Vadinamma: జనార్ధన్ ఇంట్లో దూరిన రఘురాంకి షాక్.. దుప్పట్లో వేసి చితక్కొట్టిన లక్ష్మణ్, శైలు.. తీవ్ర గాయాలు!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.. అన్నా వదినలకు పెళ్లి రోజు ఘనంగా చేయాలి అనుకున్న కుటుంబ సభ్యులకు ప్లాన్ విఫలం కావడంతో అదే రోజు రఘు రామ్ కి గుండెపోటు వస్తుంది.. అతను కోలుకోవాలి అంటే అతని బాధ తీరాలి అని అక్కడ డాక్టర్ చెప్పడం తో రిషి తన కొడుకే అనే విషయాన్ని సీత రఘురాం కి చెబుతుంది. దీంతో రఘు రామ్ అప్పటికప్పుడు లేచి కూర్చున్నాడు గాని సీత మీద అసహ్యం పెంచుకుంటాడు.
ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో రిషి తన కొడుకే అనే విషయం తెలిసినప్పటి నుంచి రిషి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాడు.. ఇది చూసి శైలు తట్టుకోలేక పోతుంది. జరిగిన కథ ప్రకారం శైలు తన భర్త లక్ష్మణ్ తో కలిసి తండ్రి ఇంటికి వెళ్ళింది.. బాబుకి అక్కడ ఏదో ప్రమాదం జరిగినట్లుగా రఘురాం కి పీడ కల రావడంతో అతను కూడా ఆ ఇంట్లోకి దొంగలాగా దొరికాడు. నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పేకాట ఆడుతూ బిజీ బిజీగా
రఘురాం సీతను కూడా లేకుండా జనార్ధన్ ఇంటికి బయలుదేరి వెళతారు. జనార్ధన్ ఇంటి బయట సెక్యూరిటీ గార్డు దుప్పటి దొంగతనం చేసి దాన్ని కప్పుకుని తనను ఎవరూ గుర్తుపట్టకుండా లోపలికి వెళ్ళాడు. రఘురాం లోపలికి వెళ్ళే సమయానికి బాబు మళ్లీ మెట్ల మీద నుంచి పడ పోవడానికి సిద్ధంగా ఉంటాడు వెంటనే రఘురాం బాబు ని తీసుకుని కిందకి వస్తారు. అలా వెళ్తున్న క్రమంలో రఘురామ్ చెయ్యి తగిలి అక్కడ ఉన్న ఒక వస్తువు కింద పడిపోయింది. దీంతో అప్పటి వరకు పేకాట ఆడుతూ బిజీ బిజీగా గడుపుతున్న జనార్ధన్, అతని బావమరిది, శైలు, లక్ష్మణ్ ఏమైందో అంటే జనార్ధన్ బామ్మర్ది చూసి రావడానికి వెళ్తాడు.

దొంగతనానికి వచ్చినట్లు
అక్కడ చూస్తే ఎవరో మనిషి దొంగతనానికి వచ్చినట్లు అనిపించడంతో వెళ్లి మిగతా వాళ్ళని కూడా తీసుకు వస్తాడు.. అలా తీసుకు వచ్చిన తర్వాత అందరూ కలిసి రఘురాముని చితకబాదారు. చాలాసేపు పుట్టిన తర్వాత ఎవరో చూద్దామని ముఖం మీద ఉన్న గుడ్డ తొలగించి చూడగా అక్కడ రఘురామ్ దర్శనమిస్తాడు. దీంతో అతను బాబుని ఎత్తుకు వెళ్లడానికి వచ్చాడు అని శైలు ఆరోపిస్తూ ఉండగా లేదు బాబు ఏదో జరిగినట్లు పీడకల రావడంతో ఇక్కడికి వచ్చాను అని అంటాడు. లక్ష్మణ్ అర్థం చేసుకొని ప్రతి విషయానికి అన్నయ్యను తప్పు పట్ట వద్దు అని కోరుతాడు. దీంతో శైలు కోపంతో బాబు ని తీసుకుని లోపలికి వెళ్తుంది.

తప్పు ఏమీ లేదని
అలా దెబ్బలు తగిలించుకుని ఇంటికి వచ్చిన రఘురాం జరిగిన విషయం చెప్పి అందులో వాళ్ళ తప్పు ఏమీ లేదని తప్పంతా నాదే అని అంటాడు. అయితే భరత్ మాత్రం ఇందులో నీ తప్పేమీ లేదని నీ బాబుని కూడా నీకు దక్కకుండా చేస్తున్నారని అంటాడు. అదేంటి నీకు తెలుసా? అంటే నాకు అన్ని విషయాలు తెలుసు అని మీరు పడుతున్న బాధ నేను అర్థం చేసుకోగలను అని అంటాడు.
అలా మొత్తం మీద అ రఘురాం దెబ్బలు తగ్గించుకుని వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సీత వచ్చి నువ్వు ఒక్కడివే వెళ్లి ఉండాల్సింది కాదు నాకు కూడా చెబితే నేను ఏదైనా చేసేదాన్ని కదా అంటుంది. నీకు చెబితే నువ్వు కూడా నాతో పాటు రావడమో లేదా , నువ్వు వెళ్ళకుండా చేయడమో చేస్తావు, నాకు అలా చేయడం ఇష్టం లేదు అందుకే నేను ఇలా చేశాను అంటాడు.

రఘురాం నేరుగా వస్తే
అయితే మరోపక్క జనార్ధన్, జనార్ధన్ బావమరిది ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నది రఘురాం అని నాకు తెలిసి ఉంటే కనుక ఇంకో నాలుగు దెబ్బలు ఎక్కువ వేసేవాణ్ణి కదా అంటాడు, అవునులే దుప్పట్లో ఉన్నాడు కాబట్టి కొడతాను అంటున్నావు రఘురాం నేరుగా వస్తే దుప్పట్లో మనల్ని కొట్టే పరిస్థితులు వస్తాయి అంటాడు. అలా మొత్తం మీద రఘురాం దెబ్బలు తిన్న విషయం మీద కుటుంబ సభ్యులందరూ బాధపడుతుంటారు. లక్ష్మణ్ కూడా తన అన్నయ్య దెబ్బలు తగిలించుకున్న విషయాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు. మొత్తం మీద అలా ఈరోజు ఎపిసోడ్ అయితే ముగించారు ఇక కొద్ది రోజుల నుంచి చూపిస్తూ వస్తున్న కమింగ్ ఎపిసోడ్ మాత్రం అలాగే ఉంచారు.

కమింగ్ అప్
తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం అదే సమయంలో రిషి పుట్టినరోజు రావడంతో దాన్ని గ్రాండ్గా చేస్తాను అని జనార్ధన్ కూతురు అల్లుడు దగ్గర మాట తీసుకోవడం, దానికి రఘురాం సీతా తప్ప మిగతా వాళ్లందరినీ గెలిపించడానికి ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే లక్ష్మణ్ భరత్ కి ఫోన్ చేసి పుట్టినరోజు వేడుకకు రావాలని ఆహ్వానించడమే కాక అన్నయ్య వదినలకు చెప్పవద్దు అని కోరుతాడు.
కానీ జనార్ధన్ మాత్రం నేరుగా రఘురామ్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి దమ్ముంటే రమ్మని చాలెంజ్ చేస్తాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు వెళ్లాల్సిందే అని సీత పట్టుబడుతోంది. ఇదంతా చూస్తుంటే తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే ఎలా కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











