For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial May 21st Episode: లక్ష్మణ్ సేఫ్.. జనార్ధన్ కి ఘోర పరాభవం.. అమ్మకానికి రఘురామ్ ఆస్తులు!

  |

  తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో వదినమ్మ కూడా ఒకటి అన్న సంగతి తెలిసిందే. ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ రోజుకొక ట్విస్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ తాజాగా 548వ ఎపిసోడ్ కి చేరుకుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్తే

  సూసైడ్ అటెంప్ట్

  సూసైడ్ అటెంప్ట్

  నిన్నటి ఎపిసోడ్ లో తన కుటుంబం మొత్తం బాధపడుతోందనే ఉద్దేశంతో లక్ష్మణ్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఈ విషయం ముందుగానే సీత పసిగడుతుంది. అయితే అది పీడకల అనుకుని మళ్ళీ ఆమె తన రూమ్ కి వచ్చేస్తుంది. కానీ లక్ష్మణ్ నిజంగానే ఆత్మహత్యాయత్నం చేశాడు అన్న విషయం తెలుసుకుని కుటుంబం అంతా కలిసి లక్ష్మణ్ హాస్పిటల్ కి తీసుకెళతారు.

  చెప్పగలనో లేదో

  చెప్పగలనో లేదో

  ఇక నేటి ఎపిసోడ్ లో హాస్పిటల్లో లక్ష్మణ్ కుటుంబమంతా డాక్టర్లు చెప్పే విషయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రఘురాం కూడా లక్ష్మణ్ ఇలా చేయడం సరికాదని ప్రాణాలు తీసుకుంటే ఈ సమస్య తీరుతుందని అనుకున్నాడు కానీ అది కరెక్ట్ కాదని అలా చేస్తే మరింత పెద్దదవుతుంది అని చెబుతాడు. ఈ విషయం వాడితో చెప్పాలనుకుంటే అది చెప్పగలనో లేదో అని బాధ పడతాడు. సీత వారించి లక్ష్మణ్ కి ఏమీ కాదని మునుపటిలా తిరిగి వస్తాడని ధైర్యం చెబుతుంది.

  చేతగాని అన్నకి తమ్ముడిగా పుట్టినందుకు

  చేతగాని అన్నకి తమ్ముడిగా పుట్టినందుకు

  ఇక అల్లుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అనే విషయం తెలిసిన జనార్ధన్ హుటాహుటిన భార్యతో కలిసి హాస్పిటల్ కి వస్తాడు. అసలు ఏమైంది అని శైలు తల్లి శైలుని అడగగా చేతగాని అన్నకి తమ్ముడిగా పుట్టినందుకు తన అల్లుడికి ఈ ఆత్మహత్య చేసుకోవాల్సిన గతి పట్టిందని జనార్దన్ చెబుతాడు. జనార్ధన్ బావమరిది హాస్పిటల్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి రఘురాం కుటుంబానికి జనార్ధన్ కి మధ్య ఉన్న వైరాన్ని మరింత పెద్దది చేసేందుకు కామెంట్స్ చేస్తూ ఉంటాడు

  మంత్రి పదవి గురించి ఆలోచించాడు కానీ

  మంత్రి పదవి గురించి ఆలోచించాడు కానీ

  ఈ మాటలు విన్న భరత్ జనార్ధన్ మీద సీరియస్ అవుతాడు. అలాగే రఘురాం సీత ఇద్దరూ కూడా జనార్ధన్ అలా మాట్లాడటం సరికాదని సీరియస్ అవుతారు. ఇక వాళ్లందరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో శైలుని పలకరించే ప్రయత్నం చేస్తాడు జనార్ధన్. కానీ శైలు మాత్రం తండ్రితో మాట్లాడడానికి ఇష్టపడదు. తన భర్త అరెస్టు అయిన సమయంలో వచ్చి సహాయం చేయమంటే తన మంత్రి పదవి గురించి ఆలోచించాడు కానీ అల్లుడు గురించి ఆలోచించలేదని ఆమె తండ్రి మీద కోప్పడింది.

  ఘోర పరాభవం

  ఘోర పరాభవం

  ఇక తండ్రితో మాట్లాడేది లేదంటూ ఆమె వెళ్లి సీతను హత్తుకోవడంతో జనార్ధన్ షాక్ కి గురవుతాడు. తనకు ఘోర పరాభవం జరిగింది అన్న విషయం అర్థమై భార్యని అక్కడి నుంచి వెళ్ళిపోదామని కోరతాడు. తన కూతురే తనను ఇలా అవమానిస్తుంటే తాను ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉండాలని జనార్ధన్ ప్రశ్నిస్తాడు. ఇంత జరుగుతున్నా శైలు తండ్రి మీద ఏమాత్రం కనికరం చూపలేదు. ఆయనని ఇక జీవితంలో నమ్మను అని తేల్చి చెబుతుంది.

  పుట్టిన వేళ మంచిది కాదేమో

  పుట్టిన వేళ మంచిది కాదేమో

  ఇక అక్కడనుంచి జనార్ధన్ కుటుంబంతో సహా నిష్క్రమిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయాక సీత తండ్రిని అలా అనాల్సింది కాదని శైలుకి సూచిస్తుంది. కానీ తాను అలా అనడంలో తప్పు లేదని, కూతురు అన్న మాటలను కూడా పంతంగా తీసుకుని తండ్రి అలా వెళ్ళి పోవడం వాళ్ళ తప్పేనని శైలు చెబుతుంది. అంతేకాక తన కొడుకు పుట్టిన వేళ మంచిది కాదేమో వాడి నష్ట జాతకం వల్లే లక్కీకి ఇలా అయి ఉండొచ్చు అని శైలు అభిప్రాయపడుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఆస్తి అమ్మకాలు

  ఆస్తి అమ్మకాలు

  అయితే అది తప్పని అప్పుడే పుట్టిన బిడ్డ గురించి అలా మాట్లాడవద్దని రఘు రామ్, సీత ఇద్దరూ వారిస్తారు. అయితే డాక్టర్ వచ్చి ఎలాంటి రిస్క్ లేదని చెబుతాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకుంటారు. ఇక తర్వాత ఎపిసోడ్ లో ఇరవై కోట్ల అప్పు క్లియర్ చేయాలి అంటే తమ ఇల్లు, ఆస్తి అమ్మాలని భావించి రఘురామ్ భార్యకు, తల్లికి చెబుతాడు.

  అయితే ఇవన్నీ అమ్మేసి ఎక్కడికి వెళతాము అని తల్లి ప్రశ్నిస్తే ఒకప్పుడు ఏ పెంకుటింట్లో ఉన్నామో మళ్లీ అక్కడికే వెళ్తామని రఘురాం చెబుతాడు. అలా మొత్తం మీద ఆస్తి అమ్మకాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక దీని మీద రేపటి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  English summary
  Vadinamma Episode 548: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Lakshman tried to commit suicide. And then he will be hospitalised,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X