For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 18th Episode: కొంపముంచిన ఐస్ క్రీమ్ చావుబతుకుల్లో వైదేహి.. కానీ పార్వతి?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ఆసక్తికరమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సీరియల్ 623వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఆగస్టు 17 వ తేదీన ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్ లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ప్రస్తుతం వైదేహి ఆరోగ్య పరిస్థితి గురించి పెద్ద ఎత్తున ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గుండెలో రంధ్రం తో బాధపడుతున్న వైదేహిని ఈ విషయం తెలియని అమ్మమ్మ కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకు వెళ్ళిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. రఘురాం వచ్చి తనను బతిమిలాడితే తప్ప పాపను ఇవ్వను అంటూ పార్వతి మొండితనం ప్రదర్శిస్తూ ఉంటుంది. సీత వెళ్లి ఎంత బతిమిలాడుతున్నా పాపను ఇచ్చేది లేదు అంటూ సీతను సైతం అవమానించి కిందపడేసి ప్రయత్నం చేస్తుంది.. అయితే సీతను పడేసే ప్రయత్నం చేయడంతో భరత్ కి కోపం వచ్చి అత్తగారి మీద చేయి చేసుకోబోతాడు. అంతలోనే తమాయించుకుని నా వదినకు అవమానం జరిగిన ఇంట్లో నేను ఉండేది లేదు జన్మలో ఇంటి గడప తొక్కను అని బయటికి వెళ్ళిపోదామని వదినను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగియగా

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  ఎందుకిలా చేస్తున్నారు

  ఎందుకిలా చేస్తున్నారు

  ససేమిరా పాప లేకుండా బయటకు రాను అని చెబుతున్న సీతతో భరత్, లక్ష్మణ్, సిరి ఇంత అవమానం పడుతున్నా ఎందుకు మళ్ళీ పాప కోసం అని వెనక్కి వెళుతున్నావు అని ప్రశ్నిస్తారు.. అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత బలవంత పెడుతున్నారు ? అని అడగడంతో తాను చెప్పలేనని ఏడవడం మొదలు పెడుతుంది . అయితే ఆమె విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో రఘురాం వస్తాడు.. ఇంకా ఈ విషయం దాచటం అనవసరం సీత అని చెబుతూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.. అయితే రఘురామ్ ని చూడడంతో సీత మరింత ఏడుస్తూ ఉంటుంది.. ఇంటి లోపలికి అడుగు పెట్టిన రఘురాం అసలు ఎందుకిలా చేస్తున్నారు అత్తయ్య ? అసలు నీకు ఏం కావాలి ? అని ప్రశ్నిస్తాడు. ఇంతలో పాప చలిలో ఉందనే విషయం అర్థమై ముందు పాపను లోపల పడుకో పెట్టాలని సిరిని లోపలికి పంపిస్తాడు.

  కూలబడి పోయే పరిస్థితిలో

  కూలబడి పోయే పరిస్థితిలో

  లోపలికి పంపించిన కాసేపటికి వైదేహి గుండెల్లో ఒక రంధ్రం ఉందని ఈ విషయం తమకు కొద్ది రోజుల క్రితం తెలిసింది అని చెబితే మీరు బాధ పడతారు అనే ఉద్దేశంతో ఇప్పటివరకు మీకు చెప్పలేదు అని అంటాడు. ఒకరకంగా వైదేహీ విషయం చెప్పగానే పార్వతి కూడా వణికిపోతుంది ఎందుకిలా చేశానా అని పశ్చాత్తాప పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే సిరి, భరత్ అయితే నుంచున్న చోట కూలబడి పోయే పరిస్థితిలో ఉన్నారు. మేమేం పాపం చేశాము మా పాపకి ఇలా అవుతుంది అని వాళ్ళ బాధపడుతూ ఉంటారు. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు మా గుండెల్లో ఈ నిజాన్ని దాచుకున్నామని రఘురాం చెబుతాడు. అంతేకాక పార్వతి వైపు తిరిగి వైదేహి గుండెలో రంధ్రం ఉంది కాబట్టే ఆమెకు ఇన్సూరెన్స్ ఇవ్వరు అని అందుకే ఆమెకు చేయించలేదు అని రఘురామ్ చెబుతాడు.

