For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : రఘురామ్ ఫ్యామిలీలో కొత్త టెన్షన్.. అంతా ఓకే అనుకున్న సమయంలో అంతా రివర్స్!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ 663 వ ఎపిసోడ్ కి చేరింది. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ గడిచిన ఎపిసోడ్లో దమయంతి భర్త రాజశేఖర్ మీ ఇంట్లో జరిగిన అన్ని ఉపద్రవాలకు కారణం తన భార్య అని చెబుతూ రఘురాం ఇంటికి వెళ్లి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే శిల్ప కూడా మా ఇంట్లో మనిషి అని మేము అర్థం చేసుకోగలం అని చెబుతూ రఘురాం కూడా ఆమెను పిలిచి ఇక మీదట జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో ఇంక కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని భావిస్తారు. అయితే మరో పక్క లక్ష్మణ్ కి ఉద్యోగం వచ్చినా సరే ఆయన చేయను అని చెప్పడం శైలు కి తలనొప్పిగా మారింది. ఎలా అయినా లక్ష్మణ్ చేత ఉద్యోగం చేయించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   ఉద్యోగ్యం చేయనన్న లక్ష్మణ్

  ఉద్యోగ్యం చేయనన్న లక్ష్మణ్

  శైలు లక్ష్మణ్ ని ఎంత అడిగినా ఉద్యోగం చేయను అని అంటాడు. ఎందుకు చేయవు ఈ ఊరిలోనే కదా ఉద్యోగం అంటే ఏ ఊరిలో ఉద్యోగమైనా అన్నయ్యల తో కలిసి షాప్ కి వెళ్లడం అలవాటు అయింది. ఇప్పుడు భరత్, అన్న ఇద్దరినీ వదిలేసి నేను వేరే ఉద్యోగానికి వెళ్లడం నచ్చడం లేదు అంటాడు. కానీ నువ్వు ఉద్యోగానికి వెళ్లడం నాకు రిషికి ఇష్టం అని శైలు చెబుతుంది. అయినా సరే తనకు ఇష్టం లేదు అని లక్ష్మణ్ చెబుతుంటే నువ్వు ఎవరు చెబితే వింటావో మాకు తెలుసు అంటూ రఘురామ్ కి చెప్పడానికి వెళుతుంది.

  మొండి

  మొండి

  అయితే మరోపక్క రఘురాం లెక్కలు రాసుకుంటూ ఉంటే సీత తన అత్త గారికి కాళ్లు నొక్కుతూ ఉంటుంది. ఎన్నిరోజులు ఇలా రాసుకుని ఇబ్బందులు పడతారు ఒక లాప్టాప్ కొనుక్కోవచ్చు కదా అని సీత అంటుంది.. మాకు ఈ ఇబ్బంది అలవాటు అయిపోయింది అని రఘురామ్ అంటాడు. మొండివాడు అలాగే ఉంటారు, ఎందుకత్తయ్యా ఇలాంటి మొండి వాడిగా పెంచారు అన్నట్లుగా సీత మాట్లాడితే ఎందుకురా కోడలు చేత నన్ను తిట్టుస్తున్నావా అని తల్లి ప్రశ్నిస్తుంది.

   ఉద్యోగానికి వెళ్ళను అంటూ

  ఉద్యోగానికి వెళ్ళను అంటూ

  వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న తరుణంలోనే శైలు వచ్చి ఇలా లక్ష్మణ్ ఉద్యోగానికి వెళ్ళను అంటున్నాడు అనే విషయాన్ని చెబుతుంది. మీరు చెబితే లక్ష్మణ్ వింటాడు అని కాక పోతే భయపెట్టే విధంగా కాకుండా కొంచెం నెమ్మదిగా మందలించమనీ కోరుతుంది. వెంటనే సీత ఇంట్లో మగ వాళ్లు అందరూ మొండి వాళ్లే అనడంతో రఘురాం కి కోపం వస్తుంది. వెంటనే తమ్ముని గట్టిగా పిలుస్తాడు అలా పిలవడం తో సిరి, భారత్ కూడా పరిగెత్తుకుని వస్తారు. వచ్చాక నువ్వు ఉద్యోగానికి ఎందుకు వెళ్లడం లేదు అని రఘురామ్ ప్రశ్నిస్తాడు. నాకు వెళ్లడం ఇష్టం లేదు అని లక్ష్మణ్ చెబుతాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. తర్వాత నువ్వు చెప్తున్నావ్ కాబట్టి ఒప్పుకుంటాను అన్నయ్య అని లక్ష్మణ్ అనడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.. వెంటనే లక్ష్మణ్ బుగ్గ మీద ముద్దు పెట్టి శైలు సిగ్గుతో లోపలికి పరిగెడుతుంది.

   నైట్ కాలేజ్ లో భరత్

  నైట్ కాలేజ్ లో భరత్

  ఇక మరోపక్క భరత్ నైట్ కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అయితే నైట్ కాలేజీ కి వెళ్ళేది భారత్ అయితే డ్రాప్ చేయడానికి వెళ్లాల్సిన సిరి అయితే ఆమె కాలేజీకి వెళుతున్నట్లుగా రెడీ అవుతుంది.. అయితే ఇద్దరు రెడీ అయ్యారు కానీ బయటకు వెళ్లేందుకు మాత్రం ఇంట్లోనే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముందు సిరి బయటకు వెళ్లి ఎవరు లేకుండా ఉంటే పిలుస్తాను అని అనడంతో సరే అంటాడు. అయితే సిరి ఎలా బయటకు వెళ్లిందో లేదో ఎవరో ఒకరు ఆమె అడ్డు పడుతూనే ఉంటారు. చివరికి ఎట్టకేలకు ఇద్దరూ కలిసి నైట్ కాలేజీ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక సిరి భారత్ ని డ్రాప్ చేసి నీ నిద్ర కూడా నేనే పోతాను లే అని సరదాగా మాట్లాడుతూ వెనక్కి వెళ్లి పోతుంది. ఇక భారత్ కూడా కాలేజీలో కొంత అలవాటు పడతాడు. తనకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటే భరత్ కూడా ఆనందపడతాడు.

  మరో ఉపద్రవం

  మరో ఉపద్రవం

  అదే సమయంలో రఘురాం ఒక గులాబీ మొక్క తీసుకొచ్చి ఇంట్లో నాటుతారు. ఆ గులాబీ మొక్క ఎలా అయితే దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ పూలు కాసేదాకా వెళుతుందో భరత్ కూడా అలాగే దిన దిన ప్రవర్ధమానంగా చదువుతూ మంచి జ్ఞానం పెంచుకుంటాడు. అయితే గత మూడు రోజుల నుంచి ఒకటే కమింగ్ అప్ ను చూపిస్తూ వస్తున్నారు. అలా ఈ రోజు కూడా పాత కమ్మింగ్ అప్పుడే చూపిస్తూ రాబోతున్న ఎపిసోడ్ మీద ఆసక్తి పెంచారు. రఘురాంకి 25 లక్షలు అప్పు ఇచ్చిన వ్యక్తి వెంటనే ఆ డబ్బు కావాలని తనకు బ్యాంక్ లోను రావడంతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెబుతాడు.

  English summary
  Vadinamma Episode 663: Rajashekar confronts Raghuram about Dhamayanthi's evil deeds and apologises to him on behalf of her. Elsewhere, Shailu gets upset as Laxman rejects a job opportunity.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X