For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma August 6 Episode : దొంగలా దాక్కుంటూ రఘురామ్, ఇంట్లో అందరి ముందూ తలదించుకునేలా?

  |

  తెలుగు సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి మిగతా భాషలతో పోలిస్తే తెలుగు ప్రేక్షకులు సినిమాలతో పాటు సీరియల్స్ కి కూడా పట్టం కడుతున్నారు. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ అయితే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టెలివిజన్ స్టార్ ప్రభాకర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సీరియల్ ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. సీరియల్ లో ప్రస్తుతం ఇన్సూరెన్స్ వ్యవహారం చుట్టూ కథ నడిపిస్తున్నారు.. రఘురామ్ కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉండగా అందులో బాబు కి ఇన్సూరెన్స్ చేసి పాపకు చేయకపోవడంతో ఇంట్లో ఒక ముసలం పుట్టినట్లు అయింది. ఎవరికి వారు అనేక అనుమానాలతో సతమతమవుతున్నారు. ఇక తాజాగా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   ఇంట్లో కొత్త అనుమానాలు

  ఇంట్లో కొత్త అనుమానాలు


  నిజానికి నిన్నటి ఎపిసోడ్ లో ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే ఇన్సూరెన్స్ చేయించారు ఏమిటి అని అనడంతో అందరిలోనూ అనుమానాలు మొదలవుతాయి. రిషి కి ఇన్సూరెన్స్ చేయించి వైదేహి కి ఇన్సూరెన్స్ చేయించక పోవడంతో ఇంట్లో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయం తెలుసుకుని రెచ్చిపోయిన పార్వతి ఏకంగా రఘురాం షాప్ వద్దకు వెళ్లి మరి భరత్ కి వార్నింగ్ ఇస్తుంది.. అంతేకాక రఘురాం మీద భరత్ కి అనుమానం వచ్చేలా గా అనేక ప్రశ్నలు సంధించి నానా గలాటా చేసి మరి ఇంటికి వెళ్తుంది. అయితే భరత్ ఈ విషయాలు అన్ని ఆలోచిస్తూ ఉండలేకపోయాడు. దీంతో అప్పటికప్పుడు షాప్ నుండి ఇంటికి వచ్చేస్తాడు. అలా నిన్నటి ఎపిసోడ్ ముగించారు.

   నానికి టెన్షన్

  నానికి టెన్షన్

  ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భరత్ దిగాలుగా కూర్చుని చూసి శైలు భరత్ వద్దకు వెళ్లి అసలు విషయం ఏమిటి అని అడుగుతుంది. ఏమీ లేదు అని ముందు దాటవేసే ప్రయత్నం చేయగా సీత బలవంతం చేస్తుంది. దీంతో ఇలా అత్త గారు షాప్ వద్దకు వచ్చి ఈ విషయాలన్నీ ప్రస్తావించారు అనే విషయాన్ని భారత్ వెల్లడిస్తాడు. అంతే కాక తనకి కూడా ఈ విషయంలో అన్నయ్య చేసిన పని మీద అనుమానం వస్తుందని అనడంతో సీత ఏమీ మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉండి పోతుంది. ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చిన సిరి తన భర్త మీద కోపం వచ్చి, తన తల్లి లాంటి ఆలోచన లేని వ్యక్తి అలా మాట్లాడింది అంటే అర్థం ఉంది అని కానీ బావ గారి గురించి అన్ని విషయాలు తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడటం తనకు ఏమాత్రం నచ్చలేదు అని అంటుంది. ఈ విషయంలో తన తప్పు ఒప్పుకున్న భరత్ క్షమించమని భార్యని అడుగుతాడు

