Vadinamma : నిజం తెలిసిన లక్ష్మణ్.. గిల్టీ ఫీలింగ్ పోవడంతో దిల్ ఖుష్.. జనార్ధన్ కి నిజం తెలిసిందా?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 711 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు పడిపోతుంటే కాపాడటానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని రఘురామ్ ను దొంగగా భావించి ఇంట్లో అందరూ చితక బాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు శైలు మాట్లాడుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతూ రఘురాం, సీతను పిలవడం లేదని చెబుతారు లక్ష్మణ్. ఎలా అయినా అక్కడికి వెళ్లాలని ఉద్దేశంతో భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

సాయం చేసినట్టే

సాయం చేసినట్టే


జరుగుతున్న రిషి పుట్టినరోజు వేడుకకు రాను అని చెప్పిన నాని అత్తగారి ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అయితే నాని బాధపడుతున్న సంగతి తెలుసుకుని దమయంతి ఇదేదో మనకు పనికొచ్చే విషయం బాగానే ఉంది అని భావించి అతనిని ఓదారుస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏమైంది మా వల్ల ఏమైనా ఇబ్బంది తలెత్తియందా? అని ప్రశ్నిస్తుంది. అయితే నాని మాట్లాడుతూ మీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు కానీ మనుషులు ఇంత త్వరగా ఎలా మారిపోతారు అర్థం కావడం లేదు. ఒక మొక్క పెరిగింది అంటే పెరిగిన మొక్క ఒక్కదానిదే ఆ క్రెడిట్ కాదు, నీళ్ళు పోసి పెంచిన వాళ్లు కూడా దానికి సాయం చేసినట్టే అని అంటాడు.

మందు తాగను అని

మందు తాగను అని

అయితే అల్లుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకున్న దమయంతి ఆ పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకుని అల్లుడిని ఇల్లరికం ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెట్టింది. ఆ ప్రయత్నంలో భాగంగా తన కొడుకు కిషోర్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు నువ్వు కూడా వెళ్లి జాయిన్ అవ్వు అని కోరుతుంది. అయితే తనకు ఇలాంటి విషయాలు అస్సలు ఇష్టం లేదని మందు తాగను అని చెప్పినా నాని అక్కడికి వెళ్ళకుండా కూర్చుంటాడు. ఇంతలో శిల్ప కల్పించుకుని నీకు కొత్తగా అనిపిస్తే నేను కూడా వస్తాను నేను కంపెనీ ఇస్తాను అని చెప్పి తాగుతున్న అన్న ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తుంది.

తాగను అని మొండి కేసి

తాగను అని మొండి కేసి


అక్కడికి వెళ్ళాక కూడా నాని తాగకుండా కూర్చున్నా సరే ఒక పక్క బావ మరిది మరో పక్క భార్య రెచ్చగొట్టి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో దమయంతి ఎలాంటి ప్లాన్ చేస్తుందో అర్థం కావడం లేదు కానీ తాగను అని మొండి కేసి కూర్చున్న అల్లుడు దగ్గరికి వెళ్లి ఎలా అయినా తాగించడానికి ప్లాన్ చేస్తుంది. అయినా సరే నాని తాగక పోవడంతో కూల్ డ్రింక్ పేరు చెప్పి అందులో ముందుగా కలిపి తాగిస్తారు. మరో పక్క తన కుమారుడికి పాయసం చేసి తినిపించాలని కోరికతో పెద్ద వయసు వాళ్ళ వేషంలో వచ్చిన తన అన్నయ్య వదిన చేత పాయసం చేయిస్తాడు లక్ష్మణ్. తర్వాత పాయసం రుచి చూస్తాను అని చెప్పి నోట్లో పెట్టుకోవటంతో అది తన వదిన చేసిన పాయసం అని అర్థమవుతుంది.

హ్యాపీగా ఫీలవుతారు

హ్యాపీగా ఫీలవుతారు


ఇక అప్పుడు గుర్తుపట్టి వాళ్ళని అడిగితే నువ్వు రావద్దు అన్నానా నిన్ను చూడడం కోసం ఇలా మారువేషంలో వచ్చాము అనే విషయం చెబుతారు. ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు అని బెంగ పెట్టుకుని బాధపడుతున్న లక్ష్మణ్ ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న లక్ష్మణ్ అన్నయ్య వదిన ను చూసి చాలా ఉత్సాహంగా పని చేస్తూ ఉంటారు. తన అత్తయ్య వండిన పాయసాన్ని పక్కకి లాగి వదిన వండిన పాయసం అక్కడ పెట్టడానికి వెళ్లి ఇరుక్కుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగోలా మాయ చేసి పాయసం మార్చేసి తన వదిన చేసిన పాయసాన్ని కొడుకు అన్నప్రాసన అయ్యేలా చేస్తాడు. ఈ అన్న ప్రాసన తతంగాన్ని కూడా రఘురాం సీత బయట కిటికీల లోపల నుంచి చూస్తూ ఉంటారు.. దీంతో ఒక రకంగా రఘు రామ్, సీత, లక్ష్మణ్ అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

ఇక తరువాత కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ ను పార్వతి టార్గెట్ చేస్తుంది. అయితే అలా అనుకోకుండా జరిగిన విషయం అంతా తన అత్త పార్వతికి పూస గుచ్చినట్లు చెప్పడం పార్వతి వెళ్లి ఈ విషయాన్ని జనార్ధన్ కుటుంబ సభ్యులకి చెప్పడంతో పెద్ద కలకలం రేపినట్టు చూపిస్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది? ఎలాంటి ఇబ్బందులు తలెత్తనున్నాయి? అనే విషయాలు మాత్రం తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X