For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma August 14th Episode: గుండె సమస్య ఉన్న పాపకు ఐస్ క్రీమ్.. తల్లడిల్లిన సీతమ్మ!

  |

  బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 621వ ఎపిసోడ్ కి చేరింది. ఆగస్టు 14వ తేదీన ప్రసారం కాబోతున్న కూతురు వైదేహి మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమెను ఎత్తుకెళ్లిన పార్వతి పాపను ఇంట్లో పెట్టుకొని తనకు ఏమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేస్తుంది. అలాగే తన ఇంటి మీదకు వచ్చిన రౌడీలతో కొట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇలా జరుగుతున్న క్రమంలో లక్ష్మణ్ కూడా పార్వతి ఇంటికి చేరుకుంటాడు.

  రఘురామ్ ప్రమేయం

  రఘురామ్ ప్రమేయం

  సిరి, లక్ష్మణ్, సీత ముగ్గురు కలిసి పార్వతిని అడిగినా ఉపయోగం లేకుండా పోవడంతో అందరూ మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. అయితే ఇప్పటికే హాస్పిటల్ లో డాక్టర్ తో మాట్లాడుతున్న రఘురామ్ కి వరుసగా సీత ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రఘురామ్ డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మళ్ళీ సీత కి ఫోన్ చేస్తాడు. సీత విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది అయినా రఘురాం వినిపించుకోలేదు. అయితే చివరికి ఇలా జరిగింది అనే విషయం చెప్పగా రఘురాం గొడవలు ఏమీ వద్దు అని గొడవలు పడకుండా పాపను తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెబుతాడు.

  దుర్గతో స్కెచ్

  దుర్గతో స్కెచ్


  అయితే ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పేద్దామా అని అడిగితే ఇప్పుడే చెప్పవద్దని ఇప్పుడే చెబితే సిరి, భరత్ బాగా బాధ పడతారని మరో 1,2 రోజుల్లో పాప ఆపరేషన్ కి డేట్ ఫిక్స్ అవుతుందని రఘురాం చెబుతాడు. అది ఫిక్స్ అయిన తర్వాత ఎలాగో చెప్పాల్సిందే కదా అప్పటి దాకా అయినా ప్రశాంతంగా ఉండనిద్దామని అంటాడు. అయితే ఎలాగోలా పాపను నీ దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం చేయమని కూడా అంటాడు. ఇక ఈ విషయంలో ఆలోచనలో పడిన సీత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా పార్వతికి దుర్గ బాగా దగ్గర అనే విషయం గుర్తొస్తోంది. ఈ విషయం గురించి తన అన్న భాస్కర్ కి ఫోన్ చేసి చెబుతుంది. దుర్గ పార్వతి ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి, పాపని ఎక్కడ దాచింది అనే విషయం దుర్గకు తెలిసే అవకాశం ఉంటుందని దయచేసి ఆమెను అడగాలి అని అంటుంది.

  కాసులపేరు నాటకం

  కాసులపేరు నాటకం

  విషయం అర్థమైన భాస్కర్ తన భార్యతో కాసులపేరు నాటకం ఆడుతాడు, ఈ రోజు నీకు ఒక శుభవార్త ఒక దుర్వార్త ఉన్నాయని చెప్పడంతో శుభవార్త ఏమిటో చెప్పాలని దుర్గ అడుగుతుంది. నీకు కాసులపేరు చేయించాలని అనుకున్నానని దానికి ఆర్డర్ ఇవ్వగా అది ఈ రోజు వస్తుంది అని అంటాడు. అయితే బ్యాడ్ న్యూస్ అనేది తాను వినాలి అని అనుకోవడం లేదు అని దుర్గ అంటుంది. కానీ విని తీరాల్సిందే అనడంతో ఏమిటి అని ప్రశ్నిస్తుంది.

