For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Episode 613: అనుకున్నంతా అయింది.. రఘురామ్ మీద అనుమానం, ఎందుకిలా చేస్తున్నాడు?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ప్రస్తుతం ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే నాని శిల్పా పెళ్లి అవ్వగా వారిద్దరి శోభనం మాత్రం క్యాన్సల్ అవుతుంది. ఆ శోభనం కోసం తంటాలు పడుతున్నారు. ఇక రఘురాం కేవలం రిషి కోసం ఇన్సూరెన్స్ చేయించడంతో వైదేహి చేయక పోవడంతో అది ఇంట్లో పెను సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని అండగా తీసుకుని పార్వతి రఘురాం కుటుంబంలో ముసలం పుట్టించే ప్లాన్ చేసింది. ఇక తాజా ఎపిసోడ్ లో రఘు రామ్ ఫ్యామిలీ లో ఏం జరిగింది అంటే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  మారిన శైలు

  మారిన శైలు

  వాస్తవానికి నిన్నటి ఎపిసోడ్ లో శిల్పా ఇంటికి నాని వెళతాడు. అయితే అనుకోకుండా దమయంతి నిద్ర లేవడంతో శిల్ప భయపడుతుంది. ఇప్పుడు ఇలా అమ్మకు దొరికితే ఇక అంతే సంగతులు అని నానికి చెప్పి నానిని కూడా భయపెడుతుంది. దీంతో నాని వచ్చిన దారి వెంటే ఇంటి బాట పడతాడు.. అయితే అప్పటికే నాని బండి ఇంటి బయట చూసిన దమయంతి జరగకూడనిది ఏదో జరుగుతోందని ఫిక్స్ అవుతుంది. ఇక మరో పక్క శైలు ట్యూషన్స్ చెప్పడానికి బోర్డు ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ఈ ట్యూషన్స్ చెబుతూ వచ్చిన డబ్బుతో పిల్లలకు ఇన్సూరెన్స్ చేయిస్తానని భర్తకు చెబుతుంది. అంతేగాక తనకు తన పిల్లాడు ఎలాగో సిరి పిల్ల కూడా అలాగేనని ఇద్దరూ వేరు కాదని ఇద్దరూ మన పిల్లలే అని చెప్పటంతో అటు సీత ఇటు లక్ష్మణ్ ఇద్దరూ ఆనందపడతారు. అయితే అప్పటికే రఘురాం రిషి పేరు మీద ఇన్సూరెన్స్ చేయించిన విషయం వెలుగులోకి వస్తుంది. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగియగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

  వైదేహికి ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదు

  వైదేహికి ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదు

  రఘురాం వైదేహికి ఇన్సూరెన్స్ చేయించకుండా కేవలం రిషికి ఇన్సూరెన్స్ చేయించిన విషయం ఇంట్లో ఎవరికీ నచ్చదు. అయితే ఇదే విషయాన్ని సీత రఘురాని అడగాలని అనుకుంటుంది. కానీ రఘురాం కావాలని ఆగకుండా వెళ్ళిపోతాడు. వైదేహి గుండెల్లో సమస్య ఉంది కాబట్టి ఆమెకు ఇన్సూరెన్స్ ఇవ్వరు అని ఆ విషయాన్ని నీతో ఎలా చెప్పాలి సీత అని రఘురాం బాధపడుతూ షాప్ కి బయలుదేరి వెళతాడు.. మరోపక్క నానిని నిన్ను ఊహించుకుంటూ, నాని ఫోటో చూస్తూ శిల్ప ఆనంద పడుతూ ఉంటుంది. ఇంతలో ఆమె తల్లి దమయంతి వచ్చి నిన్న నాని వచ్చాడు కదా అంటే అదేమీ లేదని అంటుంది. అయితే ఆగు నానినే అడుగుతాను అని నానికి ఫోన్ చేయబోగా శిల్ప ఎట్టకేలకు నాని వచ్చి వెళ్ళాడు అనే విషయం ఒప్పుకుంటుంది. దీంతో సీరియస్ అయిన దమయంతి నువ్వు ఇలా చేస్తే నాని ఇల్లరికం రావడం కష్టం.. ఏదో ఆశ చూపించి ఇల్లరికం తీసుకురావాలని నేను ప్లాన్ వేస్తుంటే నువ్వు ఇలా ఇంటికి పిలిస్తూ ఉంటే అవి వర్కౌట్ కావు అని తేల్చి చెబుతోంది.

