For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 7th Episode: మరో విషాదం.. గుండెలు పగిలే న్యూస్ బయటకు, గండంలో వైదేహి?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. తమ కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ఇన్సూరెన్స్ చేయించే విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివాన అయింది. మునుపెన్నడూ లేని విధంగా రఘురామ్ మీద కూడా కుటుంబ సభ్యులు అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అయ్యే పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా వైదేహి ఇన్సూరెన్స్ చేయించకుండా రిషికి మాత్రమే ఇన్సూరెన్స్ చేయించడంతో అందరిలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం మరింత రంజుగా మారింది. ఇక ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లనుంది అనేది ఎపిసోడ్ లో కొంచెం క్లారిటీ వచ్చింది.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   నిన్న ఏమైందంటే

  నిన్న ఏమైందంటే

  ఇక నిన్నటి ఎపిసోడ్ లో రఘురాం ఇంట్లో ఎవరికీ తెలియకుండా వైదేహిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు.. గతంలో ఒకసారి వైదేహి కి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసుకువెళ్లగా ఆమె గుండెలో రంధ్రం ఉందని వీలైనంత త్వరలో ఆమెకు ఆపరేషన్ చేయించాలని కూడా వైద్యులు చెబుతారు. కానీ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచి రఘురాం ఎలా అయినా కొంత డబ్బు కూడా పెట్టి ఆమెకు ఆపరేషన్ చేయించి ఆ గండం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఆమె గుండె జబ్బు ఉంటే ఇన్సూరెన్స్ ఇవ్వరు కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోలేదు. ఇక హాస్పిటల్ కి చూపించే తేదీ దగ్గరకు రావడంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు. అయితే అనూహ్యంగా ఆయన తీసుకెళ్లిన హాస్పిటల్ కి సీత - శైలు కలిసి శైలు కొడుకు టీకా కోసం తీసుకువెళ్తారు. దీంతో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ వివరాల్లోకి వెళితే

  హాస్పిటల్ లో షాక్

  హాస్పిటల్ లో షాక్

  టీకా వేయించడానికి వెళ్లిన చోట నర్సు ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, సీతకు పుట్టిన బిడ్డ అనే కోణంలో మాట్లాడుతూ ఉండగా శైలుకి అనుమానం వస్తుంది. ఇంతలో సీత కూడా ఈ విషయం గ్రహించి వెంటనే అక్కడికి వెళ్లి శైలుని వేరే పనిమీద పంపిస్తుంది. వెంటనే నర్స్ దగ్గరికి వెళ్లి ఎందుకు ఈ విషయం కూడా చెబుతున్నారు అంటే మీరు ఇప్పటికే చెప్పి ఉంటారు అని అనుకున్నాను అంటుంది. అలా ఎలా చెబుతానని జీవితాంతం ఈ బిడ్డ శైలు బిడ్డ అని ఆమె అంటుంది . వెంటనే నర్స్ ని అక్కడి నుంచి పంపించి వేస్తుంది. అయితే శైలు వచ్చి నర్స్ ఏంటి ఎలా మాట్లాడుతుంది అని అడిగితే ఆ సంగతి పక్కన పెట్టి మనం టీకా వేయించడానికి సమయం అయింది అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళుతుంది. ఇక రిషికి టీక వేయిస్తున్న సమయంలో రఘురాం పాపను తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతున్నట్లు గా కనిపిస్తుంది. దీంతో శైలును ఇంటికి పంపించి సీత వెంటనే రఘురాం వెనుక బయలుదేరుతుంది.

