For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 30th Episode: సీతను ఘోరంగా అవమానించిన దమయంతి.. కుటుంబ సభ్యుల ఎటాక్!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 634వ ఎపిసోడ్ కి చేరింది.. సీరియల్ లో ప్రస్తుతం నాని శిల్పా శోభనం వ్యవహారం నడుస్తోంది. శోభనం ఎలా అయినా పుట్టింట్లో జరగాలని నాని భార్య శిల్ప, ఆమె తల్లి దమయంతి భావిస్తున్నారు. కానీ ఎలా అయినా తమ ఇంట్లోనే జరగాలి అని సీత సహా సీత కుటుంబ సభ్యులు అందరూ భావిస్తున్నారు. అందులో భాగంగానే దమయంతి అనేక ప్లాన్లు వేస్తున్నా ఏవీ వర్కౌట్ కాకపోవడంతో ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఎట్టకేలకు నాని ఇంట్లోనే శోభనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. దానిని ఎలా అయినా ఆపాలని దమయంతి రంగంలోకి దిగుతుంది. మరి ఈ విషయంలో దమయంతి విజయం సాధించిందా? లేదా అనేది ఈరోజు ఎపిసోడ్ లో కొంత క్లారిటీ వచ్చినట్లయింది. ఆ వివరాల్లోకి వెళ్దాం

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   దమయంతి భర్తకు అనుమానం

  దమయంతి భర్తకు అనుమానం

  నాని శిల్పా శోభనం కోసం దమయంతి తన భర్తతో కలిసి సీత ఇంటికి వస్తుంది.. అప్పటికే సీత ఇంటికి ఒక పక్క పార్వతి మరోపక్క దుర్గ కూడా వచ్చి ఉంటారు. పిలవకుండానే వచ్చాము ఏమీ అనుకోవద్దు అంటూ పార్వతి, దుర్గ అంటే అదేమీ లేదని సీత కుటుంబ సభ్యులు అంటారు.. ఇక దమయంతి రాగానే సీత వీళ్ళిద్దరి ని దమయంతికి పరిచయం చేస్తుంది. ఆమె మా సిరి వాళ్ళ అమ్మగారు అలాగే ఈవిడ మా అన్నయ్య భార్య దుర్గ అని పరిచయం చేస్తుంది.. దమయంతి కూడా వాళ్ళు అసలు ఎవరో తెలియదు అన్నట్లుగానే పరిచయం చేసుకుంటుంది. అయితే పార్వతి, దుర్గ ఇద్దరూ కూడా దమయంతి గురించి గొప్పలు చెబుతున్నట్లుగా మాట్లాడుతుండటంతో దమయంతి భర్తకు అనుమానం వస్తుంది.

  పెయిడ్ బ్యాచ్ లాగా

  పెయిడ్ బ్యాచ్ లాగా

  వీళ్లిద్దరూ ఏదో పెయిడ్ బ్యాచ్ లాగానే ఉన్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఒకప్పుడు రఘురాం వాళ్ళు కూడా డబ్బులు ఉన్నవాళ్లే కానీ ఇప్పుడు మీరు డబ్బులు లేకపోయినా నానిని పెళ్లి చూసుకున్నా ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని పార్వతి డబ్బా కొడుతుంది. ఈ విషయం మీద శైలు కి కోపం వచ్చి మా నాని శిల్పాలు ప్రేమించుకున్నారు కాబట్టే ఈ పెళ్లి జరిగింది లేదా ఈ పెళ్ళి జరిగేది కాదు. నానిది కాదు అదృష్టం శిల్పాకు కూడా నాని ని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి.. వారిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టే ఈ పెళ్లి జరిగింది అంతేగాని మాటలు జాగ్రత్త రానివ్వాలని వార్నింగ్ ఇచ్చినట్లు గా మాట్లాడుతుంది. ఇక అప్పటికీ ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళతారు.

