Vadinamma: డిశ్చార్జ్ అయిన రఘురాం.. శైలుకు కొత్త అనుమానం.. విషయం లీక్ చేసిన భాస్కర్!

రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకున్న తర్వాత రఘురాంకు గుండె పోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడంతో రఘు రామ్ చికిత్సకు స్పందించడం లేదని చెబుతూ డాక్టర్ తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో దమయంతి, జనార్ధన్, పార్వతి ఇంటికి వచ్చి రఘురాం ఇక బతకడు అని చెబుతూ ఉన్న ఆస్తిని పంచాలని కోరతారు. సీత దెబ్బకు వాళ్లంతా వెళ్ళిపోతారు. అయితే రాజేశ్వరి మాటలకు బాధ పడ్డ సీత తన కొడుకు రిషి గురించి రఘురామ్ కి చెప్పాలని ఫిక్స్ అవుతుంది. అలా రఘురామ్ కి ఈ విషయం చెప్పడంతో ఆయన లేచి కూర్చున్నాడు. ఇక సీత తనకు ద్రోహం చేసిందని బాధ పడుతూ ఆమెను నానా మాటలు అంటాడు. విషయం తెలుసుకున్న సీత తల్లి సుశీల సీత ఇంటికి వచ్చి రచ్చ చేసినట్టు చూపించారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 సుశీల రచ్చ

సుశీల రచ్చ

సీత తల్లి సుశీల ఇంటికి రావడమే కాక రిషి నా మనవడు అని చెబుతూ శైలు దగ్గరనుంచి బాబును వాక్కుని తాను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది.. అంతేకాక నీకోసం మా కూతురు వీడిని త్యాగం చేసింది అని చెబుతూ శైలు మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుంది. అక్కడికి వచ్చిన లక్ష్మణ్ చెప్పినా ఆమె వినడం లేదు. సిరి, రాజేశ్వరి లాంటి వాళ్ళు చెబుతున్నా వినే పరిస్థితి కనిపించడం లేదు. రాజేశ్వరి చెబుతుంటే నలుగురు పిల్లల్ని కన్న నీకు నా కూతురు అమ్మతనం ఏమిటో అర్థం కావడం లేదా అని ప్రశ్నిస్తుంది. ఇక దీంతో సీత వెంటనే ఇక్కడి నుంచి అమ్మని వెనక్కి తీసుకుని వెళ్ళకపోతే మన ఇద్దరి మధ్య సంబంధాలు ఇకమీదట ఉండవు అని అన్న భాస్కర్ కి తేల్చి చెబుతోంది.

అంతా ఊహే

అంతా ఊహే

ఈ విషయం విని సీత తల్లి సుశీల బాధపడుతూ బాబుని శైలుని ఇవ్వడమే కాక నువ్వు నన్ను బాధ పెట్టావు నీ కొడుకుని ఇచ్చేస్తున్నాను ఇక మీద నువ్వు నాకేమీ కావు అని చెబుతూ బయటకు వెళ్ళిపోతుంది.. బయటకు వెళ్లిన తర్వాత ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గా చూపించారు. అయితే ఇదంతా భాస్కర్ ఊహగా చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఒకవేళ తాను తల్లికి నిజం చెబితే ఇలా జరిగే అవకాశం ఉందంటూ తల్లికి ఏ మాత్రం నిజం చెప్పకూడదు అని అనుకుంటాడు.. అలా అనుకుంటూ ఏమీ లేదు బావగారు అలా ఉండటం చూసి బాధగా ఉంది అంటారు.. అయితే సీత తల్లి సుశీల నేను కూడా మీ బావను చూస్తాను నన్ను కూడా తీసుకు వెళ్ళు అంటే ఇప్పుడు ఈమెను తీసుకు వెళితే అనవసరమైన తలనొప్పి ఎందుకు అని భావించి ఇప్పుడు కాదు తర్వాత వెళ్దాం అన్నాడు..

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

అయితే దుర్గ మాత్రం ఇప్పుడే వెళ్దాం మీరు రాకపోయినా పర్వాలేదు అత్తయ్య నేను తీసుకు వస్తాను అంటుంది.. ఇదేంటి నేను వద్దనుకుంటే తీసుకు వెళతాను అంటుంది ఇది నా కొంప ముంచేలా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. మరోపక్క రఘురాం కోల్పోవడంతో ఆయనను డిశ్చార్జి చేస్తామని డాక్టర్ చెబుతారు. ఏమైనా చెకప్ కి తీసుకురావాలంటే అదేమీ అవసరం లేదని మామూలుగా అయితే చాలా ఇబ్బంది పడే వాళ్ళు కానీ, మీ సీతక్క ఏం చెప్పిందో తెలియదు కానీ రఘురాం మాటలతో కోలుకున్నాడు అని చెబుతారు డాక్టర్. ఇదే విషయాన్ని రఘురాం కి తమ్ముళ్ళు చెబితే అదేమీ లేదులే అసలు మీ సీతక్క లేకపోతే నాకు గుండెపోటు కూడా వచ్చేది కాదు కదా అన్నట్లు మాట్లాడుతారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రఘురాం ఇంటికి చేరుకుంటాడు.

కొత్త అనుమానాలు

కొత్త అనుమానాలు

ఇంటికి వచ్చాక కూడా సీతతో దూరంగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యులలో కొత్త అనుమానాలు రేకెత్తించి విధంగా చేస్తూ ఉంటాడు. అయితే వచ్చి రావడంతోనే ఋషిని గుండెలకు హత్తుకుని ముద్దాడుతూ ఉండడంతో శైలు బాధపడుతుంది ఒకవేళ రిషి ని పూర్తిగా వాళ్లకి ఇచ్చేస్తాను అని లక్ష్మణ్ ఏమైనా మాట ఇచ్చాడా ? అని, అయినా ఇచ్చి ఉండలేదు అంత త్యాగం ఎందుకు చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది శైలు. ఆమె ప్రవర్తన చూసి బాధ పడిన సిరి మీరు అసలే గుండెనొప్పి మీరు గుండె మీద ఎక్కించుకుని ఇబ్బంది పడతారు ఎందుకు ఇచ్చేయండి అన్నట్లు మాట్లాడుతుంది. అయితే అదేమీ లేదని వాడు నా గుండె బరువు కాదు వీడే నా గుండెకు రక్షణ అన్నట్లుగా మాట్లాడుతాడు రఘురాం, తన గుండెకు ఏమీ కాదని అంటాడు.

Recommended Video

Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
కమింగ్ అప్ ప్రకారం

కమింగ్ అప్ ప్రకారం

ఈ అక్కడితో నేటి ఎపిసోడ్ ముగించిన తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం తన భార్య తల్లితో కలిసి రఘురామ్ ఇంటికి వెళ్ళిన భాస్కర్ మా మేనల్లుడు ని ఒక్కసారి ఇలా ఇవ్వు గుండెలకు హత్తుకుంటా అంటాడు. అది విని షాక్ అయిన రఘురాం తో నాకు అంతా తెలుసు మీరు మాట్లాడుకుంటున్న మాటలు నేను విన్నాను అంటాడు. ఇంతలో దుర్గ అనుమానంగా చూస్తూ ఉంటుంది. దీంతో తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే విషయం మీద ఆసక్తి చెలరేగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X