For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 25th Episode: సీతకు ఊహించని షాక్.. ఫలించిన దమయంతి స్కెచ్.. మామూలుగా లేదుగా!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లెలేదు. సీరియల్ లోని ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగడంతో సీరియల్ మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం నాని శిల్పా శోభనం విషయం మీద రెండు కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఎలా అయినా శిల్పను అత్తారింటికి తీసుకురావాలని నాని వాళ్ల కుటుంబం భావిస్తుంది. ఎలాగైనా కూతురుని అత్తారింటికి పంపకూడదు అని దమయంతి భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే అనేక ప్రయత్నాలు చేస్తూ ఎలా అయినా తన కూతుర్ని ఇంట్లోనే ఉంచుకుని అల్లుడిని ఇల్లరికం తీసుకురావాలని ఆమె భావిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే కొత్తగా ఒక ప్లాన్ సిద్ధం చేసి రంగంలోకి దిగుతుంది. ఇక ఈ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  సీత క్లారిటీ

  సీత క్లారిటీ

  సీత దమయంతి ఛాలెంజ్ కి ఒప్పుకోవడంతో ఆమె మీద రఘురాం సహా రఘురాం తల్లి కూడా కోప్పడుతూ ఉంటారు. ఎలా అయినా వ్రతం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే నాని మనకు శాశ్వతంగా దూరం అవుతాడని రఘు అంటాడు, నువ్వు ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని కూడా అంటాడు. రఘురాం తల్లి కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ సీత మాత్రం తాను అన్ని ఆలోచించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని ఎందుకంటే ఎలా అయినా నానిని తన ఇంటికి తీసుకు వెళ్లడానికి దమయంతి ప్లాన్ వేస్తోందని ఈ విషయంలో కాకపోయినా మరో విషయంలో అయినా వంకలు పెట్టి నానిని తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుందని కానీ ఈ విషయంలో ఓడిస్తే మళ్ళీ ఆ ప్రయత్నం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది అని అంటుంది.

  అర్ధం చేసుకున్న రఘురామ్

  అర్ధం చేసుకున్న రఘురామ్

  నాకు కూడా అలాంటి ఉద్దేశమే ఉంది కానీ జరగదు ఏమో అని నేను భయపడుతుంటే జరుగుతుంది అని నువ్వు ధైర్యంగా ఉన్నావని రఘురాం అంటాడు. అయితే సీత ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా తన పని పూర్తయ్యేలా చూడమని అత్త వారి కాళ్లకు నమస్కారం చేస్తుంది.. అత్త ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం పూర్తవుతుందని దీవిస్తుంది. రఘురాం కూడా అంతే దీవిస్తాడు. ఇక మేము సీత ఆర్మీ సీత వదిన ఏం చెబితే అది చేస్తామంటూ భరత్, లక్ష్మణ్ అలాగే సిరి కూడా ఆమెకు అండగా నిలబడతామని చెబుతారు. దీంతో వారి దగ్గరికి వెళ్లి చూశారా అత్తమ్మ ఎవరు ఎవర్ని చూసుకుని అలా ఛాలెంజ్ చేశావు అని అడిగారు కదా వీళ్ళే నా బలం వీళ్ళు నా వెనక ఉన్నంత వరకు నాకు అపజయం ఎరుగనని అంటూ చెబుతుంది.

  ప్లాన్ రెడీ

  ప్లాన్ రెడీ

  అయితే ఇదంతా ఇలా జరుగుతున్న క్రమంలో దమయంతి ఇచ్చి వెళ్ళిన డబ్బు కు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్వతి దుర్గ దగ్గరకు వెళ్తుంది. వెళ్లి విషయం అంతా పూసగుచ్చినట్టు వివరించి ఎలా అయినా మనం ఈ వ్యవహారాన్ని ఆపగలిగితే మనకు మరింత డబ్బులు వస్తాయి అని చెబుతోంది. ఇక ఇద్దరూ కలిసి అప్పుడే రఘురామ్ ఇంటికి బయలు దేరుతారు రఘురాం ఇంటికి బయలుదేరేటప్పటికి సీత ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తూ ఉంటుంది.

   ఒక్కొకరికి ఒక్కో బాధ్యత

  ఒక్కొకరికి ఒక్కో బాధ్యత

  లక్ష్మణ్ షాప్ నుంచి ఇంటికి కావలసిన అన్ని సామాన్లు తీసుకురావాలని చెబుతుంది. అలాగే భరత్ పూజకు కావలసిన పూలు, పండ్లు ఇతర వస్తువులు తీసుకు రావాలని చెబుతుంది. నేను ఏం చేయాలి అని సిరి అడిగితే నువ్వు పూజకు కావలసిన మొత్తం సిద్ధం చేయాలని ఎందుకంటే వ్రతంలో ముత్తయిదువులు చాలా ముఖ్యం అని చెబుతుంది. కచ్చితంగా చేస్తాను అని సిరి అంటుంటే మొత్తం ఐదుగురు ముత్తైదువులకు కావాలని సీత అంటుంది. మనం నలుగురం ఉంటాం కదా ఇంక ఏమీ ఇబ్బంది అంటే మనం నలుగురం లెక్కలోకి రాము అని బయట నుంచి కచ్చితంగా ఐదుగురు ఉండాల్సిందేనని సీత అంటుంది.

  హ్యాండ్ ఇచ్చిన పార్వతి

  హ్యాండ్ ఇచ్చిన పార్వతి

  మేము ఇద్దరం ఉన్నాం కదా అని పార్వతి అంటుంది. పార్వతి రాకను చూసి ఇంట్లో వాళ్ళందరూ కాస్త ఆనందపడతారు.. మీరు వస్తానంటే మాకు ఏమి ఇబ్బంది ఖచ్చితంగా మనం అందరం కుటుంబం కాబట్టి ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలని అనుకుంటారు. రఘురాం తల్లి మాత్రం పాపను ఎత్తు కెళ్లి చేసిన రచ్చ గుర్తు తెచ్చుకుని తిడుతుంది. అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు ? నేను దానికి చాలా బాధపడ్డాను అని పార్వతి అంటుంది. మరోపక్క శిల్ప, శిల్ప తల్లి బయలుదేరుతారు. బయలుదేరే ముందు నా కూతురు గెలవాలంటే నువ్వు ఓడిపోవాలి నువ్వు ఓడిపోతే నా కూతురు గెలుస్తుంది కాబట్టి నా కూతురు గెలవాలని కోరుకుంటున్నా అని పార్వతి భర్త అంటాడు. అలా మొత్తం మీద వ్రతానికి అయితే అంతా సిద్ధమైంది. అనుకున్నట్లుగానే పార్వతి దుర్గా హ్యాండ్ ఇస్తారు. దీంతో వ్రతం జరిగే విషయం మీద నీలి నీడలు కమ్ముకుంటాయి. ఇక వ్రతం జరగడం విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి అన్నట్లుగా వచ్చే కమింగ్ అప్ లో చూపించారు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

  English summary
  Vadinamma Episode 630 : Sita takes a stern decision to teach Dhamayanthi a lesson. On the other hand, Durga and Parvati come up with a plan against Sita.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X