సీత మీద చెయ్యి వేయబోతున్న క్రమంలో లక్ష్మణ్ ఎంట్రీ ఇచ్చి ఈ చెయ్యే కదా మా వదిన మీట ఎత్తింది ? అంటూ ఆ చెయ్యి మీద కొట్టి కింద పడేశాడు. అంతేకాక దగ్గర్లో ఉన్న ఒక రాయి తీసుకుని సైదులు బుర్ర బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు..

  సైదుల్ని చంపబోయిన లక్ష్మణ్

  సైదుల్ని చంపబోయిన లక్ష్మణ్

  ఇంకా ఇక్కడే ఉంటే లక్ష్మణ్ ఇంకా ఏం చేస్తాడో అని భయపడి వదినని సిరి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోదాం అంటుంది. అసలు పాపమి తీసుకోకుండా వెళ్లి ఏం చేస్తామని సీత ప్రశ్నించగా ఆ పాప ఉన్నది అమ్మ దగ్గరే కదా మనం కాస్త ఆగి ప్రయత్నిద్దామని సముదాయించి సిరి, లక్ష్మణ్ సీత ఇద్దరిని అక్కడ నుంచి తీసుకుని ఇంటికి బయలు దేరుతుంది.. మరోపక్క రఘురాం పాప కండిషన్ గురించి డాక్టర్ తో చర్చిస్తూ ఉంటాడు.

   పాప కండిషన్ సీరియస్

  పాప కండిషన్ సీరియస్

  పాప కండిషన్ ఏ మాత్రం బాలేదు అని డాక్టర్ చెబుతున్నట్లుగా ఉంది. అయితే మరోపక్క ఇంట్లో శైలు, లక్ష్మణ్, సీత, సిరి, రఘురాం తల్లి అందరూ సమావేశం అవుతారు. అసలు ఏం జరిగింది ? ఇప్పుడు ఏం చేయాలి ? ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు ? అని లక్ష్మణ్ అడుగుతాడు. అయితే పాప గుండెల్లో హోల్ ఉందనే విషయం ఎవరికీ చెప్ప లేని పరిస్థితుల్లో ఉన్న వదినమ్మ ఆలోచనలో పడుతుంది. రఘురామ్ కి ఫోన్ చేసి సలహా అడుగుదామని ప్రయత్నిస్తే మాత్రం రఘు మాత్రం ఫోన్ ఎత్తి పరిస్థితుల్లో లేడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  వైదేహి దొరుకుతుందా?

  వైదేహి దొరుకుతుందా?

  అలా జరుగుతూ ఉండగా సిరి సీత మధ్య స్వల్ప వాగ్వాదం జరుగుతుంది. నీకు ఇష్టం లేని పని చేసి అయినా సరే పాపని ఇంటికి తీసుకు వస్తానని సిరి అంటుంది. ఇష్టంలేని పని అంటే ఏమిటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమా అంటే అవుననే అంటోంది. అలా చేయడం కరెక్ట్ కాదని అలా చేస్తే మీ అమ్మ కూడా మన మీద తిరిగి కేసు పెట్టి మీ పెద్ద బావని బోన్ ఎక్కిస్తుందని, అది నీకు సమ్మతమేనా అని అడుగుతుంది. అలా కాదని అలాంటి వాళ్లకు ఇలా చేస్తేనే కరెక్ట్ అని అనడంతో మన ఇంటి పరువు సమస్య ఇది అలా చేయవద్దని కోరుతుంది. అయితే మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా కంప్లైంట్ ఇవ్వకూడదు అని సీత సిరిని అడుగుతుంది. దీంతో సిరి బాధపడుతున్నట్లుగా చూపించారు. ఇక తర్వాత ఎపిసోడ్ లొ కూడా పాప దొరికినట్లుగా అయితే కనిపించడం లేదు కమింగ్ అప్ లో పాప దొరకడం లేదని చూపించారు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

  English summary
  Vadinamma Episode 620 : Laxman rushes to Parvati's house when he learns about Vaidehi. Elsewhere, Siri lands in a fix as Sita stops her from approaching the police.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X