Vadinamma : శైలుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భరత్.. కొత్త ఛాలెంజ్ తో సీత సిద్దం

భరత్ బతికి కి రావడంతో కుటుంబ సభ్యులు అందరూ ఆనందపడతారు అయితే భరత్ మాత్రం రఘురాం వైపే ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు. రఘురాం భరత్ బతుకుదెరువు పోయిందని లక్ష్మణ్ బాధపడుతూ ఉండడంతో శైలు తన తండ్రి చేత షాప్ కాగితాలు భరత్ కి అందే విధంగా చేస్తాను అని మాట ఇస్తుంది. మాట ఇచ్చిన విధంగానే తన తండ్రి చేత కాగితాలు పంపిస్తుంది. శైలు మామ లింగం కాగితాలు తీసుకుని రఘురాం ఇంటికి వెళ్ళాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కాళ్ళ మీద పడతాడు అని

కాళ్ళ మీద పడతాడు అని

షాప్ కు సంబంధించిన కాగితాలు తీసుకుని ఇంటికి వచ్చిన లింగం భరత్ కోసం వెతుకుతూ ఉంటాడు. చాలా సేపటి తర్వాత భరత్ వచ్చి మీకు ఏం కావాలి అని ప్రశ్నిస్తాడు. దీంతో శైలు మీ కష్టాలు తీర్చే విధంగా తన తండ్రి చేత షాప్ కాగితాలు నీకోసం పంపించింది అంటూ లింగం బాగా బిల్డప్ ఇస్తాడు. మీ అందరి మంచి కోరే మీ వదినమ్మ శైలు నువ్వు కష్టాల్లో ఉంటే గొడవలు జరిగినా పట్టించుకోకుండా నీకోసం కాగితాలు పంపించింది.

అందుకే వదినమ్మ అనే పదానికి ఆమె పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ ఆమె గురించి బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భరత్ ఆ కాగితాలు అందుకున్న తర్వాత తన కాళ్ళ మీద పడతాడు అని భావిస్తూ ఉంటుంది. అందుకే ఒకవేళ భరత్ వచ్చి కాళ్ళ మీద పడే ప్రయత్నం చేస్తే వీడియో కూడా తీయమని శిల్పను పురమాయిస్తుంది.

కరెక్ట్ కాదు అని

కరెక్ట్ కాదు అని

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్న చందాన శైలు ఒక భావిస్తుంటే భరత్ మాత్రం మరోల భావిస్తాడు. ఇదంతా కరెక్ట్ కాదు అని చెబుతూ వెళ్ళిపోమని లింగంతో అంటాడు. అయినా వెళ్లకుండా శైలు గురించి గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండడంతో కాగితాలు ఇలా ఇవ్వమని భరత్ అడుగుతాడు.

భరత్ అడిగాడు కదా అనే ఉద్దేశంతో కాగితాలు ఇవ్వడంతో ఆ కాగితాలన్నీ చింపి చిన్న చిన్న ముక్కలు చేసి లింగం ముఖం మీద కొట్టి పులి అవ్వాలని అందరికీ ఉంటుంది అలా అని పులిని చూసి వాతలు పెట్టుకుంటే నక్క పులి అవ్వలేదు కదా అంటూ శైలు గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తాడు. ఇంకా ఏదో మాట్లాడ పోతున్న లింగం చెంపమీద ఒకటి ఇవ్వడంతో అతను వెళ్లి శైలు కాళ్ల మీద పడతాడు.

పీకి వేస్తారా లేదా అని

పీకి వేస్తారా లేదా అని

దీంతో శైలు కి కోపం వచ్చి అతనిని ఇంటి కి వెళ్ళిపో అని చెబుతుంది. అయితే శైలు బాధపడుతున్న విషయం అర్థం చేసుకొని సీత భరత్ తరపున తాను క్షమాపణ చెబుతున్నానని దయచేసి ఇవేవి మనసులో పెట్టుకోవద్దని అంటుంది. ఆ తర్వాత భరత్ తో మాట్లాడుతూ నీకు కోపం ఉంటే కాగితాలు తీసుకోను అని చెప్పాలి కానీ అలా మనలో మనం తిట్టుకోవడం కరెక్ట్ కాదు అని అంటుంది.

మరోపక్క రఘురాం కుటుంబమంతా అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత నాకు తెలియకుండా నా ఇంట్లో ఇలా గోడ కట్టడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అది గోడ కాదు గోడ సెట్టింగ్ మాత్రమే అని రఘురామ్ చెబుతాడు ఏదైనా సరే ఇప్పుడు దానిని పీకి వేస్తారా లేదా అని ఇంటి ఓనర్ గట్టిగా ప్రశ్నిస్తాడు.

ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు

ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు

అయితే అది కనుక పీకేస్తే మేము ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు అని శైలు అంటుంది. దీంతో రఘురామ్ కేవలం సెట్టింగ్ మాత్రమే కదా ఇప్పుడు ఏం జరిగింది అన్నట్లుగా మాట్లాడుతాడు. సరే ఒక పని చేయండి ఇంటి అద్దె డబల్ చేసి ఇవ్వండి అని ఇంటి ఓనర్ అంటాడు. దానికి రఘురామ్ ఆలోచనలో పడుతూ ఉండగా శైలు మాత్రం మా వాటా పాతిక వేలు అని చెప్పి తీసుకువచ్చి ఇస్తుంది.

మీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అంటే సాయంత్రం లోపు ఎలాగైనా తీసుకొని వచ్చి ఇస్తాము అంటాడు రఘురాం. అలా బయటకు వెళ్లిన ఇంటి ఓనర్ జనార్ధన్ కి ఫోన్ చేసి మీరు చెప్పిన విధంగానే నేను చేశాను సాయంత్రం లోపు డబ్బులు తీసుకువచ్చి ఇస్తానని చెప్పాడు అనే విషయాన్ని వెల్లడిస్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 కొత్త చాలెంజ్

కొత్త చాలెంజ్

వాడు వాడు ఎక్కడ నుంచి తెచ్చేది అన్నట్లు రాజేంద్ర మాట్లాడతాడు. ఆ తర్వాత శైలు తన అత్తగారి దగ్గరికి వెళ్లి ఆమెను కాకా పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది త్వరలోనే భరత్ మనతో కలిసి పోతాడు అని అంటుంది. అదే జరిగితే నీకు పాలాభిషేకం చేస్తామని రాజేశ్వరి అనడంతో శైలు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ ఉంటుంది. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు.

తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ ని శైలు ఎదో అనడంతో భారత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఏం జరిగింది అని సీత అడిగితే ఇలా చాలెంజ్ చేసింది అని చెబుతాడు, అయితే సీత కూడా మన ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నాను అని చెప్పు గెలిస్తే మళ్ళీ అందరం కలిసి ఉండాలి అంటుంది. మరి చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X