For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : జనార్దన్ ఇంట్లో మాస్ ఎంట్రీ ఇచ్చిన రఘురాం.. కానీ ప్లాన్ రివర్స్.. అదే కొంప ముంచి?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 709 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళ్లిన సంగతి తెలిసిందే. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు ని కాపాడటానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని రఘురామ్ ను దొంగగా భావించి ఇంట్లో అందరూ చితకబాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు శైలు మాట్లాడుతుంది. దీంతో చేసేదేమీ లేక లక్ష్మణ్ ఒక్కడే ఇంటికి వస్తాడు.

  తర్వాత రిషి పుట్టిన రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతూ రఘురాం, సీతను పిలవడం లేదని చెబుతాడు లక్ష్మణ్. ఎలా అయినా అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

   షాకయిన లక్ష్మణ్

  షాకయిన లక్ష్మణ్

  ఫంక్షన్ మొదలయ్యే సమయం కావడంతో లక్ష్మణ్ తన ఇంటి నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అనే విషయం మీద టెన్షన్ పడుతూ ఉంటాడు. అన్నయ్యని పిలవలేదు అది చాలా తప్పు పని, ఒకవేళ నేను వాళ్ల పరిస్థితుల్లో ఉన్నా నేను కూడా అలాగే చేస్తాను. ఇప్పుడు వాళ్లు ఎవరూ రాకపోయినా నాకు ఇబ్బంది అనిపించదు అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు.

  కానీ ఇంతలో భరత్ తన భార్య సిరి తన తల్లి రాజేశ్వరి సహా కూతురు వైదేహిని తీసుకుని వెళతాడు. వాళ్లను చూసి ముందుగా లక్ష్మణ్ షాక్ అవుతాడు. అయితే వాళ్లు వచ్చారని ఆనందపడుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మణ్ రావడం చూసి రాజేశ్వరి కోపంగా తల తిప్పుకుంటుంది. జనార్ధన్ కూడా వీళ్ళు ఎందుకు వచ్చారు? అన్నట్లు చూస్తూ ఉంటాడు. ఇంతలో శైలు వచ్చి మీరు ఇంకా రాలేదు ఏంటి అని ఎదురు చూస్తున్నాను లోపలికి రండి అని తీసుకువెళుతుంది.

   సూపర్ జంట

  సూపర్ జంట

  అలా లోపలికి వెళ్ళిన తర్వాత జనార్ధన బావమరిది లింగం వంట వాళ్ళ కోసం పడుతున్న తిప్పలు చూసిన భరత్ నవ్వుకుంటాడు.. మొత్తం వినేశారా అయితే మా బావకు మాత్రం చెప్పద్దు వంట వాళ్ళు ఎవరు దొరకడం లేదు అనే విషయం మా బావకు తెలిస్తే నన్ను బతకనివ్వడు అని ఉంటాడు. అయితే ఎందుకు దొరకడం లేదు ఎవరో ఒకరు దొరుకుతారు కదా అని భరత్ అంటే ఎవరు దొరకడం లేదని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమని అడుగుతాడు.

  ఇంకేముంది దొరికిందే సందు అన్నట్లుగా ఒక జంట ఉందని వాళ్లు గనక వండితే మీకు ఎవరు వంకలు కూడా పెట్టరు అని అంటాడు. ఎంత ఖర్చైనా పర్లేదు వాళ్లని పిలిపించండి అని వాళ్ళని రప్పించేలాగా ప్లాన్ చేస్తాడు.

  బుక్ అయ్యేవాడిని

  బుక్ అయ్యేవాడిని

  ఇంతకీ వాళ్లు మరెవరో కాదు రఘురాం, సీత. ముందు రఘురాం అంత మందికి అయితే నేను వంట చేయలేను అని తన ఉద్దేశం చెప్పినా ఇంతకంటే మంచి అవకాశం దొరకదు అని చెబుతూ సీత అక్కడికి వెళ్లడానికి రఘురామ్ ని ఒప్పిస్తుంది. అలా ముసలి వంట వాళ్ళ రూపంలో రఘు రామ్ సీత ఇద్దరూ కూడా లక్ష్మణ్ అత్తగారింట్లో అడుగు పెడతారు.. అక్కడ అడుగు పెట్టింది మొదలు లింగంను ఒక రకంగా ఆడుకుంటారు. తాము పిల్లవాడిని చూడకుండా వంట మొదలు పెట్టే ప్రసక్తే లేదని అంటారు.

  అది తమకు ఆనవాయితీ అని ఒక సారి పిల్ల వాడి మొఖం చూపిస్తే మేము వంట పనులు మొదలు పెట్టకుంటామని అంటారు. ఇప్పుడు కష్టంగానీ కొంచెం సేపు ఆగి నేనే తీసుకు వస్తానని చెప్పి లింగం లోపలికి వెళ్లబోతుంటే భరత్ కి చాలా థాంక్స్ అని చెబుతాడు. మీరు గనక లేకపోతే ఇప్పుడు నేను అనవసరంగా బుక్ అయ్యేవాడిని మీ సాయంతో నేను మంచి వాళ్ళని తీసుకు వచ్చాను అని అంటాడు.

  లక్ష్మణ్ అత్తారింట్లో

  లక్ష్మణ్ అత్తారింట్లో

  అలా మొత్తం మీద రఘురాం కుటుంబం అంతా కూడా లక్ష్మణ్ అత్తారింట్లో ఇమిడిపోతారు. వంటలు దగ్గర ఉండి చేయిస్తాను అని చెప్పిన భారత్ తన అన్న వదిన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అయితే వాళ్లు మాత్రం టెన్షన్ పడుతూ నువ్వు ఇక్కడే ఉంటే మనందరం ఒకటే ఫ్యామిలీ అనే విషయం తెలిసిపోతుంది వెళ్లిపోమని అంటారు. అందుకు ఒప్పుకోని భరత్ నేను ఇక్కడే ఉంటాననే సంగతి చెబుతాడు. లింగం నన్ను ఇక్కడ పెట్టాడని నేనే వంట పనులు అన్నీ చేయిస్తానని హామీ ఇచ్చా అని అంటాడు. అలా మొత్తం మీద కుటుంబం అంతా అక్కడ చేరుతుంది ఇక చివరిలో పార్వతి, దుర్గ కూడా రావడంతో నేటి ఎపిసోడ్ ముగించారు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  కమింగ్ అప్ లో

  కమింగ్ అప్ లో

  ఇక తరువాత కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ అనుకోకుండా జరిగిన విషయం అంతా తన అత్త పార్వతికి పూస గుచ్చినట్లు చెప్పడం పార్వతి వెళ్లి ఈ విషయాన్ని జనార్ధన్ కుటుంబ సభ్యులకి చెప్పడంతో పెద్ద కలకలం రేపినట్టు చూపిస్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది? ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? అనే విషయం మాత్రం తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగక తప్పదు.

  English summary
  Vadinamma Episode 709: Bharath prepares a new sketch for Raghuram and sita to enter party.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X