For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 17th Episode: రెచ్చిపోయిన పార్వతి.. సీతకి ఘోర పరాభవం.. ఎవరూ ఊహించని విధంగా!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ఆసక్తికరమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సీరియల్ 623వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఆగస్టు 17 వ తేదీన ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్ లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  పాప కోసం

  పాప కోసం

  పాపను తీసుకువెళ్లి పార్వతి ఇంట్లో పెట్టుకోవడంతో సిరి - భరత్ కూడా వెళ్లి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.. అయితే పాపని ఎలాగైనా చూడాలనే ఉద్దేశంతో సిరి లక్ష్మణ్ రాకపోయినా సరే ఒక్కతే పార్వతి ఇంటికి బయలు దేరుతుంది.. పార్వతి ఇంటికి చేరుకున్నాక పార్వతి ఇంట్లో ఉన్న వారంతా నిద్ర పోయినట్టు కనిపిస్తున్నారు. దీంతో ఇల్లు మొత్తం తలుపులు వేసి ఉంటాయి. సీత తలుపులు కొట్టడానికి ప్రయత్నం చేసినా మళ్ళీ పార్వతి లేస్తే మళ్ళీ గొడవ చేస్తుందనే ఉద్దేశంతో ఏం చేయాలో పాలు పోక అక్కడ గుమ్మం దగ్గర కూర్చుని ఉంటుంది. ఏదో పని మీద బయటకు వచ్చిన సీత అక్కడ కూర్చుని బాధ పడడం చూసి ఈ సమయంలో ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.

  పార్వతి ఇంటికి

  పార్వతి ఇంటికి

  పాపను చూడాలని అనిపించి వచ్చానని సీత చెబుతుంది. అయితే ఎందుకు నువ్వు టెన్షన్ గా కనపడుతున్నావు ? అసలు ఏమైంది ? అని సిరి అడిగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ విషయం బయట పెట్టొద్దు అని రఘురామ్ చెప్పడంతో ఈ విషయం బయట పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది. అయితే అదేమీ లేదని పాప మీద బెంగ ఉందని సీత చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే సిరి కి మాత్రం సీత మీద అనుమానం వస్తుంది. పాప విషయంలో ఎందుకు ఇంత హైరానా పడుతుంది అని ఆలోచనలో పడుతుంది. అయితే ఎలా అయినా పాపను ఇచ్చేస్తే ఇంటికి తీసుకు వెళ్ళి పోతా అని అడగడంతో అసలు పాప కోసమే కదా ఇక్కడ వరకు వచ్చింది పాపను ఇచ్చేస్తే అమ్మ మళ్ళి గోల చేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి బయటకు తీసుకురా ఎత్తుకుంటాను అని చెప్పడంతో సిరి లోపలికి తీసుకు వెళ్లి పాపతో కాస్త గడిపే అవకాశం ఇస్తుంది. అయితే పాప ఏడవడం మొదలు పెట్టడంతో సీత ఆమెను ఎత్తు కుంటుంది.

  కింద పడేయడంతో

  కింద పడేయడంతో

  మరో పక్క ఇంట్లో సీతను అలా ఎలా ఒక్కదాన్నే పంపించావు అని తల్లి లక్ష్మణ్ ని నిలదీస్తుంది. నేను చెప్పే లోపు ఆమె వెళ్ళిపోయింది అని లక్ష్మణ్ ఇంట్లో చెబుతాడు. అయితే అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్లాలి అని చెప్పడంతో బయలుదేరి పార్వతి ఇంటికి వెళతాడు. ఈలోపులో అక్కడ పాప ఏడుపు కు పార్వతి నిద్రలేవడం సీత పాపం ఎత్తు కోవడం చూసి పార్వతి రెచ్చిపోవడం వెంటనే జరిగిపోతాయి. ఇంకేముంది పార్వతి హడావిడి చేస్తూ పాపను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తోందని అందుకే ఇంత రాత్రి సమయంలో వచ్చి పాపను ఎత్తుకుని ఎక్కడికి వెళ్తుంది అని నిందలు వేస్తుంది. అయితే ఈ విషయం మీద కుటుంబ సభ్యులందరూ పార్వతికి ఎదురు తిరుగుతారు. సీత అలాంటి మనిషి కాదని నీలాగా ఎత్తుకుని వెళ్లిపోయే మనిషి కాదు అని అంటూ ఉంటారు. అయితే ఈ వాగ్వాదం పెద్దది కావడంతో సీత దగ్గర ఉన్న పాపని లాక్కుని సీతను కింద పడేసి ప్రయత్నం చేస్తుంది. పార్వతి అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణ్ ఆమె కింద పడిపోకుండా పట్టుకున్నాడు..

  కొట్టబోవడంతో

  కొట్టబోవడంతో


  వదినను అలా చేయడంతో భరత్ కి కోపం పెరిగిపోయి పార్వతి మీద చేయి చేసుకోబోతున్నాడు. తర్వాత వెనక్కి తగ్గుతాడు, నా వదినకి అవమానం జరిగిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండబోయేది లేదు అంటూ బయటకు వెళ్ళిపోతాడు. అయితే ఇది చూసి పార్వతి సహా మిగతా వాళ్ళు అందరూ షాక్ అవుతారు అయితే పాప వద్దు మనం ఇక్కడినుంచి వెళ్ళిపోదామని భరత్ అనడంతో షాక్ అవుతుంది పాప లేకుండా ఇక్కడి నుంచి మనం కలుద్దాం అని అంటుంది సీత. అయితే పాపను ఇచ్చే ప్రసక్తి లేదని అది ఉంటేనే మీరందరూ నా మాట వింటారు అని పార్వతి కూడా తెగేసి చెబుతుంది..

   విషాదంలో కుటుంబం

  విషాదంలో కుటుంబం

  పాప గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అసలు ఏం జరిగింది అని అందరూ సీతను ప్రశ్నించే విధంగా మాట్లాడటంతో సీత ఏం చేయాలో తెలియక ఏడవడం మొదలు పెడుతుంది. ఈ విషయం తాను చెప్పగలిగితే ఎప్పుడో చెప్పేదాన్ని కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానని ఆమె ఏడవడం మిగతా వాళ్లకు ఎలా సముదాయించాలో అర్థం కాదు. పార్వతి మాత్రం ఇదంతా ఒక స్టంట్ అన్నట్లు చూస్తూ ఉంటుంది. ఇక మొత్తం మీద అలా ఈరోజు ఎపిసోడ్ ముగించారు. ఇక తర్వాతి ఎపిసోడ్ లో రఘురాం అక్కడికి రావడం పాప గుండెల్లో ఒక రంధ్రం ఉందనే విషయం తెలియజేయడంతో కుటుంబం అంతా విషాదంలో మునిగి పోతుంది.. అలాగే పాపకు ఆపరేషన్ కూడా ప్రారంభమైనట్లు గా చూపించారు.. మరి తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే లేదనిపిస్తోంది చూడాలి ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Vadinamma Episode 623 : Siri suspects Sita when she hides from her. Later, Parvati gets furious after spotting Sita with Vaidehi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X