For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 28th Episode: టార్గెట్ శోభనం.. ఇదెక్కడి అరాచకం.. పట్టువదలకుండా?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ఇప్పుడు నాని శిల్పాల శోభనం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ శోభనం మా ఇంట్లో జరగాలి అని దమయంతి భావిస్తూ ఉంటే లేదు మా ఇంట్లో జరగాలని సీత అలాగే కుటుంబ సభ్యులు పట్టుబడుతూ ఉంటారు. ఏమీ చేయలేని దమయంతి ఎలా అయినా శోభనాన్ని క్యాన్సిల్ చేయించి ఇంట్లో జరిగేలాగా ప్లాన్ చేయాలని చూస్తూ ఉంటుంది. అందులో భాగంగానే వరలక్ష్మీ వ్రతం అనుకుంటే దానిని చెడగొట్టి తన కూతురితో సహా అల్లుడిని ఇంటికి తీసుకు వెళ్లాలని భావిస్తోంది. కానీ సీత అదృష్టం కొద్దీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వరలక్ష్మీ వ్రతం పూర్తి అవుతుంది. వరలక్ష్మీ వ్రతం పూర్తి కావడంతో ఎలా అయినా మీ శోభనం కూడా జరిగిపోతుంది అని సీత శిల్పతో అంటుంది. ఇక్కడతో నిన్నటి ఎపిసోడ్ ముగించగానే ఈ రోజు ఎపిసోడ్ ప్రకారం ఏం జరిగిందనేది చూద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  వెళ్లి ఏం చేస్తాం?

  వెళ్లి ఏం చేస్తాం?

  పార్వతి దుర్గ దగ్గరకు వెళ్లి నువ్వు సిద్ధమైన మనం సీత ఇంటికి వెళ్దాం, ఈ రోజు లెక్కప్రకారం నాని శిల్పాలకు శోభన్ కానీ మనం ఆ శోభనం జరగకుండా చేస్తే దమయంతి మనకు మళ్ళీ తాంబూలం ఇస్తుంది అంటూ ఆమెకు ఆశ కల్పిస్తుంది.. అయితే ముందు మనం వెళ్లి ఏం చేస్తాం? ఆ శోభనం ఎలా అద్భుతం అని డైలమాలో పడిన దుర్గ ఏమైనా పార్వతి చూసుకుంటుంది కదా అని ధైర్యంతో శోభనం చెడగొట్టడానికి సిద్ధమవుతుంది. అయితే నీ కాలికి దెబ్బ తగిలింది అని మనం చెప్పాను కదా ఇప్పుడు నువ్వు కాలికి ఎలాంటి కట్టు లేకుండా వెళ్తే అనుమానం వస్తుంది అని చెబుతూ ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి కాలికి కట్టు కూడా కడుతుంది దుర్గ.

  శిల్పను వెన కేసుకు రాబోగా

  శిల్పను వెన కేసుకు రాబోగా

  ఇక అక్కడి నుంచి వీరు బయలుదేరి సీత ఇంటికి వెళ్లడానికి వస్తూ ఉంటారు. ఇక మరోపక్క శైలు సిరి ఇద్దరూ కూడా శోభనం కోసం సిద్ధం చేస్తున్నారు. పూలదండలు కడుతూ ఉండగా శిల్పా నిద్ర లేచి బయటకు వస్తుంది. దీంతో ఆమెను ఆటపట్టిస్తూ ఉంటారు తోడికోడళ్ళు ఇద్దరు. అంతేకాక ఈ క్రమంలో సీత వచ్చి శిల్పను వెన కేసుకు రాబోగా కొత్త చెల్లెలి మీద ప్రేమ ఎక్కువై పోతోంది. అని మా విషయంలో ఎప్పుడైనా ఇంత సీరియస్ గా ఉన్నావా అని అడుగుతారు. అయితే తనకు అందరూ సమానమే అని చెప్పిన సీత శిల్ప కొత్త కోడలు కదా అంతా కొత్తగా ఉంటుంది కాబట్టి ఆమెకు అండగా ఉన్నానని అంటుంది. దీంతో మిగతా ఇద్దరూ సైలెంట్ గా ఉండిపోతారు.

  సర్దుకుపోవాలి

  సర్దుకుపోవాలి

  శిల్ప మాత్రం లోపల మీరు ఎంత కష్టాలు పడిన మా అమ్మ తలుచుకుంటేనే కదా ఈ శోభనం అయినా మా అమ్మ ఇంటి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. మా అమ్మ కనుక ఉండి ఉంటే నాకు కొంచెం ధైర్యం గా ఉండేది అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే సీత శిల్ప హావభావాలను అర్థం చేసుకుని వెళ్లి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అనగానే శిల్ప పై ప్రాణాలు పైనే పోయాయి, ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనుకుంటే నువ్వు మీ అమ్మ కోసం ఆలోచిస్తున్నావు. కదా అమ్మకు దూరంగా ఉండడం కష్టమే కానీ పెళ్లి అయిపోయింది కాబట్టి కొన్ని కొన్ని సర్దుకుపోవాలి అని చెప్పి సీత ధైర్యం చెబుతుంది.

   అమ్మ కోసం వెయిటింగ్

  అమ్మ కోసం వెయిటింగ్

  అయితే సీత చెప్పిన మాటలకు కాస్త కుదుట పడిన శిల్పా తన తల్లి ఎంత త్వరగా వస్తే బాగుండు అంత త్వరగా ఈ ఇబ్బందుల నుంచి బయట పడతా అనుకుంటుంది. ఈ లోపు శిల్ప తల్లి శిల్ప కు ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి చేయాల్సిన ప్లాన్ అంతా చెబుతుంది. ఈ లోపు అనుకోకుండా నాని రావడంతో అతనిని మైమరపించడానికి కాస్త నటిస్తుంది. ఈ లోపు నాని అన్నలు వచ్చి రఘురాం మాట్లాడినట్లు మాట్లాడి భయపడతారు. మరో పక్క సీత ఇంటికి బయలుదేరిన దమయంతి భర్తను ఏదో ఒక కారణంతో మళ్ళీ తిడుతూనే ఉంటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  అసలు ప్లాన్ ఏంటి?

  అసలు ప్లాన్ ఏంటి?


  నాని శిల్ప ఒకరికొకరు ఫోన్ లో చూసుకుని ఫోటోలను ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలో లో దుర్గా, పార్వతీ ఇంటికి రావడంతో సీత వాళ్ళు ఆనందపడతారు. అయితే పిలవకుండా వచ్చాం బాధపడొద్దు అంటే అదేమీ లేదని అంటారు.. అలా మొత్తం మీద వదినమ్మ నాని శిల్పాల శోభనం కోసం ఏర్పాట్లు చేయడం శిల్ప తల్లి తండ్రి ఇంటికి రావడం ఈ వ్యవహారం అంతా కోలాహలంగా సాగుతూ ఉంటుంది. నాని, నాని మామలు ఇద్దరూ సారదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే శోభనం కోసం దమయంతి చెప్పిన ప్లాన్ ఏంటి శిల్ప దానిని అమలు పరుస్తుంది లేదా అనే విషయాల మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి తరువాతి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Vadinamma Episode 633 : Parvati and Durga visit Sita's home with an evil motive. In the meantime, Sita's family makes fun of Shilpa and Nani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X