Vadinamma : ఛాలెంజ్ కి రెడీ అయిన రఘురాం.. భరత్ కి ఘోర అవమానం?

వదినమ్మ సీరియల్ లో అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. భరత్ వెనక్కి అయితే వచ్చాడు కానీ రఘురాం, భరత్ ఎలాంటి ఉద్యోగం వెతుక్కోవాలి అనే విషయం మీద తర్జనభర్జనలు పడుతూ ఉంటారు. మరోపక్క గుడిలో విరాళం ఇచ్చే విషయం మీద కుటుంబ సభ్యుల మధ్య మరోసారి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. శైలు కాస్త లూజ్ గా మాట్లాడటంతో తన అన్న, వదినలను అలా అవమానించడం ఇష్టం లేని భరత్ ఆమె మీద విరుచుకు పడతాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 చెప్పి తీరాల్సిందే

చెప్పి తీరాల్సిందే

తన భార్య శైలు మీద భరత్ విరుచుకుపడడం గురించి తెలుసుకున్న తరువాత లక్ష్మణ్ భరత్ మీద చెలరేగి పోతాడు. నా భార్యకు క్షమాపణలు చెప్పమని కోరాడు. దానికి భరత్ కూడా సీరియస్ గా నే మాట్లాడుతూ శైలు వదిన, అన్న వదినల మీద అవమాన కరంగా మాట్లాడింది అందుకే నేను ఆమె మీద సీరియస్ అయ్యాను ఆమె కనుక అన్నా వదినలకు క్షమాపణ చెప్తే నేను ఆమెకు క్షమాపణలు చెప్పడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటాడు. దానికి రాజేశ్వరి సీరియస్ అయి నీకు మీ అన్న వదినల మీద ప్రేమ ఉంటే నీ దగ్గర ఉంచుకో అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దు అని అంటుంది. అయితే భరత్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని లక్ష్మణ్ పట్టుబడతాడు.

తప్పు కాదు అన్నట్టు

తప్పు కాదు అన్నట్టు

నేను చెప్పే పరిస్థితి లేదు ఆవిడ చెబితేనే నేను చెబుతాను అని భరత్ వెళ్ళిపోతుండగా లక్ష్మణ్, భరత్ కాలర్ పట్టుకోవడంతో భరత్ కూడా లక్ష్మణ్ కాలర్ పట్టుకుంటాడు. ఇద్దరూ మళ్ళీ కలబడతారు. ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు కొట్టుకోవడం మాత్రం ఆపరు కానీ సీత వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు ఆగమని అంటే ఇద్దరూ కొట్టుకోవడం అపుతారు. అసలు ఏం జరిగింది అంటే భరత్ జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెబుతాడు. ఇందులో నా తప్పేమైనా ఉందా అని అడుగుతాడు. ఇంతలో సీత రాజేశ్వరిని ప్రస్తావిస్తూ ఇది అంతా విన్నారు కదా ఇందులో తప్పేముంది శైలు అలా మాట్లాడటం తప్పు కదా అని అంటే రాజేశ్వరి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. శైలు అయితే అదేమీ తప్పు కాదు అన్నట్టుగా అప్పుడు కాదు ఇప్పుడు కూడా చెబుతున్నాను మీ వల్ల కాదు ఆ డబ్బు తీసుకురాలేక మీరు పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు అని అంటుంది.

స్వయంగా సంపాదించి

స్వయంగా సంపాదించి

భరత్ మళ్లీ రెచ్చిపోతూ ఉన్న సమయంలో సీత ఆగమని అంటుంది. అయితే అంత భయం లేనప్పుడు ఛాలెంజ్ ఒప్పుకోవచ్చు కదా అని శైలు అంటుంది. దానికి సీత కూడా తాను ఛాలెంజ్ కి రెడీ అని చెబుతుంది. అయితే రఘురాం ఏం మాట్లాడాలో తెలియక ఆలోచనలో పడతాడు. సిరి మాత్రంశైలు అక్క వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి రెండు లక్షల రూపాయలు రెండు నిమిషాల్లో తీసుకొచ్చి ఇస్తుంది కానీ మనం దానిని సంపాదించాలంటే చాలా కష్టం కదా అంటుంది. దానికి భరత్ ఇలా విరాళం ఇవ్వాలి అంటే అది స్వయంగా సంపాదించిన సొమ్ము అయి ఉండాలి అంతేగాని ఎవరి దగ్గర అప్పు తీసుకుని, లేకపోతే వాళ్ళ నాన్న దగ్గర తీసుకొని వస్తే అది పందెంలో నెగ్గలేరు అని అంటాడు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొంత సేపు ఆలోచనలో పడి తర్వాత శైలు కూడా నేను ఏ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నేను కూడా స్వయంగా సంపాదించిన డబ్బులు విరాళంగా ఇస్తాను అని అంటుంది.

మిల్లులో పని

మిల్లులో పని


ఆ తర్వాత ఎవరికి వారు డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయం మీద దృష్టి పెడతారు తాను ఒక మిల్లులో పని చేస్తున్నాను అని చెప్పి ఈ 10 రోజుల పాటు నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయవద్దని లక్ష్మణ్ కోరుతాడు. అదే విధంగా మిల్లులో బస్తాలు మోసే పనికి వెళ్తాడు. అక్కడ బస్తాలు మోసి మిగతా వారు అందరినీ కంగారు పెడుతూ త్వరగా పని చేయాలని అంటూ ఉంటాడు. ఆ మిల్లు సూపర్వైజర్ ఇంత కంగారు పడుతున్నావ్ ఏమిటి అంటే నాకు డబ్బులు చాలా అవసరం ఈ పని త్వరగా చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది కదా అని అంటాడు.

భరత్ ముఖం మీద చెప్పులు

భరత్ ముఖం మీద చెప్పులు

ఇంతలో అక్క డే బస్తాలు మోస్తున్న రఘురాం కళ్లు తిరిగి పడిపోవడంతో వెళ్లి అన్నయ్యకు వచ్చిన పరిస్థితి చూసి భరత్ బాధపడతాడు.. ఇంట్లో ఏ మాత్రం ఈ విషయం మీద డిస్కషన్ పెట్టకూడదు అని ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. రాబోయే కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం మిల్లు ఓనర్ భరత్ ను బస్తాల డెలివరీ జనార్ధన్ స్వాధీనం చేసుకున్న షాప్ కి ఇచ్చి రమ్మంటారు. అలా వెళ్ళిన తర్వాత భరత్ ముఖం మీద చెప్పులు చూపిస్తూ జనార్ధన్ అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X