Vadinamma: చేయిదాటిపోయిన లక్ష్మణ్.. ఇంటి నుంచి అత్తారింటికి పయనం.. జనార్ధన్ ఎంట్రీతో కలకలం!

రఘు రామ్ రిషిని తీసుకుని షాప్ కు వెళ్ళడంతో శైలు పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తరువాతి రోజు కూడా అదే పరిస్థితి ఎదురు కాగా బాబును పైకి తీసుకు వెళ్లి ఆడించబోతున్న సమయంలో బాబు మెట్ల మీద నుంచి పడిపోతాడు, దీంతో తీవ్ర గాయాలు అవుతాయి. దీంతో వాళ్ళు హాస్పిటల్ కి వెళితే అక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది. బాబు కోలుకొని బయటకు వచ్చినా జనార్దన్ ఎంట్రీతో కుటుంబంలో పెద్ద ముసలమే పుడుతుంది. రఘురాం రిషి వెంట పడుతూ ఉండడంతో అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలి అని లక్ష్మణ్ అన్నయ్యకు నేరుగా చెప్పకుండా అనాధాశ్రమం అధికారులను ఇంటికి తీసుకువస్తాడు. వారిని చూసి షాక్ అయిన రఘురామ్ లక్ష్మణ్ బాధ అర్ధం చేసుకుని బాబుకు దూరంగా ఉంటానని మాట ఇస్తాడు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 వైదేహిని దత్తత ఇవ్వడానికి కూడా

వైదేహిని దత్తత ఇవ్వడానికి కూడా

అన్నయ్య రిషి కోసం పడుతున్న తపన చూసి బాధ పడిన భరత్ తన కూతురు వైదేహిని అన్నయ్యకు దత్తత ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతాడు. తాను ఒక్కడే ఈ నిర్ణయం తీసుకోకుండా తన భార్య సిరి దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పి అన్నయ్యని చూడలేక పోతున్నాను, అందుకే మన కూతుర్ని అన్నయ్యకు దత్తత ఇద్దాం అంటాడు. అయితే సిరి మాట్లాడుతూ నువ్వు దత్తత ఇస్తే మాత్రం తీసుకుంటాడా? అసలు జరిగిన విషయం ఇది అంటూ శైలు పురిట్లోనే బిడ్డను కోల్పోవడం, ఆ తర్వాత సీత తన బిడ్డను శైలికి త్యాగం చేయడం, రఘురాం ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆ నిజాన్ని ఆయనకు వెల్లడించడం లాంటి అన్ని విషయాలు భరత్ కి చెబుతుంది. ఇవన్నీ విన్న భరత్ ఆశ్చర్యపోతాడు. తన కళ్ళముందే కన్న కొడుకుని పెట్టుకొని కూడా సీత వదిన ఇంత బాధ కడుపులో మోస్తుంది అంటే మామూలు విషయం కాదని చెబుతూ బాధ పడతాడు.

రిషిని దూరం నుంచి చూస్తూ

రిషిని దూరం నుంచి చూస్తూ


ఇలా మాట్లాడుతూ ఉండగా మరో పక్క రఘురాం రిషిని దూరం నుంచి చూస్తూ ఉంటాడు కానీ అతని వద్దకు వెళ్లి ఆడుకోవాలి అంటే భయపడతాడు. అయితే అప్పుడే బయటకు వస్తున్న భారత్ ఈ విషయాన్ని చూస్తాడు. భరత్ అదృష్టం కొద్ది ఆ సమయానికి ఫోన్ రావడంతో శైలు పైకి వెళుతుంది, భరత్ బాబు ని ఎత్తుకోవడమే కాక బలవంతంగా రఘురాం చేతిలో పెడతాడు. నాకు వద్దు శైలు వస్తే రచ్చ జరుగుతుంది అని భయపడి రఘురాం నచ్చ చెప్పబోతున్నా సరే వినడానికి సిద్ధంగా లేని భరత్ అన్నయ్య చేతిలో బాబుని పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళి అన్నయ్య బాబు తో ఆడుకుంటున్న విషయాన్ని చూస్తూ ఉంటాడు.

