For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 27th Episode: శిల్పకి రెండో పెళ్లి.. మరో స్కెచ్ తో రెడీ అయిన దమయంతి?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ సీరియల్ 632వ ఎపిసోడ్ కి చేరుకుంది. ఇక ఈ సీరియల్ లో ప్రస్తుతం నాని శిల్పా శోభనం అనేది హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి శోభనం ఎలా అయినా అత్తవారింట్లో జరపాలని శిల్ప తల్లి భావిస్తూ ఉంటుంది. అంతేకాక నానినీ ఇల్లరికం తీసుకురావాలని ఆమె అనేక ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇక నాని శోభనం తమ ఇంట్లోనే జరపాలని సీత అండ్ ఫ్యామిలీ ఫిక్స్ అవుతారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ శోభనం జరగాలి అంటే ఒక వ్రతం జరిపి ఆ వ్రతం సక్సెస్ఫుల్ గా జరిగితేమె ఈ శోభనం జరిగే అవకాశం ఇస్తానని దమయంతి అంటుంది. మరి ఆ వ్రతం సక్సెస్ ఫుల్ గా జరిగిందా లేదా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   పాపం దమయంతి

  పాపం దమయంతి

  దమయంతి ప్లాన్ ప్రకారం పార్వతి, దుర్గ ఇద్దరూ కూడా వ్రతం సమయానికి రాలేమని చెబుతారు.. పార్వతి తాను కాలుజారి బాత్రూంలో పడ్డానని ఇంట్లో మీ నాన్న కూడా లేకపోవడంతో నాకు దుర్గ సపర్యలు చేస్తోందని సిరికి ఫోన్ చేసి చెబుతోంది. దీంతో టెన్షన్ పడిన సిరి ఇంకా ఎవరైనా దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో ఇల్లిల్లు గాలి ఇస్తుంది కానీ దురదృష్టవశాత్తు ఎవరూ కూడా వచ్చి కూర్చోవడానికి అంగీకరించరు. అనూహ్యంగా సీత బంధువులైన ఒక ఆవిడ తన ఆడపడుచుని తీసుకుని సీత ఇంటికి వస్తుంది. ఇదే అదునుగా సీత మంగళగౌరీ వ్రతం చేస్తున్నాం మీరు ముత్తయుదువుగా కూర్చుంటారా అని అడిగితే తప్పకుండా కూర్చుంటాం అని అంటుంది. అలా ఐదుగురు ముత్తైదువులతో మంగళగౌరీ వ్రతం విజయవంతంగా పూర్తవుతుంది. అందరికీ శిల్ప వాయినాలు కూడా ఇస్తుంది.

   సక్సెస్ ఫుల్

  సక్సెస్ ఫుల్

  ఇక ఈ వ్రతం పూర్తయిన వెంటనే రఘు- సీతతో సహా కుటుంబ సభ్యులు అందరూ ఆనంద పడుతూ ఉంటే దమయంతి మాత్రం ముఖం మాడ్చుకుంటుంది. సీత గమనించి మీ దయ వల్లే ఈ వ్రతం జరిగిందని ఆమెను సంతోషపరిచే ప్రయత్నం చేస్తుంటే ఆమె మాత్రం ఇంకా ముఖం మాడ్చుకునే ఉంటుంది. ఏమైనా తినేసి వెళ్ళాలని చెబితే తనకి ఆకలి లేదని ఆమె అంటుంది.. మనం వ్రతం చేయించిన విధానం చూసి ఆమె కడుపు నిండిపోయింది అని సిరి ఎద్దేవా చేస్తుంది. దీంతో మరింత కడుపు మండిన దమయంతి వెళ్లి వస్తాను అని చెబుతూ కారెక్కి బయలుదేరుతుంది. ఇంతలో పార్వతి, దుర్గా పల్లీలు తింటూ ఇప్పటికే వ్రతం చెడిపోయి ఉంటుంది మనకి తాంబూలం రెడీగా ఉండి ఉంటుంది అనుకుంటూ ఆనంద పడుతూ ఉంటారు. అయితే ఎంతకూ ఫోన్ రాకపోవడంతో దుర్గకు అనుమానం వచ్చి పార్వతి చేత దమయంతికి ఫోన్ చేస్తుంది.

