For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma August 31st Episode: కొబ్బరి కాయ టెన్షన్.. బాంబు పేల్చిన పంతులు..కొడుకు గురించి నిజం బయటపెట్టిన సీత!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 635వ ఎపిసోడ్ కి చేరుకుంది. ప్రస్తుతం నాని శిల్పల శోభనం అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎలా అయినా శోభనం క్యాన్సిల్ చేయించి తన ఇంటికి తీసుకు వెళ్లిపోవాలని దమయంతి భావిస్తూ ఉంటే తమ ఇంట్లోనే ఎలా అయినా శోభనం జరిపించాలని సీత మరియు కుటుంబ సభ్యులు భావిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి దమయంతి అనేక ప్లాన్లు వేస్తున్న అన్ని ప్లాన్లు ఫీల్ అవుతూ ఉండటం వాళ్లకు ఆందోళన కలిగిస్తోంది. అయినా సరే ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఏ మాత్రం అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోవడానికి చూస్తున్నారు దమయంతి అండ్ కో. మరి తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాన్ని పరిశీలిస్తే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  కొబ్బరి కాయ టెన్షన్

  కొబ్బరి కాయ టెన్షన్

  నిన్నటి ఎపిసోడ్ లో తాను కొబ్బరి కాయ కొడితే కుళ్ళిపోవడంతో దమయంతి ఇది అరిష్టమని ఆపేద్దామని అంటుంది. పవిత్రమైన మనసుతో కొబ్బరి కాయ కొడితే ఇలాంటి అనర్ధాలు జరగవు అని పంతులు అనడంతో ఇది తనను అవమానించినట్టే అనే ఆమె కాసేపు హడావిడి చేస్తుంది. ఆమెకు తోడుగా ఉన్న దుర్గా, పార్వతీ కూడా రెచ్చిపోయే ప్రయత్నం చేస్తారు. ఇక ఆ తర్వాత సీత కొబ్బరికాయ కొట్టబోగా నేను కొడితే అరిష్టం అన్నారు, పిల్లలు లేని సీత కొబ్బరికాయ కొట్టడం కరెక్ట్ ఏనా అని అడగడంతో సీత కుటుంబ సభ్యులందరూ మీద పడే ప్రయత్నం చేస్తారు. అంతేగాక నువ్వు కొట్టాల్సిందే అని సీతను ఎంకరేజ్ చేయడంతో సీత ఎట్టకేలకు కొబ్బరికాయ కొడుతుంది. కొబ్బరికాయ కొట్టడంతో ఆ కొబ్బరికాయలో ఒక పువ్వు కూడా వస్తుంది. ఈ విషయం చూసి మిగతా అందరూ ఆనంద పడుతూ ఉంటే పంతులు మాత్రం మరో బాంబు పేలుస్తాడు.

  బాంబు పేల్చిన పంతులు

  బాంబు పేల్చిన పంతులు

  ఇలా రావడం శుభసూచకం అని చెబుతూనే ఇలా వచ్చింది అంటే నీకు పిల్లలు ఉండే అవకాశం ఉందని మీకు ఇప్పటికే పండంటి బిడ్డ పుట్టి ఉండవచ్చు అని అంటారు. కానీ సీత తనకు పుట్టిన బిడ్డను శైలు దగ్గర పడుకోబెట్టి ఆమె బిడ్డగా లోకాన్ని నమ్మించిన విషయం ఆమెకు తప్ప ఇంకెవరికీ తెలియకపోవడంతో, ఆమె లోపల బాధపడుతూనే పైకి మాత్రం ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంటుంది.. రఘురాం బాబు పుట్టాడు అని పుట్టి పురిట్లోనే చనిపోయాడు అని చెబుతారు. అయితే ఈ విషయాన్ని కూడా నేను ఖండించలేక పోతున్నాను సారీ అని సీతమ్మ బాధపడుతుంది. ఇక మరోపక్క ఎలా అయినా శోభనాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్న దుర్గా, పార్వతీ బయట నుంచుని ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ల దగ్గరికి వెళ్లిన దమయంతి ఏం చేయబోతున్నారు అని ప్రశ్నిస్తుంది.

