Vadinamma :25 లక్షల బ్యాగ్ లో చిత్తూ కాగితాలు.. శిల్ప అన్నతో కలిసి శైలు తండ్రి స్కెచ్.. రఘురామ్ కి భారీ షాక్!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 670వ ఎపిసోడ్ కి చేరింది. ఇప్పటికే శిల్ప తన తల్లి దుర్మార్గాలు తెలుసుకుని మంచిగా మారుతూ పచ్చళ్ళు కూడా పెట్టి అమ్ముతూ ఉంటుంది. కట్టాల్సిన ఆ డబ్బు కూడపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చూపారు. ఇక అలా మొత్తానికి పాతిక లక్షల రూపాయలు కుటుంబమంతా కలిసి కూడపెడతారు ఆ డబ్బు అమరేశ్వర్ కి ఇవ్వడానికి రఘురామ్ సిద్ధం కాగా ఇవాళ జాతర పనులలో బిజీగా ఉన్నానని రేపు జాతరకు వచ్చే సమయంలో మీరు తీసుకురావాలని అమరేశ్వర్ అంటాడు. ఇక ఆ రోజు రాత్రి ఇంట్లో దొంగ పడ్డాడు. దుర్గమ్మ దగ్గర పెట్టిన పాతిక లక్షల రూపాయలు కనపడక పోవటంతో ఆ డబ్బులు ఏమైపోయాయి అందరూ కంగారు పడుతూ దొంగను కొడతారు. అయితే చివరికి ఆ దొంగ నేను డబ్బు దొంగతనం చేయడం కోసం రాలేదని భోజనం తినడానికి వచ్చాడు అని అంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

దొంగ దొరికి

దొంగ దొరికి


దొంగతనానికి వచ్చిన వ్యక్తి డబ్బులు దొంగతనం చేయకుండా ఆ డబ్బు జాగ్రత్తగా దుర్గామాత విగ్రహం కింద పెడతాడు. తాను బాగా బతికిన వాడినని కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బాగోలేక రాత్రి సమయంలో సీసాలు, పాత కాగితాలు ఏరుకుంటూ ఉన్నానని ఇప్పుడు ఆకలి వేసి ఇంట్లో ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చానని అంటాడు. మరి డబ్బు సంచీ ఏమైపోయింది అంటే దుర్గామాత విగ్రహం కింద పెట్టాను అని నాలాగే దొంగలు వస్తే ఆ డబ్బు దొంగిలించ కూడదు అనే ఉద్దేశంతో అలా చేశాను అని అంటాడు.

జాతరకు ప్రయాణం

జాతరకు ప్రయాణం

అతని మాటలు విని సీత అది నిజమేనని నమ్మి అమ్మవారికి నైవేద్యంగా ఉంచిన పంచభక్ష్య పరమాన్నాలు తీసుకువచ్చే అతనికి వడ్డిస్తుంది. అదేంటి అలా చేసావు అని కుటుంబ సభ్యులు అడిగితే ప్రతిరోజు మన ఇంటికి వచ్చే సాధువు ఈ రోజు రాలేదు ఆయనకు అని తీసి పెట్టిన భోజనం ఈయనకి పెడుతున్నాను. ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆకలితో బయటకు పంప కూడదు అని ఆమె అంటుంది. సీత చేసిన పనికి ముందు కోపం వచ్చినా ఆమె మంచి మనసు చూసి కుటుంబం అంతా ఆనందపడుతుంది. ఇక ఆ తర్వాతి రోజు ఉదయాన్నే అందరూ లేచి స్నానాదులు పూర్తిచేసుకుని దుర్గామాత పూజ లో మునిగి తేలుతుంటారు.. ఇక ఆ తర్వాత అందరూ కలిసి ఊరిలో జరుగుతున్న జాతర ప్రదేశానికి బయలుదేరుతారు. ముందు నుంచి కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వస్తున్న రఘురాం ఈ సారి కూడా డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంచుతాడు.

డబ్బులు బ్యాగ్ తో

డబ్బులు బ్యాగ్ తో

జాతర జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా అడుగుతూ ఉంటారు. శిల్ప కు ఇది అంతా కొత్తగా కనిపించడంతో ఆమె చిన్న విషయానికి కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయితే ఎంత సేపటికీ అమరేశ్వర్ అక్కడ కనిపించకపోవడంతో అతను ఎక్కడున్నాడో వెతికి వస్తాను అంటూ సీతకు డబ్బులు బ్యాగ్ అందించి రఘురాం వెళతాడు. రఘురాం అలా వెళ్లాడో లేదో శైలు కుమారుడు రిషి ఏడుస్తూ ఉంటాడు.

 రఘురామ్ ఒకపక్క, సీత ఒకపక్క

రఘురామ్ ఒకపక్క, సీత ఒకపక్క

అయితే వాడి కడుపు నొప్పి గా ఉందేమో వాష్ రూమ్ కి తీసుకు వెళితే ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తారు. గుడి దగ్గర అలా చేస్తే బాగోదు అని దూరంగా వెళ్లి ఏమైందో చూస్తా అని శైలు అంటుంది నేను కూడా వస్తాను అని సీత అనడంతో డబ్బులు నాకు ఇవ్వండి నేను జాగ్రత్తగా పట్టుకుంటాను అని నాని అంటాడు. అలా రఘురాం ఒక వైపు, సీత, శైలు ఒకవైపు వెళితే నాని-శిల్ప, భరత్-సిరి, లక్కీ మాత్రం ఒక చోట ఉంటారు. డబ్బు బ్యాగ్ పట్టుకుని నాని చాలా జాగ్రత్తగా పట్టుకుని ఉంటాడు.

Recommended Video

Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
మళ్ళీ డబ్బు మాయం

మళ్ళీ డబ్బు మాయం

అలా డబ్బు బాగా అందుకున్న నాని చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకున్నాడు. కానీ అనేక సంఘటనలు అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే జాతరకు ఊహించని విధంగా శైలు తండ్రి వస్తాడు. మరోపక్క కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికి వచ్చిన శిల్ప అన్న కిషోర్ తో శైలు తండ్రి చేతులు కలిపి ఇద్దరు పెద్ద ప్లానే అమలు చేయడానికి సిద్ధమైనట్లు గా కనిపిస్తోంది. రఘురాం అమరేశ్వర్ ని కలిసిన తర్వాత అమరేశ్వర్ ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకు వెళ్తాడు.. ఇదంతా జరుగుతూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ముగించారు. ఇక తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్పు ప్రకారం శిల్పా అన్న కిషోర్ పెట్టిన ఒక మనిషి నాని కళ్లుగప్పి అతని చేతిలో బాగ్ మారుస్తాడు. చేతికి అందిన డబ్బులు అన్నీ మళ్ళీ మాయం కావడంతో రఘురాం కుటుంబ సభ్యులందరూ చాలా దారుణమైన పరిస్థితి అనుభవిస్తూ ఉంటారు. దాదాపు వాళ్ళందరూ ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండే అవకాశాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X