For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 26th Episode: దేవతే దిగొచ్చిందా.. సీత రాక్స్-దమయంతి షాక్స్!

  |

  బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వదినమ్మ సీరియల్ దాదాపు 631 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం నాని - శిల్పల శోభనం విషయం హాట్ టాపిక్ నడుస్తోంది. శోభనం తమ ఇంట్లో జరిపించాలని సీత వాళ్ళు భావిస్తుంటే ఎలా అయినా అల్లుడిని ఇల్లరికం తీసుకువచ్చి ఇక్కడ శోభనం చేయించాలని దమయంతి భావిస్తోంది. అందులో భాగంగానే దమయంతి సీతా మధ్య ఒక ఛాలెంజ్ కూడా పెట్టుకుంటారు. సీత మంగళగౌరీ వ్రతం చేయిస్తానని అంటే చేయిస్తే నేను నీ మాట వింటాను లేదంటే మీరు నా మాట విని నానిని మా ఇంటికి ఇల్లరికం పంపించేయాలి అని అంటుంది. అని దమయంతి ఒక చాలెంజ్ పెడుతుంది. ఇంట్లో మిగతా ఎవరికీ ఇష్టం లేక పోయినా సేపు ఛాలెంజ్ కు ఒప్పుకుంటుంది. ఇంట్లో వాళ్ళు ఈ విషయంలో కోప్పడతారు కూడా. మరి ఈ విషయంలో తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం తెలుసుకుందాం

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  హ్యాండ్ ఇచ్చారుగా

  హ్యాండ్ ఇచ్చారుగా

  సీత మంగళగౌరీ వ్రతంకి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇంట్లో అందరూ కూడా వ్రతం జరుగుతోందని చాలా ఆనందంగా ఉంటారు. అయితే ముందు నుంచి అనుకున్నట్లుగానే సరిగ్గా వ్రతం సమయానికి సిరి తల్లి పార్వతి భాస్కర్ భార్య దుర్గ ఇద్దరు హ్యాండ్ ఇస్తారు. పార్వతి తను బాత్రూంలో జారి పడ్డానని ఇంట్లో మీ నాన్న కూడా లేడు కాబట్టి దుర్గ సాయంతో ఇంట్లో ఉన్నాను అని చెబుతుంది. దీంతో సిరి తీసుకెళ్లి ఈ విషయాన్ని సీతకు చెబితే ఒకరకంగా ఇంట్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. వస్తాము అని చెప్పిన ఇద్దరు ముత్తయిదువులు రాలేదు కాబట్టి వ్రతానికి ఏమైనా ఇబ్బంది ఏమో అని కంగారు పడుతుంది.

  కళ్ళు నెత్తికెక్కాయా?

  కళ్ళు నెత్తికెక్కాయా?

  అయితే సీత తొందర పడితే పనులు జరగవు అని చెబుతూ సిరి నువ్వు వెళ్ళి ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూసి రా అని పంపిస్తుంది.. అలా వెళ్లిన సిరి గ్రామంలో అందరి ఇళ్లకు వెళ్లబోతుంది కానీ ఎక్కడా లాభం అయితే కనిపించలేదు.. సిరి ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడే శిల్పా, దమయంతి ఇద్దరూ ఎదురువస్తారు శిల్ప పలకరించి బోయినా సిరి కంగారులో పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.. నేను పలకరిస్తున్నా చూసావా అమ్మా దాని ఎలా కళ్ళు నెత్తి కెక్కయో అంటే కళ్ళు నెత్తికెక్కి కాదని నేను ఇచ్చిన షాక్ కి వీళ్లందరి బ్రెయిన్ పనిచేయడం లేదని ఇప్పుడు ఎలా అయినా ముత్తయిదువులకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె అంటోంది.