   గుమ్మడి కాయ

  గుమ్మడి కాయ

  దానికి పార్వతి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి నీ తల మీద వేలాడుతున్న దిష్టి గుమ్మడి కాయ కింద పడితే అది పగిలిపోతుంది అది పగిలి పోతే అది అరిష్టమని చెబుతూ మన శోభనం ఆపేయవచ్చు అని చెబుతుంది. సరే ఏదో ఒకటి చేయండి కచ్చితంగా శోభనం ఆగిపోవాలి అని చెప్పి దమయంతి లోపలికి వెళ్తుంది. లోపల పూజ జరుగుతూ ఉండగానే పార్వతి, దుర్గా కష్టాలు పడి మరి గుమ్మడికాయ పగలకొట్టే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా అదే సమయానికి తులసికోటకు హారతి ఇచ్చేందుకు బయటకు వెళ్లిన సీత హారతి పళ్లెం లోనే ఆ గుమ్మడికాయ కింద పడుతుంది. పళ్లెంలో పడిన గుమ్మడికాయ రెండుగా చీలడంతో సీతకు భయం వేసి ఒక్కసారి గా అరుస్తుంది. వెంటనే అక్కడకు పరిగెత్తుకొచ్చిన మిగతా కుటుంబ సభ్యులందరూ ఏమైంది అని అడుగుతారు. జరిగిన విషయం చెప్పిన సీత ఇలా జరిగింది అని చెప్పడంతో పార్వతి అందుకుని ఇలా జరగడం అరిష్టం అని అంటుంది.

   గుమ్మడికాయ ప్లానూ ఫెయిలే

  గుమ్మడికాయ ప్లానూ ఫెయిలే

  ఇదే అదునుగా దమయంతి ఇక శోభనం ఆపేద్దామా అని అడిగితే పంతులుగారు కల్పించుకుని మీరు అన్నట్లుగానే గుమ్మడికాయ కిందపడి పగిలి అరిష్టమే కానీ అది కింద పడి పగలలేదు, పళ్ళెంలో పగిలింది కాబట్టి అది అరిష్టం కాదు అని అంటాడు. దీంతో మళ్లీ శోభనం జరిపేందుకు సిద్ధమవుతారు. నువ్వు చెప్పకపోతే అసలు మనకి గుమ్మడికాయ సంగతి తెలిసేది కాదు నీకు పట్టుచీర పెట్టాలి అత్తమ్మ అని అల్లుడు ఆమెతో వేళాకోళం ఆడతాడు. ఇక నాని ఒకపక్క శోభనానికి సిద్ధమవుతూ ఉంటే శిల్ప తల్లిని ఎగతాళి చేస్తోంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  దమయంతికి షాక్

  దమయంతికి షాక్

  నీ మాటలు నమ్మి నేను రావడంతో నన్ను ఇప్పుడు శోభనం కి సిద్ధం చేశావు, నేను ఈ కొంపలో శోభనం జరిపించుకోవాలా అంటే నువ్వు వెధవ వేషాలు వేయకు, శోభనం జరిపించుకోకుండా ఉంటానని మాట ఇవ్వమని కూతుర్ని అడిగితే ఆమె మాట ఇస్తుంది. ఇంతలో వచ్చిన సీత, శైలు, సిరి ఏమైనా డౌట్లు ఉంటే తమను అడగాలి అని అంటారు. అలాగే సీతను నీకు పిల్లలు లేరు అని అడిగాను కదా నువ్వు బాధపడ్డావా అని దమయంతి అడిగితే వీడు నా కొడుకే అని చెప్పి తర్వాత నేను వీడికి పెద్దమ్మ అవుతాణని చెప్పి మాట మారుస్తుంది. మరి శోభనం ఎలా అవుతారు అనేది మాత్రం వేచిచూడాల్సి ఉంది.

  English summary
  Vadinamma Episode 635 : Dhamayanti gets frustrated as her attempts to spoil the ritual go for a toss. In the meantime, Parvati and Durga plan something evil to trouble Sita's family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X