Vadinamma : పార్వతి దెబ్బకు జనార్ధన్ కి షాక్.. అలెర్ట్ అయ్యి సేఫ్ ప్లేస్ కి.. లక్ష్మణ్ కి జ్ఞానోదయం!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. డిసెంబర్ 18వ తేదీన 729 వ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది. ప్రస్తుతానికి రఘు రాం కుటుంబంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. రఘు రాం తన కొడుకు రిషి గురించి తెలుసుకోవడంతో అతని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అది చూసి శైలు తట్టుకోలేకపోతోంది.. రఘు రామ్ సీతా లేకుండా తన కొడుకు పుట్టిన రోజు ఫంక్షన్ చేయించడం ఆ తర్వాత దాని మీద బాధపడుతూ వాళ్ల కాళ్ల మీద పడడం కూడా తెలిసిందే.. అయితే తాను పిలవద్దు అనుకున్న ఫంక్షన్ కి సీతా రఘురాం ఇద్దరూ కూడా మారువేషంలో వచ్చారన్న సంగతి తెలుసుకుని శైలు తన తండ్రితో కలిసి అనేక ప్లాన్స్ వేస్తుంది.

ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో

ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో

అందులో భాగంగానే కొడుకు పెట్టిన డ్రామా డి రఘురాం కొడుకుని ఎత్తుకొని పోయినట్లుగా సీన్ క్రియేట్ చేస్తుంది.. అందులో భాగంగా భరత్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే లింగం బాబు తో కలిసి దిగిన సెల్ఫీ ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో అది దుర్గ కంట్లో పడుతుంది. ఆమె పార్వతికి ఈ విషయం చేరవేస్తుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక తాజాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తన కూతురు తన తో చేతులు కలిపి రఘురాం కుటుంబాన్ని ఏడిపిస్తూ ఉండడాన్ని జనార్ధన్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని తన బావమరిది లింగంతో చెప్పి మరింత ఆనంద పడుతూ ఉంటాడు. ఎలా ఉంది మన ప్లాన్ అంటే అదిరిపోయింది అని లింగం బాగా ఎగ్జిట్ అవుతూ ఉంటాడు.

శైలు పుట్టింటికి వెళ్లి

శైలు పుట్టింటికి వెళ్లి

అయితే ఫేస్ బుక్ లో లింగం సెల్ఫీ చూసి సీత దుర్గ విషయం పార్వతి దగ్గరకు తీసుకు వెళ్లడంతో ఏం చేయాలి అని అడుగుతుంది. దీనిని ఎవరికి చూపిస్తే పని అవుతుందో వాళ్ల దగ్గరికి వెళ్దాం అని అంటుంది. అలా ఇద్దరూ కలిసి శైలు పుట్టింటికి వెళ్లి జనార్ధన్ ను బెదిరిస్తారు. నేనేం చేయాలి అని జనార్ధన్ అడిగితే నేను ఇంటికి వెళ్లే లోపు మా అల్లుడు భరత్ ఇంట్లో ఉండాలి అని కండిషన్ పెడుతోంది పార్వతి.

వాళ్ళు వెళ్ళిన తర్వాత బావమరిది చేసిన ఘనకార్యం గుర్తుకు తెచ్చుకుని మరి బావమరిదిని చితక తంతాడు జనార్ధన్. ముందు ఆ ఫోటో డిలీట్ చేయని చెప్పి ఫేస్బుక్ నుంచి ఫోటో డిలీట్ చేయిస్తాడు. ఇక మరో పక్క ఇవాళ రేపట్లో భరత ని ఎలాగైనా మీ బావగారు తీసుకు వస్తారు ఆయన ఇప్పుడే పూణే నుంచి బయలుదేరి సీత ధైర్యం చెబుతూ ఉంటుంది..

లక్ష్మణ్ వెంటనే

లక్ష్మణ్ వెంటనే

ఇది ఇలా జరుగుతున్న క్రమంలో భరత్ ను పోలీసులు విడుదల చేయడంతో భారత్ నేరుగా ఇంటికి చేరుకుంటాడు. భరత్ మీ ఇంట్లో చూసి లక్ష్మణ్ వెంటనే అదేంటి నిన్ను ఎవరు విడుదల చేశారు, అన్నయ్యని అరెస్టు చేశారా అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తాడు. నేను బయటకు వచ్చాను అని బాధ పడుతున్నావా అన్నయ్యని అరెస్టు చేశారు? ఎందుకు అడుగుతున్నావ్ అంటే ఆయన అరెస్టు కావడం నీకు సంతోషంగా ఉందా అని ప్రశ్నిస్తాడు. అది ఏంట్రా అలా మాట్లాడతావు నేను మాట్లాడేది ఏమిటి నువ్వు మాట్లాడేది ఏమిటి? అని లక్ష్మణ్ భరత్ ని ప్రశ్నిస్తాడు. అసలు ఏమిటి? ఏం జరిగింది ? అని అడిగితే కూడా తప్పేనా అని లక్ష్మణ్ బాధపడతాడు.

అన్నయ్య అరెస్ట్ అయ్యాడు ఏమో

అన్నయ్య అరెస్ట్ అయ్యాడు ఏమో

ఇంతలో వివరంగా చెబుతూ నేను ఎస్సైని కాళ్లు చేతులు కట్టుకు బతిమిలాడినా, సరే మీ అన్నయ్య రాకుండా భరత్ ని వదిలేది లేదు అని ససేమిరా చెప్పాడు. అలాంటిది ఎలా రిలీజ్ చేశారు ఒక వేళ అన్నయ్య అరెస్ట్ అయ్యాడు ఏమో అని భయంతో అడిగాను అని లక్ష్మణ్ అంటాడు. ఇదిలా ఉండగా లక్ష్మణ్ మాత్రం రఘురామ్ ఏ బాబు ని తీసుకు వెళ్ళాడు అని అనుమానిస్తూ ఉంటాడు. అయితే మీ అన్నయ్య బాబు ని తీసుకుని వెళ్ళలేదు మీ అన్నయ్య వెళ్లేటప్పుడు నేను ఉన్నాను కావాలంటే మాట్లాడి ఇస్తాను చూడు అని రఘురామ్ కి ఫోన్ చేసి సీత స్పీకర్ పెట్టి మాట్లాడిస్తుంది.

లక్ష్మణ్ కి జ్ఞానోదయం

లక్ష్మణ్ కి జ్ఞానోదయం

అలా మాట్లాడుతున్న సమయంలో నేను బాబును తీసుకుని వెళ్ళలేదు అని తేల్చి చెబుతాడు దీనితో లక్ష్మణ్ కి జ్ఞానోదయం అయి అసలు బాబుకు ఏం జరిగింది అని ఆలోచనలో పడతారు. నీ బాబు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని సీత తన అన్నయ్య భాస్కర్ ఏసిపి లక్ష్మణ్ అందరిని తీసుకొని శైలు పుట్టింటికి వెళుతుంది.

అయితే పార్వతి గుర్తుపట్టిన విషయం తో మదన పడుతున్న జనార్ధన్ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో బాబుని తీసుకునే లింగాన్ని గెస్ట్ హౌస్ కి వెళ్ళమని చెబుతాడు. ఈ లోపు పోలీసులు రావడం వెతకడం జరుగుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం ఇంటికి రావడం లక్ష్మణ్, శైలుని తీసుకుని బయటకు వెళుతున్నట్టు చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X