   సీతకు క్లారిటీ

  సీతకు క్లారిటీ

  అయితే డాక్టర్లు వెంటనే పాపకు ఆపరేషన్ చేయించాలని చెప్పడంతో పాటు ఆమె ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని చెప్పడంతో రఘురాం బాధపడుతూ గుడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ గుడిలోకి వెళుతున్న విషయం చూసిన సీత తాను కూడా వెంట వెళ్లి రఘు రామ్ ని అసలు ఏం జరుగుతోంది అని నిలదీస్తుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ? వైదేహిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అని నిలదీయగా రఘురాం ఇక ఏం చేయలేమని భావించి వెంటనే అసలు ఏం జరిగింది అనే విషయం మొత్తం చెప్పేస్తాడు. తాను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనే విషయం గురించి చెబుతూ డాక్టర్లు వైదేహి గుండెలో చిల్లు ఉందనే విషయం చెప్పారని, దీంతో తాను ఆమెను హాస్పిటల్ కి తీసుకు వెళ్లానని అని చెబుతారు. అంతేగాక నెల రోజుల క్రితం ప్రస్తుతానికి పర్వాలేదు అన్నారని కానీ ఈరోజు చూపిస్తే మాత్రం వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు అని చెబుతారు. అంతేకాక వీలైనంత త్వరలో ఆ సర్జరీ చేయమని చెప్పారని కూడా చెబుతారు. దీంతో సీత షాక్ అవుతుంది. మళ్లీ కొత్త పరీక్ష తమకు మొదలైందని ఫీల్ అవుతూ ఉంటుంది.

  పార్వతి కొత్త ప్లాన్

  పార్వతి కొత్త ప్లాన్

  ఇక మరోపక్క సిరి తల్లి పార్వతి తన మనవరాలికి ఇన్సూరెన్స్ చేయించ లేదు అనే విషయం తన భర్తకు చెప్పి నీకు సిగ్గు లేదు అల్లుడు ని ఎలా మోసం చేస్తున్నా అడగడం లేదని ప్రశ్నిస్తుంది. అయితే రఘురాం అలాంటి వాడు కాదని ఇందులో ఏదో జరిగి ఉంటుందని భర్త పార్వతితో చెబుతూ ఉంటాడు.. అంతేకాక తన మనవరాలిని చూడడానికి ఆమె సిరి ఇంటికి బయలు దేరుతుంది. అయితే ఎంత సేపు అయినా బావగారు గాని వైదేహి గాని ఇంటికి రాకపోవడంతో సిరి కూడా చాలా బాధ పడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు ఫోన్ చేస్తుంది, బావగారు షాపుకు వచ్చారా అని ప్రశ్నిస్తుంది లేదని అసలు ఏమైంది అని అడగగా ఇలా వైదేహిని బయటకు తీసుకు వెళ్లారని కానీ ఇప్పటిదాకా ఇంటికి రాలేదని చెబుతుంది.. అత్తగారు కూడా నిన్న ఇన్సూరెన్స్ చేయించ లేదు, ఇప్పుడేమో బయటికి తీసుకెళ్ళాడు ? వస్తే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అంటుంది.

  Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
  వైదేహికి గండం

  వైదేహికి గండం

  అసలు దానికి దీనికి ఏమి సంబంధం అని అడగగా ఇంట్లో ఎవరు నిజాలు పంచుకోవడం లేదని అలా నిజాలు మాట్లాడకపోతే ఇలా అనేక అనుమానాలు వస్తాయని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో సిరి మరింత భయాందోళనలకు గురి అవుతుంది. ఇక తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం సిరి కుమార్తె వైదేహి గండంలో పడినట్లు చూపించారు. తన అమ్మమ్మ ఆమెను ఎవరికీ చెప్పకుండా బయటకు తీసుకు వెళ్తున్నట్టు కూడా చూపించారు. శ్వాస సమస్యలు ఎక్కువైతే వెంటనే హాస్పిటల్ కి తీసుకు రమ్మని డాక్టర్లు చెప్పారు అంటూ రఘురాం సీతకి ఫోన్ చేసేటప్పటికి పాపను తీసుకుని పార్వతి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి పోతుంది. దీంతో తదుపరి ఎపిసోడ్ అయితే కచ్చితంగా ఆసక్తికరంగా సాగే లా కనిపిస్తుంది.

  English summary
  Vadinamma Episode 615 : Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Sita gets shocked when Raghuram reveals the truth about Vaidehi's deteriorating health. Elsewhere, Parvathi lashes out at Satyamurthy for his irresponsibility.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X