Vadinamma: రఘురాం ఇంట విషాదం.. బాబుకు తీవ్రరక్తస్రావం.. జనార్ధన్ ఎంట్రీతో కీలక మలుపులు?
రఘు రామ్- సీతల పెళ్లి రోజు తర్వాత రఘురాంకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తారు. అయితే సీత రిషి గురించి నిజం చెప్పడంతో ఆయన కోలుకుంటాడు కానీ సీత మీద అసహ్యం పెంచుకుంటాడు, కోలుకుని ఇంటికి వచ్చిన రఘురాం ఎక్కువగా తన కొడుకు రిషితోనే సమయం గడుపుతూ ఉంటాడు. ఒకానొక రోజు రిషిని తీసుకుని షాప్ కు బయలుదేరి వెళ్ళడంతో శైలు పెద్ద రచ్చ చేస్తుంది. బాబు రాగానే వెంటనే లాక్కుని ఎత్తుకున్న శైలు ఇకమీదట ఎవ్వరికీ ఇవ్వనని, నా దగ్గరే ఉంటాడు అని అంటుంది.
అయితే బాబు విషయంలో బాగా భయపడిన శైలు అర్ధ రాత్రుళ్ళు కూడా లేచి ఏడుస్తూ ఉంటుంది. స్నానానికి వెళ్లి బయటకు వచ్చేలోపు బాబుతో రఘు ఆడుకుంటూ ఉంటాడు. దీంతో ఆమె వెళ్లి బాబుని లాక్కుని మరీ వచ్చేసింది. లోపలికి వెళ్ళాక కూడా నిష్టూరంగా మాట్లాడుతుంది. ఇక అలా గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాబుకు తీవ్ర గాయాలు
అయితే రఘురాం మీద కోపంతో శైలు బాబు ని తీసుకుని పైకి వెళ్లి పోతుంది. అలా పైకి వెళ్లి పోయి నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా ఇక్కడే ఉండాలి నేను ఎవరి దగ్గరికి నిన్ను పంపించింది లేదు. అని చెబుతూ నీ బొమ్మ తీసుకువచ్చి పడేస్తాను వాటి తో ఆడుకోమని లోపలికి వెళ్తుంది. అలా బొమ్మలు తీసుకోవడానికి వస్తున్న సమయంలో రఘురాం మెట్లు దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటారు.
రఘురాం ని చూసిన బాబు కిందకి నడుచుకుంటూ వచ్చే క్రమంలో మెట్ల మీద నుంచి కింద పడతాడు.. దీంతో బాబు కు తీవ్ర గాయాలు అవుతాయి. అయితే నేను ఏమీ చేయలేదని వాడే కావాలని కింద పడ్డాడు అని శైలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే నీ బొమ్మల పిచ్చి వల్ల బాబు కింద పడ్డాడు అని కుటుంబ సభ్యులు ఆమె నిందిస్తారు.. వెంటనే బాబుని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు.

బాబు కి ఏమైంది?
హాస్పిటల్ కి తరలించిన తర్వాత వచ్చిన బాబు కి ఏమైంది అంటూ డాక్టర్ పరిశీలించకుండానే డాక్టర్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అసలు అంతా చూడనివ్వండి బాబుకి ఏమైందో అంటూ డాక్టర్ లోపలికి వెళ్ళాడు, చూసిన తర్వాత బాబు కు తీవ్ర గాయాలయ్యాయని రక్తస్రావం జరిగింది అని చెబుతాడు. వెంటనే బాబు బ్లడ్ గ్రూప్ ఏదో చూసి రక్తం ఎక్కించక పోతే ప్రాణాలు కాపాడటమే కష్టం ఉన్నట్లు మాట్లాడుతారు.
మామూలుగా బాబుకు తల్లి లేదా తండ్రి బ్లడ్ గ్రూప్ వస్తుంది కాబట్టి ఎవరో ఒకరి రక్తం ఇవ్వాలి అని అంటారు. శైలు నా రక్తం తీసుకోండి అనడంతో మీ బ్లడ్ గ్రూపు ఏమిటో చెక్ చేస్తాము రమ్మని అంటారు. అయితే సీతకు బాబు బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసు, శైలు బ్లడ్ గ్రూప్ అది కాదు అని తెలియడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లి ఇలా బాబును మార్చుకున్న సంగతి చెప్పి మీరు ఎలాగైనా మేనేజ్ చేయండి మా ఆయన అర్థం ఇస్తాడు అది వాళ్ళకి తెలియకుండా ఎక్కించండి అన్నట్లు చెబుతుంది.

పరిస్థితి అంతా వివరించి
అందుకు సమ్మతించిన డాక్టర్ రఘురాం రక్తం తీసుకోవడానికి సిద్ధమవుతాడు, సీత రఘురాం దగ్గరికి వెళ్లి పరిస్థితి అంతా వివరించి నువ్వు వెళ్లి తత్వం ఇవ్వమని అడుగుతుంది. అయితే రఘురాం రక్తం ఇస్తున్న సమయంలో ముందుగా లక్ష్మణ్ చూస్తాడు. ఎవరికి రక్తం ఇస్తున్నాడు అంటే పొరపాటున సీత నోరుజారి బాబుకు అంటుంది. ఎందుకు అలా అని అడిగితే అప్పుడు కవర్ చేసుకోవడం కోసం వేరే అబ్బాయి సైకిల్ మీద నుంచి కింద పడితే అతని కోసం రక్తం ఇస్తున్నాడు అని అంటుంది.

సేవా కార్యక్రమాలు అవసరమా?
ఈ సమయంలో సేవా కార్యక్రమాలు అవసరమా మనం ఎంత టెన్షన్ లో ఉన్నామో, కదా అంటే ఎవరు బాబు అయినా బాబే కదా మనం ఒకరికి సహాయం చేస్తే మనకు సహాయం అందుతుంది అంటుంది సీత. ఇక ఆ తర్వాత రఘురాం రక్తం ఇచ్చి బయటకు వచ్చాక సీతను నానా మాటలు అంటాడు. నువ్వు వాళ్ల పరిస్థితి ఆలోచిస్తున్నావ్ కానీ నా బాధ అర్థం చేసుకోవా, బాబు చూశావో వాడినా రక్తమే అంటాడు..
Recommended Video

జనార్ధన్ ఎంట్రీ
ఆ తర్వాత రఘురాం రక్తం వచ్చిన విషయం శైలుకు తెలుస్తుంది, ఎవరికి రక్తం ఇచ్చారు అని ప్రశ్నించగా ఏమనాలో తెలియక వేరే అబ్బాయి కోసం వచ్చాను అంటాడు. ఇక్కడికి వచ్చి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు మాత్రం మంచిగా అనిపించుకోవాలి అన్నట్లు మాట్లాడుతుంది. అయితే రఘురాం అసలు బాబు అలా ఎందుకు వదిలేసావు అన్నట్లు సీరియస్ అవుతాడు. నేను వాడి మీద ఇష్టం లేక కాదు వదిలేసింది మీద కోపంతో మిమ్మల్ని ఏమీ అనలేక వాడి మీద కోపం చూపించాను చివరికి ఇలా అయింది అని ఆమె అంటుంది.
ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండగానే నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తర్వాత ఎపిసోడ్ లో బాబు కోలుకొని బయటకు వచ్చినట్లు చూపించారు. అయితే జనార్దన్ ఎంట్రీతో కుటుంబంలో మరిన్ని సమస్యలు మొదలయ్యే అవకాశాలు కూడా చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