  అందుకే చేయించలేదు

  అందుకే చేయించలేదు

  రిషి కి 10 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను కానీ వైదేహి గుండె ఆపరేషన్ చేయించడం కోసం 10 లక్షల డబ్బు కోసం తిరుగుతూ ఉన్నానని రఘురామ్ చెప్పుకొస్తాడు. నాకు ఇద్దరు పిల్లలు ఒకటే అని కాకపోతే ఇంత అందమైన రూపం ఇచ్చిన భగవంతుడు వైదేహీ గుండెలో రంధ్రం పెడతాడని ఎవరు ఊహించలేదని రఘురాం బాధపడతాడు. పార్వతి కి బుద్ధి వచ్చేలా విషయం వివరించిన తర్వాత ఇంటికి వెళ్దాం పద అని పాపని తీసుకురమ్మని సిరిని కోరతాడు.. పాపను తీసుకురావడానికి లోపలికి వెళ్లి తిరిగి పాప ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించి అదే విషయాన్ని బయటకు వచ్చి చెబుతుంది. వెంటనే విషయం అర్థమైన రఘురాం వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నామని మీరు వెంటనే రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. దారిలో డాక్టర్లకు ఫోన్ చేసి పాపకు ఇబ్బంది వచ్చిందని వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉందని కోరతాడు.

  ఏడు లక్షలు ఖర్చు

  ఏడు లక్షలు ఖర్చు

  అలా హాస్పిటల్ కి పాపని తీసుకువెళ్ళిన రఘురాం పాప ఆపరేషన్ కి సిద్ధం చేయమని డాక్టర్లను కోరతాడు. అర్ధరాత్రి సమయంలో కూడా డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి సిద్ధం అవుతారు. ఇంతలో ఇంటి దగ్గర విషయం తెలియని శైలు లక్ష్మణ్ కి ఫోన్ చేసి ఏం జరుగుతోంది? ఎంతసేపు రాకుండా ఏం చేస్తున్నారు ? అని ప్రశ్నిస్తుంది. అయితే విషయం చెప్పిన లక్ష్మణ్ ఇలా జరిగింది అని చెప్పడంతో ఇంట్లో అందరూ బాధపడతారు. అయితే ఆపరేషన్ కోసం ఏడు లక్షలు ఖర్చు అవుతుందని కానీ తన దగ్గర మూడున్నర లక్షలు మాత్రమే ఉన్నాయని రఘురాం అంటాడు. ఆ డబ్బు కోసం ఎలాగోలా ఏర్పాట్లు చేస్తానని భయపడవద్దని కూడా సీతకు అభయమిస్తాడు.

  అంతా ఓకే

  అంతా ఓకే

  అయితే తాను చేసిన తప్పు తెలుసుకున్న పార్వతి తనను క్షమించమని అడుగుతుంది అంతా జరిగిపోయాక అప్పుడు క్షమించి లాభం ఏమిటి అందరూ బాధపడుతూ ఉంటారు.. ఆ దేవుడు నా మనవరాలిని బాగా ఉంచి నన్ను తీసుకుపోయినా బాగుండు అని పార్వతి బాధ పడుతూ ఉంటుంది. ఇక పాప ఆపరేషన్ ప్రారంభమౌతుంది ఆపరేషన్ కోసం వైద్యులు కష్టపడుతూ ఉంటారు. ఇక్కడితో నేటి స్పిసోడ్ ముగుస్తుంది. ఇక తరువాత కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం పాపకు ఆపరేషన్ సక్సెస్ అయిపోయినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఎలాంటి టెన్షన్ లేకుండా సీత నవ్వుతూ మాట్లాడుతూ నాని భార్య శిల్పను శ్రావణ మాసంలో మా ఇంటికి పంపాలని కోరడం కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

  English summary
  Vadinamma Episode 624 : Siri and Bharat are heartbroken when Raghuram reveals a shocking truth about Vaidehi's health. Out of frustration, he blames Parvati for Vaidehi's loss.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X