  అంతా చెప్పేసి

  అంతా చెప్పేసి

  తాను ఆర్డర్ ఇచ్చాను కానీ ఒక పది వేల రూపాయలు డబ్బులు తక్కువగా ఉన్నాయని వాటిని ఎలా సర్దాలి అర్థం కావడం లేదని అంటాడు. దానికి ఇంత టెన్షన్ పడుతున్నారా ? నా దగ్గర ఉన్నాయి అని చెప్పి 10,000 తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో అసలు ఈ 10,000 ఎక్కడివి నీకు ? దొంగతనం చేసే తెచ్చావా? అని గట్టిగా గద్దించి అడగడంతో అసలు విషయం అంతా చెప్పేస్తుంది దుర్గ.

  అందరూ కలిసి

  అందరూ కలిసి


  విషయం తెలుసుకుని సీత ఇంటికి వెళ్ళిన భాస్కర్, పార్వతి తన ఇంట్లోనే మనవరాలిని పెట్టుకుని మనల్ని ఇబ్బంది పెడుతోందని మాకు అబద్ధం చెబుతోందని అంటాడు. ఇక భాస్కర్, లక్ష్మణ్, సీత, సిరి నలుగురు కలిసి పార్వతి ఇంటికి బయలు దేరి వెళతారు. పార్వతి ఇంటి బయట ఆమె భర్త పేపర్ చదువుకుంటూ కనిపిస్తాడు. ఇంత జరుగుతుంటే పేపర్ ఎలా చదవబుద్ధి అవుతుంది అంటూ లక్ష్మణ్ చిరాకు పడతాడు. ఇంతలో వీళ్ళు రావడం చూసి ఆయన పరుగు పరుగున వచ్చి ఇప్పుడే నా రావడం లోపలికి రండి అని ఆహ్వానిస్తాడు. వీళ్ల మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా సిరి తల్లి పార్వతి పాపను తీసుకుని బయటకు వస్తుంది.. అయితే ఇప్పటి దాకా పాప మీ దగ్గర లేదు అని చెప్పారు కదా అంటే అది మీకు అనవసరం అని నా మనవరాలు నా దగ్గర ఉండటం తప్పేమీ కాదని అంటుంది.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  ఇంకా పార్వతి దగ్గరే

  ఇంకా పార్వతి దగ్గరే


  అంతేకాక నేనేమి రాక్షసిని కాదని నా మనవరాలిని ఎలా చూసుకోవాలి అని నాకు తెలుసు అని అంటుంది. పాపను ఇవ్వాలని అడిగితే సీత మీద కోప్పడుతుంది పార్వతి. అయినా సరే పాపని ఎలా అయినా తీసుకువెళ్లాలని సీత భావిస్తుండగా పాపను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది పార్వతి. అయితే ప్రస్తుతానికి పాపనను ఇచ్చేయాలని తర్వాత రఘురాం వచ్చి నీతో మాట్లాడతాడు అని భాస్కర్ ను ఒప్పించే ప్రయత్నం చేసినా పార్వతి ఒప్పుకునే లాగా అనిపించడం లేదు. పాపకు ఐస్ క్రీమ్ తినిపిస్తా అని చెప్పి ఐస్ క్రీమ్ కూడా తినిపిస్తూ ఉంటుంది. పాప గుండె జబ్బుతో బాధ పడుతున్న క్రమంలో చల్లటి పదార్థాలు ఏవి పెట్టవద్దని రఘురాం ముందే హెచ్చరించడంతో చేతిలో ఐస్ క్రీం తీసుకుని పడేస్తుంది సీత. కావాలనే ఇలా చేస్తుందని పార్వతి సీత మీద ఫైర్ అవుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. పాప అయితే ఇంకా పార్వతి దగ్గరే ఉంది.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  English summary
  Vadinamma Episode 621 : Durga reveals the truth when Bhaskar threatens to call the police. Elsewhere, Parvati and Sita get into a heated argument.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X