  మిమ్మల్ని సంతోషపరచడానికే

  మిమ్మల్ని సంతోషపరచడానికే

  ఇక మరోపక్క నాని శిల్పాల శోభనానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ విషయం మీద సీత బాధపడుతూ ఉంటుంది. ఇంటికి పిలవకపోయినా వచ్చిన వాళ్ళు మనం ఆనందంగా ఉంటే చూసి ఆనందించాలి కానీ ఇలా గొడవలు పెట్టే విధంగా మాట్లాడకూడదు కదా అని అంటుంది. అయితే అదేమీ లేదని ఆవిడ మనస్తత్వం తెలిసిందే కదా అని రఘురాం అంటాడు. అయినా ఎలా అయినా వ్రతం జరిపించాలని నీ సంకల్పం ముందు మిగతా అన్ని విషయాలు ఓడిపోయాయని శోభనం విషయంలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని కాబట్టి ఎలాంటి టెన్షన్ లు పెట్టుకోవద్దని సీతతో రఘురాం అంటాడు.. ఇక మరో పక్క దమయంతి దుర్గా, పార్వతీ వద్దకు వెళ్లి మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తుంది. మొన్న నీ విషయంలో ఫెయిల్ అయ్యాము కదా ఇప్పుడు ఏమైనా అవకాశం దొరికితే ఈ శోభనాన్ని ఆపి మిమ్మల్ని సంతోషపరచి మీరిచ్చే తీసుకుందామని వచ్చామని వాళ్లు అంటారు.

  కుళ్ళిన కొబ్బరికాయ

  కుళ్ళిన కొబ్బరికాయ

  అవును మీరు చేయాల్సింది ఉంది అంటూ వాళ్లకి ప్లాన్ అంతా వివరిస్తుంది దమయంతి. శోభనానికి ముందు పూజ చేయడానికి కూర్చో పెడతారు. పంతులు పూజ చేస్తూ ఉండగా దమయంతిని కొబ్బరికాయ కొట్టమని అడుగుతారు.. ఆమె వెళ్లి కొబ్బరికాయ కొట్టగా ఆ కాయ కుళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది అంటే మనసులో ఏమైనా చెడు కోరికలు పెట్టుకుని ఇలా కొబ్బరి కాయ కొడితే ఇలాగే కుళ్ళిపోతుందని పంతులు అంటాడు. ఇదే అదునుగా దమయంతి తాను అవమాన పడినట్లుగా ఫీలవుతూ మొఖం మాడ్చుకుంటుంది. వెంటనే రంగంలోకి దిగిన దుర్గా, పార్వతీ ఇద్దరూ కూడా పంతుల్ని సీత కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  సీతకు ఘోర అవమానం

  సీతకు ఘోర అవమానం

  అయితే మిమ్మల్ని అవమానించినట్లు కాదని శాస్త్రం ప్రకారం ఇలా జరిగే అవకాశం ఉందని అంటున్నా అని పంతులు అంటాడు. మరో కొబ్బరికాయ కొట్టమని అంటే నేను కొట్టను అని ముఖం మార్చుకుని వెనక్కి వెళ్లి పోతుంది. సీతను కొబ్బరికాయ కొట్టమంటే అంటే సీత కొట్టడానికి ముందుకు వస్తుంది. అయితే పిల్లలు లేని సీత ఎలా కొబ్బరికాయ కొడుతుంది అని దమయంతి అవమానిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ ఆమెకు అండగా నిలబడతారు మేమంతా ఆమె పిల్లలమే మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాద కాదు అన్నట్లుగా వార్నింగ్ ఇస్తారు. దీంతో అప్పటికప్పుడు అందరూ సైలెంట్ అవుతారు. కానీ ఈ విషయం మాత్రం పెద్దది అయ్యేలానే కనిపిస్తోంది. ఇక ఈ ఇంట్లో శోభనం జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఏదో ఒకటి చేసి ఇంటికి వాళ్లని తీసుకువెళ్లడానికి దమయంతి ప్లాన్ మాత్రం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.

  English summary
  Vadinamma Episode 634 : Parvati comes up with an evil plan against Sita. Later, Sita's family gets furious when Dhamayanthi insults her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X