For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 23rd Episode: టీ స్కెచ్ వేసిన శిల్ప.. దెబ్బకి శోభనం క్యాన్సిల్.. మళ్ళీ కొత్త టెన్షన్!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ లో రఘురాం కుటుంబం పడుతున్న కష్టాలు ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటోంది అనే విషయాలను దర్శకుడు ఆసక్తికరంగా ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ కుటుంబంలో సిరి కుమార్తె వైదేహి గుండెలో సమస్య ఏర్పడగా ఆ సమస్య నుంచి కుటుంబం గట్టెక్కింది. ఇప్పుడు నాని భార్య శిల్పను ఎలాగైనా ఇంటికి తీసుకు రావాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తూ ఉండగా శిల్ప తల్లి దమయంతి మాత్రం అందుకు అన్ని విధాలుగా అడ్డుపడుతూ వస్తుంది.

  తాజా ఎపిసోడ్ లో దమయంతి పంపిన కార్ యాక్సిడెంట్ అవడంతో ఇప్పుడు ఆ వంక చూపించి తన కూతుర్ని అత్తారింటికి పంపకుండా ఉండడానికి ప్లాన్ చేసింది. అయితే తాజా ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

  నేనే టీ చేసి తీసుకువస్తా

  నేనే టీ చేసి తీసుకువస్తా

  భరత్, సిరి, నాని ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ వీరందరూ ఇంటికి రాగానే ఫస్ట్ ఎయిడ్ చేయిస్తుంది దమయంతి.. అయితే వీళ్ళందరికీ కాఫీలు పెట్టి తీసుకురమ్మని కూతురికి చెప్పగా పని అమ్మాయి రాలేదని కూతురు ఎదురు చెబుతుంది. అయితే వీళ్ళందరూ నా చుట్టాలు కాబట్టి నేనే టీ చేసి తీసుకువస్తానని వంటగది వైపు వెడుతుంది..

  నేర్పించి ఉండి ఉంటే

  నేర్పించి ఉండి ఉంటే

  దీంతో భరత్, సిరి కలిసి నానిని ఏడిపిస్తుంటారు. మా శిల్ప కు అత్త వారి ఇల్లు అంటే ఎంత ప్రేమో అని సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. ఈలోగా వంట గదిలోకి వెళ్ళిన శిల్పా తనకు ఈ వంటగది గురించి తల్లి ఏమీ చెప్పలేదు ముందు నుంచి నేర్పించి ఉండి ఉంటే బావుండేది అని బాధపడుతూ ఉంటుంది.

  అంతేకాక తల్లితో ముందు వేసిన ప్లాన్ ప్రకారం శిల్ప ఏం చేయాలి అనే విషయాన్ని సిద్ధం చేస్తుంది. దమయంతి చెప్పిన ప్లాన్ ఏమిటంటే ఒంటి మీద వేడివేడి టీ ఒలికి పోయినట్లుగా శిల్ప నటించాలి. దీంతో అది కూడా ఒక అపశకునము అనే ఉద్దేశంతో దమయంతి శిల్పను ఇంటి నుంచి పంపకుండా ఆపుతుంది.

  శిల్పను ఇంటికి పంపను

  శిల్పను ఇంటికి పంపను

  తల్లి చెప్పిన ప్లాన్ ప్రకారమే శిల్ప నటించి కాస్త వేడి తక్కువగా ఉన్న టీ తనమీద ఒలికినట్లుగా నటిస్తుంది నటించడమే కాక ఒళ్ళు కాలిపోతున్న నటించి లోపలికి వెళుతుంది. ఈ లోపు దమయంతి కాసేపు నటించి అసలు ఎందుకో మీ ఇంటికి పంపాలి అంటే ఇలా అపశకునాలు జరుగుతున్నాయి అన్నట్లు మాట్లాడుతుంది తన కూతురిని ఇప్పుడు పంపి ఉద్దేశం లేదని చెబుతూ ఈ విషయం భరత్, సిరి లకు చెబుతుంది.

  అయితే ఈ నిర్ణయం మేము తీసుకోలేమని సీత వదినకు చెప్పాల్సిందేనని భరత్ అంటాడు. అవును మీ ఇంట్లో నిర్ణయాలు తీసుకునేది ఆమె కదా అన్నట్లు దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ దమయంతి సీతకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలా మీవాళ్లు వస్తున్న కారు యాక్సిడెంట్ అయింది శిల్ప ఒంటి మీద వేడి వేడి టీ ఒలికిపోయాయి, ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తోంది ఇప్పట్లో నేను శిల్పను ఇంటికి పంపనున్నట్లు మాట్లాడుతుంది.

  నేనే వచ్చి చెబుతా

  నేనే వచ్చి చెబుతా

  అయితే ఇవన్నీ మూఢనమ్మకాలు అని మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే ఆగిపోతామా అని ప్రశ్నించిన సీత అదేమీ అవ్వదని మీరు సైలెంట్ గా మీ అమ్మాయిని ఇచ్చి పంపించండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అయితే ఎలా అయినా కూతుర్ని ఇంటి నుంచి బయటకు పంపకూడదు అని ఫిక్స్ అయిన దమయంతి మీ సీతమ్మ ఒప్పుకోలేదని ఖచ్చితంగా పంపాల్సిందే అని చెప్పింది అని అంటుంది.

  అంతేగాక ఫోన్లో చెప్పడం వల్ల ఆమె అర్థం చేసుకొని ఉండక పోవచ్చు అని చెబుతూ నేను నేరుగా వచ్చి చెబితే ఆమెకు అర్థం అయ్యే అవకాశం ఉంటుంది అని అంటుంది. అలాగే అని చెబుతూ ఆమెను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు భరత్, సిరి.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఛాలెంజ్

  ఛాలెంజ్

  ఇక భరత్, సిరి, నాని దమయంతి నలుగురు కలిసి సీత ఇంటికి వెళ్తారు. అప్పటికే వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్న సీత కారు చప్పుడు వినబడగానే చేతిలో హారతి పళ్ళెం తీసుకుని ఎదురు వెళ్తుంది. కానీ కారు నుంచి దమయంతి బయటకు రావడం చూసి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. అయితే వచ్చిన వారిని బయట నుంచొని పెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదని చెబుతూ లోపలికి తీసుకెళ్లి మాట్లాడిస్తుంది.

  అసలేం జరిగింది ఎందుకు అమ్మాయిని పంప లేదు అంటే ఈ విషయాలన్నీ మళ్లీ చెప్పి తనకు ఇవన్నీ అపశకునాలు లాగే అనిపిస్తున్నాయి అని అంటుంది. మా భయాలను అంత ఈజీగా తీసుకోవద్దు సీత నేను ఎందుకు చెబుతున్నానో ఆలోచించమని చెబుతుంది. అయితే ముందు మా ఇంట్లో వ్రతం చేయించాలని సీత దమయంతితో అంటుంది.

  దానికి దమయంతి చాలెంజ్ చేస్తుంది ఒక రకంగా ఈ వ్రతం చాలెంజ్ అని ఈ వ్రతం కనుక మీరు జరిపించలేకపోతే నానిని మా ఇంటికి ఇల్లరికం పంపించాలని కండిషన్ పెడుతోంది. మనం ముహూర్తాలు చూసుకునేది మంచి జరగడం కోసం కదా అలాంటిది అపశకునాలు ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆమె ప్రశ్నిస్తుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు.

  English summary
  Vadinamma Episode 628 : Shilpa implements Dhamayanth's ploy against Nani. Later, Dhamayanthi refuses to send Shilpa along with Nani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X