Vadinamma : భరత్ అరెస్ట్ తో రచ్చ.. లక్ష్మణ్ గల్లా పట్టుకుని రెచ్చిపోయిన పార్వతి!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 726వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం తన కొడుకు రిషి దగ్గరకు ఏదో వంకతో వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసి రఘురాం, సీతను పిలవఋ. అయితే భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు. అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటారు. రాజేశ్వరి ప్లాన్ తో అందరి కంటే ముందు వాళ్ళ చేతుల మీదుగా బాబుకు అక్షింతలు కూడా పడతాయి.

Photos Courtesy: Star మా and Disney+Hotstar

తండ్రి దగ్గరకు వెళ్లి

తండ్రి దగ్గరకు వెళ్లి

దీంతో రఘు రామ్ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత శైలు తన తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చి క్షమించమని అందరినీ అడుగుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కార్తీక మాసం సంబరాల్లో మునిగి పోయి ఉంటారు. అయితే దుర్గ, పార్వతి కలిసి వంట వాళ్ళు రఘురాం, సీత అని శైలుకు చెప్పడానికి ప్రయత్నించి ఎట్టకేలకు ఆ విషయాన్ని శైలు చెవిన పడేస్తారు. దీంతో రగిలిపోయిన శైలు తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది. అయితే అనూహ్యంగా రిషి కనిపించకుండా పోతాడు, అదే సమయానికి రఘురాం వ్యాపారం మీద పూణే వెళతాడు, దీంతో అతనే తీసుకువెళ్లాడు అని భావిస్తారు.

బాధపడుతూ

బాధపడుతూ

ప్లాన్ ప్రకారం శైలు కళ్ళు తిరిగి పోవడంతో ఇంటికి వచ్చిన జనార్దన్ కూతుర్ని తీసుకువెళతాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఇక ఈ అంశంలో సీతను అరెస్ట్ చేసే యత్నం చేయగా అడ్డుపడిన భరత్ ను అరెస్ట్ చేస్తారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భరత్ ను పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్ళడంతో కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు. విషయం తెలుసుకున్న దుర్గ ఈ విషయం అంతటినీ పార్వతికి చెప్పాలని హుటాహుటిన పార్వతి ఇంటికి బయలుదేరి వస్తుంది..

 ఎగిరెగిరి పడుతూ

ఎగిరెగిరి పడుతూ

విషయం చెప్పిన వెంటనే పార్వతి తోక తొక్కిన తాచు పాము లాగా ఎగిరెగిరి పడుతూ ఉంటుంది.. ఎవరో ఎవరో తీసుకు వెళితే నా అల్లుడి అరెస్ట్ చేయడం ఏమిటి? ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా? అసలు లక్ష్మణ్ ఏమి అనుకుంటున్నాడు, వాడి సంగతి తేలుస్తాను అని చెబుతూ హుటాహుటిన సీత ఇంటికి పార్వతి బయలుదేరి వెళుతుంది. ఇంతలో లక్ష్మణ్ కు ఏమీ తెలియకపోవడంతో సైలెంట్ గా ఇంటికి వస్తాడు.. ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మణ్ సీత సిరి ఇద్దరు ఆపి విషయం చెబుతారు. నువ్వు మీ అన్నయ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉంటారు.

బాబు మిస్ అయ్యాడు

బాబు మిస్ అయ్యాడు


అయితే లక్ష్మణ్ తాను తన అన్నయ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అని బాబు మిస్ అయ్యాడు అనే విషయాన్ని కంప్లైంట్ ఇచ్చాను అనే సంగతి చెప్పే లోపే పార్వతి అక్కడికి చేరుకుంటుంది. అక్కడికి చేరుకోవడమే గాక లక్ష్మణ్ కాలర్ పట్టుకుని నీకు ఎంత ధైర్యం ఉంటే నా అల్లుడు మీద కంప్లైంట్ ఇస్తా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నీ సొంత అన్న మీద కంప్లైంట్ ఇచ్చుకో, లేదా తనలో సగం అని చెప్పుకుని తిరిగే ఈ సీత మీద కంప్లైంట్ ఇచ్చుకో అంతేగాని ఏమీ ఎరుగని నా అల్లుడు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఊరుకునేది లేదు అని తెగేసి చెబుతోంది. అయితే లక్ష్మణ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులతో మాట్లాడితే రఘురాం కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని భరత్ తో చెప్పితే రిలీజ్ చేస్తామని అంటారు.

ఏం చేయాలో అర్థం కాక

ఏం చేయాలో అర్థం కాక


అయితే భారత్ మాత్రం ససేమిరా ఆ మాట చెప్పడానికి సిద్ధంగా ఉండడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక వెనక్కి తిరిగి వచ్చేసింది పార్వతి. మరోపక్క లక్ష్మణ్ ఇలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మీద సిరి, సీత ఇద్దరు అతనిని ప్రశ్నిస్తారు అయితే భరత్ విషయంలో ఏదో ఒకటి చేసి అతనిని బయటకు తీసుకురావాలి అని భావిస్తున్నారు కానీ అసలు నా కొడుకు ఏమైపోయాడ? ఎక్కడికి వెళ్ళాడు అని బాధ మీకు ఏ మాత్రం లేదు కదా అని లక్ష్మణ్ ప్రశ్నిస్తాడు. అసలు నీ కంటే ముందే నేను శైలు దగ్గరికి బయలుదేర పోయాను అప్పుడు నువ్వు వెళ్తాను అని ఎక్కడికి వెళ్లావు, మాకు సైలు మీద ప్రేమ లేక కాదు భరత్ ని పోలీసులు అరెస్టు చేయడం అనేది చాలా పెద్ద విషయం అని చెబుతుంది.

కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

మరోపక్క బాబుతో లింగం ఆడుకుంటూ ఉంటాడు బాబు తో ఒక సెల్ఫీ తీసి తన ఫేస్బుక్ లో కూడా పెట్టుకుంటాడు. హాస్పిటల్లో నాటకం ఆడుతున్న శైలు తన బాబు ని చూసేందుకు ఇంటికి రావడం కూడా చూపించారు. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ అరెస్టయి పోలీస్ స్టేషన్ లో ఉండగా సీతా పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. మా మరిది ఇచ్చిన కంప్లైంట్ ఎంతవరకు వచ్చింది అని ప్రశ్నిస్తుంది. బాబు ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద ఏమైనా సమాచారం అందిందా? అని ప్రశ్నిస్తారు. మొత్తం మీద రఘురాం లేదా లక్ష్మణ్ పోలీస్స్టేషన్కు వచ్చినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X