For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial Episode July 27 నాని ఫ్యామిలీతో దమయంతి తంటాలు.. స్కెచ్ రివర్స్, పాపం!

  |

  స్టార్ మా వదినమ్మ సీరియల్ గత ఎపిసోడ్ లో శోభనం కోసం ముహూర్తం పెడుతున్న పంతులు ఇప్పట్లో ముహూర్తాలు లేవని శ్రావణమాసం వచ్చే వరకు ఆగక తప్పదని చెబుతాడు. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన దమయంతి శోభనానికి ముహూర్తాలు చూస్తున్న మీకు శోభనం తల్లి ఇంట్లో జరిపించాలి అనే విషయం తెలియదా అని అడుగుతుంది. సీత వాళ్లు కూడా ఆనందపడి మీ అంతట మీరు కలుపుకోవడానికి వస్తే మాకు ఏమీ ఇబ్బంది అంటూ ఆనందపడతారు. ఇక తమ ఇంటికి సాయంత్రం రావాల్సిందిగా కోరుతూ దమయంతి ఆహ్వానం పలుకుతుంది.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   మారిన దమయంతి

  మారిన దమయంతి

  తాను మారిపోయాను అన్నట్లుగా తన కూతుర్ని బాగా పలకరించడం అలాగే సీత సహా మిగతా అందర్నీ కూడా పలకరిస్తూ వెళ్తూ వెళ్తూ నానిని కూడా అల్లుడు గారు అని సంబోధించడంతో సీత సహ కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోతారు. ఇంతలో షాప్ లో ఉన్న భరత్ అమ్మ రఘురామ్ కి ఫోన్ చేస్తాడు. మీరు ఇంకా డెలివరీ ఇచ్చారా లేదా అవతలి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతారు. అయితే తన బండి పంచర్ అయింది అనే విషయం చెబితే మళ్లీ తనను బయటకు పంపడు అన్న ఉద్దేశంతో లక్ష్మణ్ బండి పంక్చర్ అయితే వాడికి ఇచ్చాను అని అబద్ధం చెబుతాడు. అయితే తనకు ఇప్పటికే లక్ష్మణ్ ఫోన్ చేసి చెప్పాడు అని మీరు రిస్కు తీసుకోవద్దు అని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని భారత్ అంటాడు.

  ముసలోడినా

  ముసలోడినా

  ఏదో నేను ముసలోడివి అయిపోయాను అన్నట్టు ఇలా చేయొద్దు రా అంటూ రఘురాం ఫైర్ అవుతాడు. ఇంతలో సీత కూడా ఫోన్ చేయడంతో తన బండి పంచర్ అయింది సంగతి సీతకి కూడా తెలిసిపోయిందని అనుకుంటాడు. అయితే సీత ఫోన్ చేసి దమయంతి ఇంటికి వచ్చిన సంగతి చెబుతుంది. అలాగే సాయంత్రం అందరిని వాళ్ళ ఇంటికి పిలిచారు అన్న సంగతి చెప్పడంతో సాయంత్రానికి అందరూ రెడీ అయ్యి ఇంటికి వెళతారు. ఇక దమయంతి ఇంట్లో కూడా వీళ్ళందరికీ సాదరంగా ఆహ్వానం లభిస్తుంది.

   కాళ్ళు కడగాలసిందే

  కాళ్ళు కడగాలసిందే

  అయితే మా అందరికీ మర్యాదలు చేయకపోయినా కొత్త అల్లుడికి మర్యాదలు చేయాల్సిందేనని భరత్, లక్ష్మణ్ పట్టుబడతారు. అంతే కాక బావమరిది వచ్చినా నానీ కాళ్లు కడగాల్సింది అని పట్టుబట్టడంతో నేను కడగను అంటూ శిల్ప అన్న అలుగుతాడు. అయితే సంప్రదాయం ప్రకారం చేయాల్సిందేనని భారత లక్ష్మణ్ పట్టుపట్టడంతో శిల్ప తండ్రి తల్లి కూడా ఇద్దరు అతనికి చెప్పి ఒప్పిస్తారు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో వీడియో తీస్తున్న భరత్ ను వద్దు అని కూడా అడ్డుకోబోతాడు. అయితే ఇవన్నీ తీపిగుర్తులు అని అలా ఉంచుకోవాలని అంటూ వీడియో షూట్ చేస్తారు.

   వీళ్ళేంట్రా బాబు

  వీళ్ళేంట్రా బాబు

  ఇక కాళ్లు కడిగిన అనంతరం ఇంట్లోకి వెళతారు.. ఇక ఆ రోజు సాయంత్రం అందరికీ మంచి డిన్నర్ ఏర్పాటు చేయిస్తుంది దమయంతి. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అయితే కొత్త పెళ్లికూతురు, కొత్త పెళ్ళికొడుకు ముద్దలు కలిపి తినిపించుకోవాలని శైలు, సిరి చెబుతారు. అయితే ఇవన్నీ చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి అని దమయంతి భావిస్తూ ఉంటుంది. సరేలే అని సర్దుకుపోదాం అనుకుంటే సీత-రఘురాం, శైలు-లక్ష్మణ్, భరత్-సిరి ఇలా వీరు కూడా తినిపించుకుంటూ ఉంటారు. ఇది ఏంటి ఇలా చేస్తున్నారు అంటే తమ ఉమ్మడి కుటుంబానికి ఇదే అసలైన మూలకారణమని ఇంత అన్యోన్యంగా ఉంటాం కాబట్టే ఇంకా విడిపోలేదని చెబుతారు.

  తదుపరి ఎపిసోడ్ లో

  తదుపరి ఎపిసోడ్ లో

  అంతేకాక మీరు కూడా తినిపించాలని దమయంతి భర్తకి వాళ్ళ సలహా ఇస్తారు. దమయంతి భర్త కూడా తినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా మొత్తం మీద ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ కుటుంబం అంతా కలిసి ఒక ఆట ఆడుతున్నట్టుగా చూపించారు. భార్యాభర్తల మధ్య బంధం మరింత పెంపొందేలా గా యాక్టర్ డిజైన్ చేశామని సీత చెబుతుంది.

  English summary
  Vadinamma Episode 605: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Raghuram feels delighted as Sita shares some good news with him. Later, Shailu and Siri's unexpected move leaves Dhamayanthi in a fix.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X