  నేను ముందు నుంచే చెబుతున్నా

  నేను ముందు నుంచే చెబుతున్నా

  అయితే ఇంకా ఎక్కడా కొత్త కోడలు రాలేదు అని వచ్చిన ముత్తయిదువులు రఘురామ్ తల్లి ప్రశ్నిస్తూ ఉంటారు ఇలా ప్రశ్నిస్తున్న సమయంలో శిల్పా ఎంట్రీ ఇస్తుంది.. శిల్ప వచ్చి కూర్చున్నా దమయంతి ఇంకా వ్రతం మొదలు పెట్టడం లేదు ఏమిటి అందరూ టెన్షన్ లో ఉన్నారు ఏమిటి? నేను కూడా మీ కుటుంబంలో ఒక్కదాన్నే కదా నాకు కూడా ఏమిటో చెబితే నేను ఏమైనా సాయం చేయొచ్చేమో ప్రయత్నిస్తాను కదా అంటుంది. అయితే ఇలా ముత్తయిదువులు తక్కువ అయ్యారని మిగతా ముత్తయిదువులు చెబుతారు. దీంతో మళ్లీ సీతను టార్గెట్ చేసి దమయంతి మాట్లాడుతుంది.. నేను ముందు నుంచే చెబుతున్నాను కానీ నా మాటలను మీరు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమైందో అన్నట్లుగా దమయంతి మాట్లాడుతూ ఉంటుంది.. అంతేకాక ఈ వ్రతం జరగకపోతే నాకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అని కూతురు అడిగితే అమ్మవారు చాలా మంచిదని ఇప్పుడు కాకపోతే తర్వాత చేసినా ఏమీ అనుకోవద్దు అని అంటుంది.

  అనూహ్యంగా ఎంట్రీ

  అనూహ్యంగా ఎంట్రీ

  వేరే ముత్తయిదువులు ఉన్నారేమో అని చూడటానికి వెళ్లిన సిరి వేరే ఎక్కడ ముత్తయిదువులు దొరకలేదని దుర్వార్త తీసుకొస్తుంది. ఇంకా సమయం మించిపోతోంది ముత్తయిదువులు దొరకడం లేదు అని భావిస్తూ రఘురాం కూడా సీతను మందలిస్తాడు. నేను అందుకే ఈ విషయంలో సవాళ్లు లాంటివి చేయొద్దు అని చెప్పాను కానీ నువ్వు సవాలు చేసి తీసుకొచ్చావు అన్నట్లు మాట్లాడుతాడు.. అయితే ఇంతలో ఇద్దరు ముత్తయిదువులు గుమ్మంలో ప్రత్యక్షమవుతారు, ఎవరా అని అందరూ చూస్తూ ఉంటే సీత నేను మీ సరస్వతి పిన్నిని అని అందులో ఒక ఆమె చెబుతుంది.. ఈమె నా ఆడ బిడ్డ మిమ్మల్ని చూస్తాను అంటే తీసుకు వచ్చాను అని ఆమె అంటుంది. అలా అనడమే కాక ఆడబిడ్డ ముందుకు వచ్చి మాది కూడా ఉమ్మడి కుటుంబం అని కానీ ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయని మిమ్మల్ని చూసి ఎలా ఉంటున్నారో కనుక్కొని వెళదామని వచ్చాను అని అంటుంది.

  అయినా డౌటే

  అయినా డౌటే

  ఇంతకీ ఆ ఆడబిడ్డ ఎవరో కాదు రియల్ లైఫ్ లో ప్రభాకర్ భార్య మలయజను ఈ పాత్ర పేరు తో సీరియల్ లో ఇంటికి పంపించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీరియల్కు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. అలా మొత్తం మీద వీళ్ళిద్దరి ఎంట్రీతో మంగళగౌరీ వ్రతం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుంది. అయినా పగబట్టిన దమయంతి శోభనానికి ఒప్పుకుంటుంది అనే నమ్మకం అయితే లేదు కానీ ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

  English summary
  Vadinamma Episode 631 : Sita feels elated when the guests arrive to perform the ritual. On the other hand, Dhamayanthi gets upset as her plan backfires.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X