  వదినమ్మ అంటే ద్వేషం కానీ

  వదినమ్మ అంటే ద్వేషం కానీ

  అయితే తనకు కేవలం నాని వదినమ్మ అంటే ద్వేషం కానీ నాని అంటే ప్రాణమని నానిని చూడకుండా వుండలేక పోతున్నాను అని శిల్ప తేల్చి చెబుతోంది. అయితే నేను చెప్పినట్టు చేయకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది అంటూ హెచ్చరిస్తుంది. అయితే ఇదంతా జరుగుతుండగా శిల్ప తండ్రి దొంగచాటుగా వింటూ ఉంటాడు. ఇక దమయంతి వెళ్తూ వెళ్తూ రేపటి నుంచి చెస్ ఆడాలనే విషయం గుర్తు చేస్తుంది. ఇక మరోపక్క భరత్ షాప్ లో బిజీగా ఉంటాడు. అక్కడ ఎంట్రీ ఇచ్చిన సిరి తల్లి పార్వతి రచ్చ చేయడం మొదలుపెడుతుంది. రఘురాం చేసిన పని తనకు ఏమీ నచ్చలేదని రిషికి ఇన్సూరెన్స్ చేయించి నా మనవరాలు వైదేహికి ఇన్సూరెన్స్ చేయించక పోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. ఒకవేళ మగ పిల్లాడు, ఆడపిల్ల అని తేడా చూపిస్తున్నాడా? అయినా ఇంటి పెద్ద అంటే ఇంట్లో అందరినీ సమానంగా చూసుకోవాలి కదా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

  భరత్ కి కూడా అనుమానం

  భరత్ కి కూడా అనుమానం

  అయితే చాలా సేపు భరత్ ఓపిక పడతాడు కానీ ఆమె ఎక్కడా తగ్గినట్లు కనిపించదు. అంతేకాక షాప్ కి వచ్చిన మరో వ్యక్తి కూడా ఆమె చెప్పేది కరెక్ట్ ఏ అని ఇంటిపెద్ద అలా వ్యవహరించకూడదు అని అంటాడు. రఘు రామ్ లాంటి పెద్ద మనిషి అలా చేస్తున్నాడు అంటే నమ్మకం కుదరడం లేదని కూడా అంటారు. అయితే పైకి అత్తగారిని ఇక్కడి నుంచి పొమ్మని వార్నింగ్ ఇస్తున్న సరే భరత్ మాత్రం ఆలోచనలో పడతాడు. అసలు ఏం జరుగుతోంది ? అన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు ? అనే విషయం మీద భరత్ బాధపడుతూ ఉంటాడు. ఇక శైలు మొదలుపెట్టిన ట్యూషన్స్ మంచి రంజుగా సాగుతున్నాయి. పిల్లలు కూడా ఎక్కువమంది జాయిన్ అయ్యారు. శైలు పిల్లలకి ట్యూషన్ చెబుతుంటే సీత చూసి ఆనంద పడుతూ ఉంటుంది.

   ఊహల్లో సీత

  ఊహల్లో సీత

  అలాగే రిషి పెరిగి పెద్ద అయితే ఎలా ఉంటుంది అని ఊహల్లోకి వెళ్లి మరి ఆనంద పడుతూ ఉంటుంది. ఇక షాప్ నుండి ఇంటికి వచ్చిన భరత్ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. సీత విషయం అర్థం చేసుకుని వెళ్లి పలకరించి అసలు ఏం జరిగింది అని చెప్పాలని అడుగుతుంది. అయితే అది అంత ఆలోచించే విషయం కాదని భరత్ చెబుతున్నా సీతకు విషయం అర్థమవుతుంది. వదిన దగ్గర కూడా ఈ విషయాలన్నీ దాస్తున్నావు అంటూ భరత్ ని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక భరత్ నెమ్మదిగా తన బాధను వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు. అన్నయ్య ఎలా చేయడం విషయంలో తనకు నచ్చలేదని విషయాన్ని వదినకి నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మొత్తం మీద రఘురామ్ ఇంట్లో మాత్రం ఒక ముసలం పుట్టింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. భరత్ ఇదే బాధను అన్న దగ్గర వ్యక్తం చేస్తే ఏం జరగబోతోంది. ఆ పరిణామానికి దారి తీయబోతోంది అనేది చూడాల్సి ఉంది.

  Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Vadinamma Episode 613 : Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Dhamayanthi warns Shilpa against getting close to Nani. Elsewhere, Bharat feels disheartened when Parvati confronts him about Raghuram's deeds.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X