 నేను తప్పు చేయ లేదు

నేను తప్పు చేయ లేదు


అన్నయ్య దగ్గర రిషిని చేర్చాను అని భరత్ ఆనందపడుతున్నత సేపు పట్టలేదు వెంటనే వచ్చిన శైలు తన కొడుకుతో రఘురాం ఆడుకోవడం చూసి పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఇదేనా మీ పెద్దరికం? ఇదేనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం? అని ప్రశ్నిస్తూ రెచ్చిపోతుంది. దానికి రఘురాం నేను కావాలని బాబుని తీసుకోలేదు అంటుంటే ఇంకా దొరికిపోయారు అబద్దాలు చెప్పడం మానండి అంటూ ఘాటుగా సమాధానం ఇస్తుంది. వీరిద్దరి మధ్య వాగ్వాదం చూసి ఇంట్లో సభ్యులు అందరూ పరిగెత్తుకొని అక్కడికి వస్తారు. అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఎవరూ వినడం లేదు? నేను నా కొడుకుని ఇవ్వను అని చెప్పాక కూడా ఎందుకు వాడి వెంట పడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ప్రశ్నిస్తుంది. లక్ష్మణ్ వచ్చి అసలు ఏం జరిగింది? అని ప్రశ్నిస్తే, పెద్దన్నయ్య మాట తప్పాడు అనే విషయాన్ని వెల్లడిస్తాడు. అయితే నేను తప్పు చేయ లేదు అని రఘురాం చెప్పబోతూ ఉండగా లక్ష్మణ్ వినిపించుకునే స్థితిలో ఉండడు.

చీదరించుకున్ననట్లు

చీదరించుకున్ననట్లు


బాబుని ఇలా ఇచ్చేయి మనం ఎన్నిసార్లు చెప్తున్నా పెద్దన్నయ్య అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు కాబట్టి ఆయనకు ఇచ్చేద్దాం ఏం చేసుకుంటాడో చేసుకోనిద్దాం అన్నట్లు మాట్లాడతాడు. ఇంతలో ఇదంతా జరుగుతూ ఉండగా భారత్ ఎంట్రీ ఇచ్చి అన్నయ్యకు బాబు ని ఇచ్చింది నేనే అని చెప్పడంతో లక్ష్మణ్ కి కోపం వచ్చి భరత్ చెంప పగల కొడతాడు. ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నింటికీ ఇప్పుడు నువ్వే కారణం అవుతున్నావు అన్నట్లు మాట్లాడడంతో అసలు ఇంట్లో నీ బిడ్డ నా బిడ్డ ఏంటి అసలు నీ బిడ్డ అన్నయ్య బిడ్డే అంటాడు. ఏంటి మళ్లీ ఒకసారి చెప్పు అనడంతో తప్పు అర్థం చేసుకుని మనందరం కూడా అన్నయ్య బిడ్డలమే కదా ఎందుకు పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. ఇక వీళ్ళు అందరూ గొడవ చూసి శిల్ప చీదరించుకున్ననట్లుగా మాట్లాడుతుంది.

Recommended Video

VJ Sunny కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బెదిరింపులు Madhavi Latha ఫైర్| Rowdy Rohini| Filmibeat Telugu
కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో


అయితే ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో తాను ఒక నాలుగు రోజులు బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను అని లక్ష్మణ్ చెబుతాడు ఎక్కడికి అని ప్రశ్నిస్తే శైలు పుట్టింటికి వెళ్తున్నామని అంటారు. ఈ ముసలం దెబ్బకు రఘు ఇంటికి వచ్చిన జనార్ధన్ అల్లుడిని కూతురిని తన ఇంటికి తీసుకెళ్లడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చూపించారు. మరి చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X