   నిలదీసిన సీత

  నిలదీసిన సీత

  ఇంతలో రఘురాం ఇంటికి రావడంతో సీత వెళ్ళి ఆయనను నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో వాళ్ళు అనుకుంటున్న అన్ని మాటలు ప్రస్తావిస్తూ ఎందుకు ఋషికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, వైదేహి మీద ఎందుకు ఇలా తేడా చూపిస్తున్నావు అని ప్రశ్నించడంతో ఏమీ చెప్పలేక రఘురాం మదన పడుతూ ఉంటాడు. వైదేహి గుండెల్లో హోల్ ఉందన్న సంగతి చెబితే ఎలా జీర్ణించుకుంటారు అనే విషయం మీద రఘురాం మదనపడుతూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని కవర్ చేసుకోవడానికి ఒకప్పుడు నువ్వు కూడా రిషి మీద ఎక్కువ కేర్ చూపించేదానీవో అని ఆ విషయం నేను కూడా నిన్ను నేరుగా అడిగాను కదా అని అంటాడు. దానికి దీనికి సంబంధం లేదు అని పేర్కొన్న సీత రేపు అయినా సరే ఆమెకు ఇన్సూరెన్స్ చేయించాల్సిందే అని పడుతుంది. అయితే ఇప్పుడు ఏం పని చేయాలో తనకు తెలుసు అని చెప్పిన రఘురామ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కోరతాడు.

  హాస్పిటల్ కి వైదేహి

  హాస్పిటల్ కి వైదేహి

  అయితే ఇక ఉదయం కాగానే వైదేహిని ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిన రోజు వచ్చింది అనే విషయం తెలుసుకున్న రఘురాం నెమ్మదిగా వైదేహి తల్లి దగ్గర నుంచి తీసుకుని ఆస్పత్రికి బయలుదేరుతాడు. అంతకు ముందే వైదేహి ఆరోగ్యం ఎలా ఉంది అని అడగగా ప్రస్తుతం బాగానే ఉంటుందని అయితే జ్వరం వచ్చి తగ్గిన అప్పటి నుంచి కాస్త ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తనకు అనిపిస్తోంది అని అంటుంది. ఇక వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్ళడానికి రఘురాం సీత పిలుస్తున్న వినకుండా వెళ్ళిపోతాడు.. అయితే రఘురామ్ అలా వెళ్లడం చూసి సీత మరింత అనుమాన పడుతుంది. అయితే రిషిని వ్యాక్సిన్ వేయించడానికి తీసుకు వెళ్లాల్సి రావడంతో ఆమె శైలుతో కలిసి ఆస్పత్రికి వెళుతుంది.

  దాక్కుని మరీ

  దాక్కుని మరీ

  విచిత్రమేమిటంటే శైలు-సీత కలిసి వెళ్లి హాస్పిటల్, రఘురాం వెళ్ళిన హాస్పిటల్ ఒక్కటే అవుతుంది. అయితే రఘురాం పాపను చూపించడానికి లోపలికి వెళ్ళాడు. డాక్టర్లు టెస్ట్ చేస్తుంటే పాప ఏడుస్తుంది అని మీరు బయట ఉండాలని కోరతారు. అయితే బయటకు వెళ్తే బయట వీళ్లిద్దరు కూర్చుంటారు. వాళ్ళకీ కనపడకుండా పక్కకు వచ్చి రఘురామ్ దాక్కునే ప్రయత్నం చేస్తాడు. మరో పక్క శైలు, సీత ప్రసవం అయినప్పుడు వారికి ప్రసవం చేసిన నర్స్ అక్కడ కనిపిస్తుంది. నర్సు కనబడటమే కాక శైలుకి అనుమానం వచ్చే లాగా మీ కొడుకు కాదు అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఒక బిడ్డకు ఇద్దరు తల్లులు ఉన్నారని, అలాగే బిడ్డకు అంతా కన్నతల్లి పోలికే అని ఇలా రకరకాల కామెంట్లు చేస్తూ ఉంది. అయితే దూరం నుంచి ఇదంతా చూస్తున్న సీతకు ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతుంది. అసలు విషయం ఏదైనా బయట పెట్టేస్తుందా అన్నట్టు ఆమె భయ పడుతూ ఉండగా నేటి ఎపిసోడ్ ముగించారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Vadinamma Episode 614 : Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Siri gets furious when Bharat confronts Sita about Raghuram's decision. On the other hand, Raghuram comes up with a clever plan to take Vydehi to the doctor.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X