For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 19th Episode: పాప ప్రాణాలు సేఫ్ కానీ.. నాని ప్రాణాలకే గండం, మర్డర్ స్కెచ్?

  |

  తెలుగు లో టీవీ సీరియల్స్ హవా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగు టెలివిజన్ స్టార్ ప్రభాకర్ సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ లో ప్రస్తుతం వైదేహి గుండెలో రంధ్రం అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు ఇన్సూరెన్స్ చేయించక పోవడంతో ఆ విషయం మనసులో పెట్టుకుని పార్వతి మనవరాలిని కిడ్నాప్ చేసి రఘురాం ని దారిలోకి తెచ్చుకోవాలంటే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం పాప ప్రాణాలమీదకు తీసుకువస్తుంది.. పాపకు ఊపిరి ఆడకపోవడంతో అప్పటికప్పుడు ఆమెను హాస్పిటల్ కి తరలిస్తారు కుటుంబ సభ్యులు. హుటాహుటిన పాపకు ఆపరేషన్ కూడా ప్రారంభమవుతుంది అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   టెన్షన్ టెన్షన్

  టెన్షన్ టెన్షన్

  ఒక పక్క పాప ఆపరేషన్ లోపల జరుగుతూ ఉంటే బయట మాత్రం అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. సీత, రఘు, లక్ష్మణ్, భరత్, పార్వతి ఆమె భర్త ఇలా బయట అందరూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఈ గండం నుంచి గట్టెక్కేందుకు బాగుండు అని భావిస్తూ ఉంటారు. అయితే లోపల నుంచి వచ్చిన డాక్టర్ చాలా సేపు వీళ్ళ వంక అనుమానాస్పదంగా చూస్తూ ఉండడంతో ఇక పాప ప్రాణాలకు గండం ఏర్పడింది అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇక టెన్షన్ పడింది చాలు పాప ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు పాప ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది అని డాక్టర్ చెప్పారు. దీంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది ఇక పాపకు టెన్షన్ లేదు తమ కుటుంబం బాధపడాల్సిన పనిలేదు అంటూ అందరూ ఆనంద పడుతూ ఉంటారు. కానీ అంటూ డాక్టర్ చెప్పడం తో మళ్లీ అందరిలో టెన్షన్ మొదలవుతుంది.

  ఏం పర్లేదు

  ఏం పర్లేదు

  డాక్టర్ మళ్ళీ రిలాక్స్ అవ్వండి అని చెప్పి ఒక్క నెల రోజుల పాటు ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాలి అని ధైర్యం చెప్పారు. ఇక ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని కానీ నెల రోజుల పాటు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటే బాగుంటుంది అని అంటాడు. కచ్చితంగా మీరు చెప్పినట్లే చేస్తామని రఘురామ్ అంటాడు. అలాగే పాపను బతికించినందుకు డాక్టర్ కి దండాలు పెడుతూ ఉంటే డాక్టర్ మాత్రం పాపకి ఇంకా ఆయుష్షు వుంది కాబట్టే తాను ప్రాణాలు పోయగలిగానని అంటాడు. అలాగే పాప ఆపరేషన్ కి సంబంధించి ఏడు లక్షల రూపాయలను కట్టలేనని ప్రస్తుతం మూడున్నర లక్షల రూపాయలు కట్టానని మిగతా డబ్బులు వీలైనంత త్వరగా కడతానని రఘురామ్ అంటాడు. అదేమీ అవసరం లేదని మీకు ఎంత చేతనైతే ఎంత కట్టాలి అని డాక్టర్ అంటాడు.

  గృహలక్ష్మీ సీరియల్ తో మిక్స్

  గృహలక్ష్మీ సీరియల్ తో మిక్స్

  మీ పరిస్థితి అమ్మకు తెలుసు కాబట్టి మిగతా డబ్బులు దాతల నుంచి తీసుకోమని సలహా ఇచ్చిందని ఆ విధంగా తాను చేస్తానని డాక్టర్ అంటాడు.. అలాగే డాక్టర్ తల్లి గురించి కూడా రఘురామ్ ప్రస్తావిస్తాడు. ఇంతకీ ఆ డాక్టర్ తల్లికి మరెవరో కాదు స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరి పోషిస్తున్న తులసి క్యారెక్టర్. అంటే ఈ రెండు సీరియల్స్ లో పాత్ర లను కలిపే ప్రయత్నం చేసింది వదినమ్మ యూనిట్. అలా డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అభి పాపకు ఆపరేషన్ చేసి ప్రాణం పోస్తాడు. ఇక ఆ తర్వాత రఘురాం ఈ విషయంలో పడిన బాధ గురించి అందరూ ఆలోచించి నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నామని బాధపడతారు. అంతేగాక ఈ విషయంలో క్షమించమని కూడా పార్వతి అడుగుతుంది. అయితే సీత కల్పించుకుని అంతా సవ్యంగా జరిగింది పాప తిరిగి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి బాధలు లేదని అంటుంది.

  అనుమాన పడను

  అనుమాన పడను

  ఇక ఎట్టకేలకు సిరి భరత్ ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకోగానే విషయం అంతా చెప్పి పాప ఆపరేషన్ సక్సెస్ అయిందని అంటారు. అయితే కన్న తల్లిదండ్రుల మీరిద్దరూ అక్కడ ఉంటే బాగుంటుంది కదా అని రఘు రాం తల్లి అనగా మేము పాపకు జన్మనిచ్చిన తల్లిదండ్రులమే కానీ అంతకన్నా ఎక్కువగా రఘురాం సీత ఇద్దరు చూసుకుంటున్నారని భరత్ చెబుతాడు. ఇక అంతకుముందు కూడా భరత్ అన్నయ్య దగ్గర ఈ విషయంలో తప్పుగా ఆలోచించి తప్పు చేశానని జీవితంలో నీ మీద అనుమాన పడనని అని చెబుతాడు. ఇక ఇంటికి వచ్చాక కూడా తల్లితో అదే మాట అంటే సిరి కల్పించుకుని ఈసారి అనుమానం పడితే నేను నీ పని చెబుతాను అంటూ సరదాగా అని దాన్ని తేలిక పరిచే ప్రయత్నం చేస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  పార్వతిని దెప్పి పొడుస్తూ

  పార్వతిని దెప్పి పొడుస్తూ

  మరో పక్క పార్వతిని ఆమె భర్త దెప్పి పొడుస్తూ ఉంటాడు. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు ఎంత దాకా వచ్చింది అని. అయితే నేను ఏమీ దెయ్యాన్ని, రాక్షసిని కాదని నా మనవరాలు మీద ప్రేమతో అలా చేశానని ఆమె అంటుంది. ఇప్పటికైనా రఘురాం గురించి తెలుసుకున్నాము ఇకమీదట అయినా అతని మీద అనుమానాలు పెట్టుకోకుండా ఉండాలని భర్త అంటే అలాగే ఉంటాను అని పార్వతి అంటుంది. అంటే ఒక రకంగా ఆమె మారినట్లుగా కనిపిస్తోంది కానీ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో చూపించినట్లు గానే మళ్లీ కమింగ్ అప్ అదే చూపించారు. సో తర్వాత ఎపిసోడ్ లో నానీ మీద హత్య ప్రయత్నం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  English summary
  Vadinamma Episode 625 : Siri and Bharat are heartbroken when Raghuram reveals a shocking truth about Vaidehi's health. Out of frustration, he blames Parvati for Vaidehi's loss.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X