Vadinamma July 28 Episode దాంపత్యం నిరూపించుకున్న రఘురామ్.. కక్కలేక మింగలేక ఇబ్బందుల్లో దమయంతి!

తెలుగులో ప్రసారం అవుతున్న స్టార్ మా ఛానల్ వదినమ్మ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో రఘురాం కుటుంబం పడుతున్న అనేక కష్టాలను ప్రస్తావిస్తూ వెళుతున్నారు. ఆ కుటుంబం కష్టాలు బారినపడటం మళ్ళీ వాటిని ఎలా అధిగమించారు అనే విషయాలను ఆసక్తికరంగా చూపిస్తున్నారు.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

 ఆనందంలో ఫామిలీ

ఆనందంలో ఫామిలీ

తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో రఘురాం కుటుంబమంతా శిల్ప ఇంటికి వెళతారు. శోభనం కోసం అక్కడ ఏర్పాటు చేయడంతో శోభనానికి ముందు జరిగే కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు. రెండు కుటుంబాల వారు సరదాగా గడుపుతుంటారు. పెళ్లి అనుకోకుండా జరిగిపోవడంతో అప్పుడు జరగని విషయాలన్నింటినీ ఇప్పుడు జరుగుతూ రఘురామ్ కుటుంబం అంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

 చిలకలు చుట్టుకుని

చిలకలు చుట్టుకుని

ఎవరికి వాళ్లు చిలకలు చుట్టి ఒకరికి ఒకరు అందించుకుంటూ ఆనంద పడుతూ ఉంటారు. అయితే నాని పెట్టిన చిలకతో పాటు నాని వేలిని కూడా శిల్ప కొరికేస్తుంది.. దీంతో అందరూ ఈ విషయంలో పగలబడి నవ్వుతూ ఉంటారు. అయితే ఈ వ్యవహారం అంతా చూస్తున్న దమయంతి, దమయంతి కొడుకుకు ఏ మాత్రం రుచించడం లేదు. వాళ్లను ముళ్ళ పరుపు మీద కూర్చో బెట్టినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే తమతో పాటు దమయంతి, దమయంతి భర్త కూడా ఒకరికి ఒకరు చిలకలు తినిపించుకోవాలని చెప్పడంతో ముందు కాస్త తటపటాయించి చివరికి తన భర్త నోటికి చిలకలు అందిస్తుంది.

 సిరి కొత్త ఆట

సిరి కొత్త ఆట

ఇక ఆ తంతు ముగిసిన వెంటనే మళ్లీ కుటుంబ సభ్యులందరూ వెళ్లి సోఫాలో కూర్చుంటారు. ముహూర్తానికి ఇంకా సమయం ఉందని అందరూ వెళ్లి రెస్ట్ తీసుకోవాలని దమయంతి చెబుతోంది. కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకునే సమయం కాదని సరదాగా గడిపే సమయం అని చెబుతూ సిరి ఒక పందెం పెడుతుంది. ఆ పందెం ప్రకారం భార్యలు అందరూ తమ భర్త తమదిగా గుర్తించే ఒక వస్తువుని ఒక ప్లేటులో పెట్టాలి. భర్తల కళ్ళకు గంతలు కట్టి ఒక్కొక్కరిగా ఆ ప్లేట్ వద్దకు పంపించి తన భార్య వస్తువుని గుర్తించేలా చేయాలి. అలా ఎవరైతే తమ భార్య వస్తువులను కరెక్ట్ గా గుర్తు పడతారు వాళ్ళు గెలుస్తారని సిరి అంటుంది.

 సీరియస్ గా తీసుకున్న రఘురామ్-సీత

సీరియస్ గా తీసుకున్న రఘురామ్-సీత

అయితే అందరూ సీరియస్ గా తీసుకోకపోయినా రఘురాం సీత మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. తన భార్య వస్తువు కనిపెట్ట లేక పోతే తన దాంపత్యానికి విలువలేదని రఘురామ అంటాడు. సీత కూడా దాదాపుగా అలాగే మాట్లాడుతుంది. మొత్తం మీద మిగతా అందరూ తమ తమ భార్య వస్తువులను గుర్తించ లేక పోయినా రఘురాం మాత్రం కరెక్ట్ గా గుర్తిస్తాడు. అంతే కాక మిగతా వస్తువులు ఎందుకు తన భార్యని కావు అనే విషయం మీద కూడా ఆసక్తికరంగా వివరణ ఇస్తాడు. మొత్తం మీద ఈ గండం గట్టెక్కినట్టే అయింది.

 బంతాట

బంతాట

ఇక ఈ తంతు ముగిసిన తర్వాత అందరూ కూర్చుని కాఫీలు టీలు తాగుతూ ఉంటే నాని మాత్రం పాలు తాగుతూ ఉంటాడు. నాని పాలు తాగుతున్న విషయం చూసి ఆట పట్టించడానికి భరత్ పూనుకుని ఇంకేముంది పాలు తాగితే గురక పెట్టి నిద్ర పోతావని భయపడతాడు. దీంతో వెంటనే పాలగ్లాసు కింద పెట్టేస్తాడు నాని. అయితే ఇదంతా సరదాకి అని చెప్పడంతో కాస్త రిలాక్స్ అవుతాడు. ఇక ఈ తంతు ముగిశాక అందరూ కలిసి పూలబంతితో ఆడుకుంటూ ఉంటారు. ముందుగా శిల్పా తర్వాత సీత ఇలా ఒక్కొక్కరుగా ఆడుతూ ఉంటారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 నానికి మత్తు మందు

నానికి మత్తు మందు

అయితే ఈ విషయాన్ని భరించడానికి కష్టంగా ఫీలవుతుంటారు దమయంతి, దమయంతి కొడుకు. వాళ్ళిద్దరికీ ఒళ్లంతా తేళ్ళు జెర్రులు పాకుతున్న ఫీలింగ్ ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ లో నాని తాగబోతున్న జ్యూస్ లో ఏదో మత్తు మందు లాంటిది కలపడానికి దమయంతి ప్రయత్నిస్తున్నట్లుగా చూపించారు. బహుశా వచ్చే ఎపిసోడ్లో దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X