For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma :కిషోర్ ను చంపబోయిన నాని.. సీత క్షమాపణతో మారిన పరిణామాలు.. వణికిపోయిన దమయంతి!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలా ఈ సీరియల్ ఈ రోజుతో 675వ ఎపిసోడ్ కి చేరింది. కుటుంబంలో ఒక్క సమస్య తీరుతున్నట్లే కనిపిస్తున్నా కొత్త కొత్త సమస్యలు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. అమరేశ్వర్ అనే వ్యక్తి దగ్గర తీసుకున్న 25 లక్షల అప్పు తీర్చడం కోసం జాతర కి వెళితే ఆ జాతరలో ఆ డబ్బు దొంగతనం జరిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.. సీత సమయస్ఫూర్తితో ఆ డబ్బు మళ్లీ దొరుకుతుంది. అయితే ఆ డబ్బులు దొంగలించిన కిషోర్ అంతు చూస్తానని శిల్ప వార్త నాని దమయంతి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన నాని రచ్చ చేసి అతనిని చంపబోయే సమయంలో సీత అలాగే మిగతా కుటుంబ సభ్యులు వెంటనే ఎంట్రీ ఇస్తారు. అతనిని వదిలేయమని సీత కోరడంతో వెంటనే వదిలేస్తాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు, ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ప్రకారం ఏం జరిగింది అనేది పరిశీలిద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  అడ్డంగా దొరికేసి

  అడ్డంగా దొరికేసి

  చాలా సైలెంట్ గా ఉండే నాని వైలెంట్ గా మారి తన కొడుకు మీద ఎందుకు ఎటాక్ చేస్తున్నాడు అనే విషయం అర్థం కాక ఒక పక్క దమయంతి మరో పక్క దమయంతి భర్త అలాగే దమయంతి పెద్ద కుమార్తె పెద్దల్లుడు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.. అసలేం జరిగింది ఎందుకు మా వాడిని కొడుతున్నావ్ అని దమయంతి అడిగితే ఎందుకు కొడుతున్నారు అనే విషయం తెలియదా ? నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటో మీ అమ్మ ముందు మీసం మెలేసి చెప్పలేదా అని సీత అడుగుతుంది. తర్వాత అసలు జరిగిన విషయం అంతా కుటుంబ సభ్యులందరికీ వివరిస్తారు. ఈ విషయం అర్ధం అయిన తర్వాత రాజశేఖర్ బాధపడుతూ వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడుతున్నాను. దయచేసి వీడిని క్షమించండి అని అంటాడు.

  సీత అండ్ తో ఏమన్నారంటే

  సీత అండ్ తో ఏమన్నారంటే

  క్షమించడానికి వాడు చేసింది మామూలు తప్పుకాదని పాతిక లక్షల రూపాయల దొంగతనం సీత కుటుంబ సభ్యులు అంటారు.. వీడిని ఇలాగే వదిలేయకూడదు పోలీసులకు పట్టించాలి అని భరత్ అనడంతో లక్ష్మణ్ కూడా నేను ఇప్పటికే పోలీసులు పిలిచాను వాళ్ళు ఇంటికి వస్తున్నారు అంటారు. లక్ష్మణ్ అన్నట్లుగానే పోలీసులు ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకుని అసలేం జరిగింది అని ప్రశ్నిస్తే కిషోర్ కి భయం వేసి అమ్మ దగ్గరికి వెళ్లి నన్ను రక్షించు అని అడుగుతాడు, అయితే దమయంతి ఏమీ మాట్లాడలేక షాక్ లో ఉండి పోతుంది.. అయితే రాజశేఖర్ మాత్రం వాడు చేసింది ముమ్మాటికీ తప్పే దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోండి అని కోరుతాడు..

  ఫైనల్ గా క్షమించి

  ఫైనల్ గా క్షమించి

  అయితే దానికి సిరి మాట్లాడుతూ క్షమించాలి అంటే కిషోర్ ఇలా పెరిగి ఇలా జనాన్ని ఇబ్బంది పెట్టడానికి గల కారణం అయిన దమయంతి వచ్చి సీత కాళ్ళ మీద పడితే అప్పుడు క్షమిస్తామని అంటారు.. ఏం శిల్ప నేను ఏమైనా తప్పుగా అన్నానా అంటే లేదు ఈ విషయంలో నేను నా అత్తారింటికి సపోర్ట్ చేస్తున్నాను మా ఇంట్లో ఎవరూ క్షమాపణకు అర్హులు కారు అని ఆమె అంటుంది. ఇంతలో శిల్పా అక్క వచ్చి దయచేసి ఇక్కడితో వదిలేయండి, వాడు చేసింది తప్పే ఇకమీదట మీ కుటుంబం జోలికి రాకుండా నాది బాధ్యత అతని జైలుకు వెళితే జీవితం నాశనం అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి శిల్పా ఈ ఒక్కసారికి నువ్వైనా చెప్పు అంటుంది. దానికి శిల్ప నేను ఈ విషయంలో ఏమీ చెప్పలేను దీంట్లో తుది నిర్ణయం మా సీతక్కదే అని తేల్చేస్తుంది. అయితే సీత మాట్లాడుతూ శిల్పాకు నాని అన్న అయితే నాకు తమ్ముడు, మా తమ్ముడిని నేనే జైల్లో పెట్టించ లేను ఇకమీదట అయినా మారతాడని భావిస్తున్నాను అని చెప్పి పోలీసులకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి పంపించి వేస్తుంది.

  నాని అంటే వణుకు

  నాని అంటే వణుకు

  ఇక అలా కుటుంబ సభ్యులు అందరూ వెనక్కి వచ్చేస్తారు. మాని శిల్ప బాధ పడుతుంది అనే ఉద్దేశంతో మీ అన్నయ్యని కోపంతో కొట్టాను ఫోన్ చేసి ఇస్తే క్షమాపణ అడుగుత అంటాడు. లేదు నువ్వు ముందునుంచి చెబుతూనే ఉన్నావు మీ అన్న వదిన జోలికి ఎవరూ వచ్చిన వాళ్లని వదలను అని ఈ విషయంలో మా అన్నది తప్పు కాబట్టి నాకు ఎలాంటి కోపం లేదు అని చెబుతుంది. మరోపక్క లక్ష్మణ్ శైలు మాట్లాడుకుంటూ ఇక మీదట నాని సరదాగా ఆట పట్టించుకోకూడదు వాడికి కోపం చూస్తే భయమేస్తోంది అనుకుంటారు.

  ఫెయిల్ అయిన భరత్

  ఫెయిల్ అయిన భరత్

  ఇక మరోపక్క భరత్ రాసిన పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ దగ్గరకు రావడంతో భరత్, సిరి రిజల్ట్స్ వెతకడం కోసం బయలుదేర సీత రావడంతో ఆ హాల్ టికెట్ కింద పడిపోతుంది. కాసేపు అలా అలా మేనేజ్ చేసిన తర్వాత ఆ హాల్ టికెట్ తీసుకుని పరీక్ష ఫలితాలు వెలువడుతున్న సమయానికి పేపర్ సంపాదించడం కోసం బయట వెళతారు. ఇక అక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో ఈ పరీక్షలో భరత్ పాస్ అవ్వలేదు అన్నట్లుగా చూపించారు. మరి చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Sita forgives Krishore on Rajashekar's request. Elsewhere, Siri motivates Bharat when he feels nervous about his exam results.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X