Vadinamma : టార్గెట్ భరత్.. తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్దం..చెరువులో దూకి?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ప్రస్తుతం రఘురాం కుటుంబ సభ్యులు అందరూ తలో దిక్కుకు విడిపోయిన సంగతి తెలిసిందే. రఘు రాం తల్లి రాజేశ్వరి నాని, లక్ష్మణ్ ఇద్దరికీ రఘురాం తన కన్న కొడుకు కాదని భరత్ తో సహా మీరు ముగ్గురు మాత్రమే నా కడుపున పుట్టారు అనే విషయం చెబుతుంది.. అలాగే రఘురాం తో భరత్ ను ఎలా అయినా తన కొడుకులతో కలపాలని చెబుతోంది.

అయితే రఘురాం చాలా బాధపడతాడు కానీ తన తల్లి చెప్పిన విధంగా చేయడానికి సిద్ధమై భరత్ ను నానా మాటలు అంటున్నట్టు గత ఎపిసోడ్ లో చూపించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కన్నీటి పర్యంతమై

కన్నీటి పర్యంతమై

భరత్ ను వేరు గా ఉండాలి అని ఇక్కడి నుంచి అటువైపు వెళ్లిపోవాలి అని చెప్పడం ఏ మాత్రం బాలేదని అన్నయ్యతో అంటాడు. తను ఏదో ఒక వైపు ఎంచుకోవాలి అని చెప్పడం తనను ప్రాణం తీసుకో అన్నట్లే అనిపిస్తోందని భరత్ చెబుతాడు. అయితే ఎలా అయినా భరత్ తన వైపు వస్తాడు అని భావిస్తున్న భరత్ తల్లి ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

ఆమెను చూసి రఘురాం కూడా భరత్ మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతాడు. తనను తాను నిందించుకుంటూ నేను ఒక స్వార్ధపరుడుని నా స్వార్థం కోసం మీ అందరినీ వాడుకోవాలని చూశాను అని అంటాడు. అదేమిటి అన్నయ్య అలా మాట్లాడుతావు అని భరత్ దాదాపు కన్నీటి పర్యంతమైన అంత పని చేస్తాడు.

వదిలి వెళ్లే ప్రసక్తి లేదు

వదిలి వెళ్లే ప్రసక్తి లేదు

అయితే రఘురాం మాత్రం నేను మంచి వాడిని కాదు నేను మీ అందరినీ వాడుకోవాలని చూశాను కానీ నా ప్లాన్ ఇలా బయట పడడంతో ఇప్పుడు మీ అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని తనను తాను నిందించుకుంటాడు. అయితే భరత్ మాత్రం నేను కచ్చితంగా నిన్ను వదిలి వెళ్లే ప్రసక్తి లేదు అలా చెప్పి నన్ను బాధ పెట్టొద్దు అని చెబుతాడు.

అయితే తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఎలా అయినా భరత్ను అవతలి పక్క వెళ్లి ఎలా చేయాలి అని భావించి రఘురాం కూడా నేను మర్యాదగా చెప్పినప్పుడు వినకపోతే నేను చేసే పనులు చాలా దరిద్రంగా ఉంటాయి..

మాయలో పడకుండా

మాయలో పడకుండా

అప్పుడు నువ్వు బాధ పడితే నేను ఏమి చేయలేను అనే విధంగా మాట్లాడుతారు. అయినా సరే భరత్ మాత్రం నేను నిన్ను వదిలి వెళ్లే ప్రసక్తి లేదు అనే విషయాన్ని రఘురాం దగ్గర క్లారిటీగా చెబుతారు. రఘురాం మాట్లాడుతున్న మాటలకు సీత బాధపడుతున్న సరే ఆయనను ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు.

ఇక అలా మాట్లాడుతూనే ఉన్న సమయంలో దయచేసి నేను చెప్పిన మాట విని నీ అన్నదమ్ములు వద్దకు నువ్వు వెళ్ళిపో అని రఘురామ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రఘురాం వెళ్లి పోయిన తర్వాత రాజేశ్వరి భరత్ ను పిలిచి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అతని మాయలో పడకుండా మీ అన్నయ్య దగ్గరకు వచ్చాయి అని అంటుంది.

ఆ షాప్ నీకే

ఆ షాప్ నీకే

రఘురాం మా అన్నయ్య నేను అతనిని వచ్చే ప్రసక్తే లేదు అన్నట్లు భరత్ మాట్లాడుతారు. ఇంతలో లక్ష్మణ్ కలగజేసుకుని అయిందేదో అయిపోయింది ఇక మీదట అయినా అతని మనసు ఎలాంటిదో తెలుసుకుని నువ్వు మా దగ్గరకు వచ్చేయ్, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అని అంటాడు.

ఇంతలో శైలు కలగజేసుకొని మారిన పరిస్థితుల నేపథ్యంలో నేను ఈ ఇంటి పెద్ద కోడలు గా మాట్లాడుతున్నాను అంటుంది. భరత్ సహా సిరి షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. శైలు మాట్లాడుతూ నేను మాట ఇస్తున్నాను నా షాప్ ఇక నీదే ఒక్కరోజులో నేను మా నాన్నతో మాట్లాడి ఆ షాప్ నీకు అప్పగించే పని చూసుకుంటాను అంటుంది. శిల్ప మాట్లాడుతూ సిరి అక్క నువ్వే మీ ఆయన మనసు మార్చాలి నువ్వు చెబితే ఆయన వింటాడు అంటుంది.

ఆత్మహత్య ప్రయత్నం

ఆత్మహత్య ప్రయత్నం

దానికి సిరి మాట్లాడుతూ ఆయన చదువు అయితే పెద్ద చదువులు చదవలేదు కానీ ఆయనకు సలహాలు ఇచ్చే అంత పెద్ద మనిషిని నేను కాదు అంటుంది. ఇంత సేపు మౌనంగా ఉన్న భరత్ మాట్లాడుతూ అమ్మ నేను నీలాగా మోసం చేయలేను నేను నా అన్న వదిన లను వదిలి ఎక్కడికి రాలేను, అనే విషయాన్ని తేల్చి చెబుతాడు.

దీంతో లక్ష్మణ్ మా రక్తం ఒకటే కానీ వాడి బుద్ధి మాత్రం మనది కాదు చూశావుగా ఎలా మాట్లాడుతున్నాడో అని తల్లితో అంటాడు. భరత్ మాత్రం నన్ను అన్నా, వదినలు వద్దు అనుకున్నా సరే వారి గుమ్మం ముందు పిలిచే వరకు ఎండైనా వానైనా నిలబడతాను తప్ప మీ దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదని చెబుతాడు.

ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు గట్టుకు వెళుతున్నట్లుగా చూపించారు ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది వచ్చే వరకు వేచి చూడక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X