   అక్క లేదు తొక్క లేదు

  అక్క లేదు తొక్క లేదు

  ఫోన్ చేసి నేను మీ పార్వతి అక్క అంటే అక్క లేదు తొక్క లేదు అని దమయంతి సీరియస్ అవుతుంది. ఇదేంట్రాబాబు ఇలా అంటుంది అనుకుని ఏం జరిగింది అని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పకుండా మీరు రాకుండా ఆగిపోవడం కాదు వచ్చినా వ్రతం చేయకుందా చేయమని నేను చెప్పాను అని మాట మారుస్తోంది. ఇక ఇది ఇలా జరుగుతూ ఉంటే వ్రతం పూర్తయిన క్రమంలో సీత సహా సిరి, శిల్పా, శైలు, అత్తగారు అందరూ ఒకచోట కూర్చుని రిలాక్స్ అవుతూ ఉంటారు. ఎలా అయితే మీ వ్రతం చేశామో శోభనం కూడా అలాగే జరిపిస్తామని టెన్షన్ ఏమి పెట్టుకోవద్దని సీత చెబుతుంది. నా శోభనం జరగాలంటే మీరు అనుకుంటే కాదు మా అమ్మ అనుకుంటే జరుగుతుంది అని శిల్ప మనసులో అనుకుంటూ ఉంటుంది.

  కొడుక్కి వార్నింగ్

  కొడుక్కి వార్నింగ్

  మరో పక్క ఇంటికి వచ్చిన దమయంతితో కొడుకు నీ ప్లాను అన్ని ఫెయిల్ అవుతున్నాయి నువ్వు పాతపడి పోయావు నేను రంగంలోకి దిగుతా అంటాడు. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నేను ఫెయిల్ అయినట్లు కాదని ఇంతకుముందు నేను వేసిన ప్లాన్ ని సక్సెస్ అయ్యాయి అని ఆమె అంటుంది. అయితే కిషోర్ మాట్లాడుతూ అసలు నానీతో పెళ్లి తనకిష్టం లేదని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నాని శిల్ప పెళ్లి క్యాన్సిల్ చేసి శిల్పను మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటాడు. నోరుముయ్యి జరిగిందేదో జరిగిపోయింది నానిని ఎలా అయినా ఇల్లరికం తీసుకురావాలని ఏదైనా ప్లాన్ అంతకుమించి పిచ్చి వేషాలు వేయకు అని కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శోభనానికి ఏర్పాట్లు

  శోభనానికి ఏర్పాట్లు

  ఇది ఇలా జరుగుతూ ఉంటే రఘురామ్ ఇంట్లో నాని శోభనానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రఘురాం ఏర్పాట్లన్నీ చూసి ఆనంద పడుతూ ఉంటాడు భార్య ఈ విషయంలో చెప్పిన మాటలు కూడా రఘురామ్ కి ఆనందం తెప్పిస్తాయి.. మరోపక్క ఈ శోభనాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలని పార్వతి దుర్గ దగ్గరకి పరిగెత్తుకు వెడుతుంది. తనకు మళ్లీ దమయంతి నుంచి ఫోన్ వచ్చిందని ఈ శోభనం ఎలా అయినా క్యాన్సిల్ చేయించాలని ఆమె భావిస్తూ మాట్లాడుతుంది. మరి ఈ శోభనం క్యాన్సిల్ అవుతుందా? సీత ఏం చేయబోతోంది? దమయంతి స్కెచ్ ప్రకారం పార్వతి దుర్గ ఈ శోభనాన్ని ఆపుతారా అనేది వేచి చూడాల్సి ఉంది

  English summary
  Vadinamma Episode 632 : Parvati and Durga get shocked after Dhamayanthi reveals the truth. Elsewhere, Siri and Shailu advise Shilpa to trust Sita.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X