Vadinamma Serial May 22nd Episode:అమ్మకానికి రఘురామ్ ఆస్తులు.. అలా అయితే ఇక బతకనంటూ ఎమోషనల్!
తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 5లో ఒకటిగా కొనసాగుతూ మంచి టిఆర్పి సాధిస్తున్న వదినమ్మ సీరియల్ రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతోంది.. టీవీ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ పాత్రధారులుగా నటిస్తున్న ఈ సీరియల్ ఆసక్తికర ట్విస్టులతో సాగుతోంది. ప్రియాంక నాయుడు, రాజేష్, మహేశ్వరి, రాజేంద్ర ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఒంటరిగా ఉంచొద్దు
ఈ సీరియల్ లో నిన్నటి ఎపిసోడ్ లో శైలు తన తండ్రిని నమ్మను అని చెప్పడంతో రాజేంద్ర తన భార్య, బావమరిదిని తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మణ్ కి ప్రాణాపాయం తప్పడంతో ఐసియు నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు. అయితే ఆయనను మాత్రం ఒంటరిగా వదిలి వేయవద్దని డాక్టర్ రఘురాంని పక్కకి పిలిచి మరి హెచ్చరిస్తాడు

అండగా ఉండాలి
అయితే ఇదంతా జరగడానికి ముందు భరత్ ఇంటికి చేరుకుంటాడు. ఇద్దరు పిల్లలతో తంటాలు పడుతున్న తన భార్యకు సహాయం చేయమని రఘురాం ఇంటికి పంపిస్తాడు. దీంతో ఇంటికి వచ్చిన భరత్ తన భార్య పిల్లలతో ఇబ్బందులు పడుతుంటే తాను కూడా సహాయం చేస్తాడు. అనంతరం భార్యను లోపలకి తీసుకు వెళ్లిన భరత్ ఇప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి అండగా నిలబడాలని చెబుతాడు. ఆమె కూడా అందుకు సంతోషంగా అంగీకరిస్తుంది.

మొత్తం అమ్మేయాలి
ఇక రఘురాం 20 కోట్ల రూపాయలు అప్పు తీర్చాలంటే ఇల్లు ప్రాపర్టీస్ తో పాటు అన్నదమ్ముల అందరి పేరుమీద ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుందని అప్పుడే 20 కోట్లు అప్పు తీర్చగలను అని తల్లికి, భార్యకు చెబుతాడు. అలా చేస్తే ఎలా అని తల్లి ప్రశ్నిస్తుంది అయినా రఘురామ్ ఆమెకు నచ్చచెప్పాడు. ఈ సమయంలో తాను అండగా నిలబడాలని, ఈ అన్న ఉన్నాడని లక్ష్మణ్ కి భరోసా కల్పించాలని పేర్కొన్నారు. ఇక భయంతోనే లక్ష్మణ్ ఆత్మహత్యాయత్నం చేశాడని అతని భయం తీరాలంటే ముందు ఈ సమస్య తీరాలని రఘురాం చెప్పుకొస్తాడు.

మళ్ళీ పెంకుటింట్లో
అయితే ఇవన్నీ అమ్మేస్తే మళ్ళీ ఎక్కడ ఉంటామని తల్లి ప్రశ్నించగా ఇంతకు ముందు ఏ పెంకుటింట్లో అయితే ఉన్నామో ఆ పెంకుటింట్లోనే ఉంటామని రఘురాం చెప్పుకొస్తాడు. ఇక ముందు భరత్, భరత్ భార్యను పిలిచి ఈ విషయాన్ని తెలియజేస్తారు. దీనికి భరత్, భరత్ భార్య ఇద్దరూ సంతోషంగా అంగీకరించారు. ఇక లక్కీతో శైలు మాట్లాడుతూ ఇలా ముభావంగా ఉండవద్దని కోరుతుంది. అయితే లక్కీ మాత్రం ఇలా ఎన్ని రోజులు అన్నయ్యకు భారంగా ఉంటామని ప్రశ్నిస్తాడు.. కానీ అదేమీ లేదని మీ అన్నయ్య అన్ని చూసుకుంటాడని శైలు ధైర్యం చెబుతుంది.

బతికి కూడా అనవసరం
ఇక లక్ష్మణ్, శైలు, భరత్, భరత్ భార్య అందరినీ పిలిపించి రఘురాం అసలు విషయం చెప్పమని సీతను కోరుతాడు. దీంతో సీత అసలు విషయం క్లారిటీగా చెబుతుంది. ఇల్లు ప్రాపర్టీ లు అన్ని అమ్మినా 15 కోట్లు మాత్రమే వస్తాయని ఉమ్మడి ఆస్తి తాకట్టు పెడితే మరో ఐదు కోట్లు వస్తుందని చెబుతుంది. అయితే దీనికి భరత్, భరత్ భార్య ఒప్పుకుంటారు కానీ లక్ష్మణ్ ఒప్పుకోడు. తన వల్ల తాకట్టు పెట్టడం సరికాదని అని చెబుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్లో సంతకం పెట్టను అన్న లక్ష్మణ్ ను రఘురాం వారిస్తాడు, నువ్వు సంతకం పెట్టకపోతే ఇబ్బందుల నుంచి బయట పడలేమని అలా బయట పడక పోతే తాను బతికి ఉండి కూడా అనవసరమని ఎమోషనల్గా మాట్లాడుతాడు. చూడాలి మరి తదుపరి ఎపిసోడ్ లో ఏమి జరుగుతుంది అనేది.


Click it and Unblock the Notifications











